‘బాబోయ్ శశికళ మాకొద్దు.. ఎన్నికలు పెట్టండి’
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టడం అక్కడి ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదా? తమకు ఆమె సీఎంగా వద్దే వద్దని అంటున్నారా? ఒక వేళ సీఎంగా ఆమె పీఠంపై కూర్చుంటే తమిళ తంబీలు ఆగ్రహంతో నిరసనలకు దిగుతారా? అంటే ప్రస్తుతం ఏర్పడుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం, శశికళను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకోవడం రెండు మూడు రోజుల్లో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారంటూ వార్తలు రావడం నేపథ్యంలో చేంజ్ డాట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఆదివారం రాత్రి ఆన్‌లైన్ పిటిషన్‌తో పోల్ ప్రారంభించింది.
అందులో తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ రావడంపై అభిప్రాయాన్ని రాబట్టేందుకు ప్రయత్నించారు. అలా వారు అభిప్రాయ సేకరణ ప్రారంభించారో లేదో పది హేను నిమిషాల్లో దాదాపు 19,000మంది శశికళకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టారు. తాము చదువుకున్న తెలివైన జయలలితకే ఓటు వేశాం తప్ప మరింకెవరికో కాదని, తమకు మరోసారి ఎన్నికలు పెట్టాలని కూడా నెటిజన్లు కోరినట్లు సదరు సంస్థ తెలిపింది. ఈ సంతకాలను రాష్ట్రపతికి, గవర్నర్‌కు అందజేస్తామని వారు తెలిపారు.
శశికళపై తాము నిర్వహించిన ఈ పోల్‌లో ఉంచితే పన్నీర్ సెల్వాన్ని సీఎంగా తిరిగి ఎన్నికలు వచ్చే వరకు ఉంచాలని, లేదంటే మరోసారి ఎన్నికలు నిర్వహించాలని వారు అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. అలాగే, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి వాటిల్లో ‘మేం ఓటు వేసింది జయలలితకు. ఆమె సహాయకురాలికి కాదు. మేం ప్రభుత్వానికి ఓటేశాం. అవినీతిపరులైన కుటుంబానికి కాదు. శశికళ సీఎం పదవి చేపడితే.. ప్రజాస్వామ్యానికి సంతాపం ప్రకటించాల్సిందే’ అంటూ ఓ న్యాయ విద్యార్థి పోస్ట్ చేశాడు.
సంబంధిత వార్తలకై చదవండి
(శశికళ సీఎం అవడంపై చిదంబరం కామెంట్)
(శశికళ వ్యూహం అదుర్స్.. గ్రాండ్ సక్సెస్!)
(సీఎం కల నెరవేర్చుకుంటుందా.. పార్టీ కోసమా!)
(సీఎం అయ్యేందుకు ఏ అర్హత ఉంది?)
(వీడియో షాపు నుంచి సీఎం దాకా)