సాక్షి, అమరావతి: కుక్క తోకను ఆడించాలి. కానీ, తోకే కుక్కను ఆడిస్తే ఎలా ఉంటుందో.. అలాగే ఉంది టీడీపీ, హెరిటేజ్ ఫుడ్స్ వ్యవహారం. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతిని ప్రస్తావిస్తే చంద్రబాబు నోరుమెదపడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతిని సీఐడీ వెలికితీసిందని చెబితే టీడీపీ నేతలు స్పందించడం లేదు. కానీ.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మాత్రం స్పందిస్తూ గత టీడీపీ ప్రభుత్వాన్ని వెనకేసుకురావడం విడ్డూరంగా ఉంది.
అంటే టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడి హెరిటేజ్ ఫుడ్స్‌కు భారీగా ప్రయోజనం కల్పించారన్న ఆరోపణలు, అభియోగాల్లో వాస్తవం ఉందని పరోక్షంగా అంగీకరించినట్టుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి సంబంధించి రెండు అంశాలపై టీడీపీ కాకుండా హెరిటేజ్ స్పందించడం గమనార్హం.
క్విడ్ ప్రోకో లేదంటూ హెరిటేజ్ ఖండన
రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారులో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతికి జరిగిందని సీఐడీ విచారణలో ఆధారాలతో సహా బయటకొచి్చంది. లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన భూములను అమరావతి భూ సమీకరణ నుంచి తప్పించారని.. ఆ కుటుంబానికి సంబంధించిన భూములను ఆనుకుని నిరి్మంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారని బట్టబయలైంది. అందుకు ప్రతిగా క్విడ్ ప్రోకో కింద లింగమనేని కుటుంబానికి చెందిన కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చారు. మరోవైపు లింగమనేని కుటుంబానికి చెందిన భూములను కొనుగోలు పేరుతో హెరిటేజ్ ఫుడ్స్‌కు అప్పగించేలా ఒప్పందం చేసుకోవడం కూడా ఆ క్విడ్ ప్రోకోలో భాగమనే తేలింది.
సీఐడీ విజ్ఞప్తి మేరకు కరకట్ట నివాసాన్ని అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచి్చంది. అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని సీఐడీ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించింది. హెరిటేజ్ ఫుడ్స్ భూములకు సంబంధించిన విషయాన్ని ఈ కేసులో ఏ–1గా ఉన్న చంద్రబాబు వెల్లడించలేదని కూడా న్యాయస్థానం తన తీర్పులో వ్యాఖ్యానించింది. ఇదే విషయాన్ని సాక్షి పత్రిక సోమవారం ఎడిషన్‌లో ప్రచురించింది. దీనిపై చంద్రబాబుగానీ.. టీడీపీ గానీ స్పందించలేదు. ఆ వార్త కథనానికి ఎలాంటి ఖండనా ఇవ్వలేదు. కానీ.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మాత్రం ఆ వార్త కథనానికి ఖండనగా ఓ పత్రికా ప్రకటన పంపించడం విస్మయపరుస్తోంది. సాక్షిలో ప్రచురించిన వార్త తప్పని హెరిటేజ్ ఫుడ్స్ ఖండిస్తూ తాము క్విడ్ ప్రోకోకు పాల్పడలేదని చెప్పుకొచ్చింది. టీడీపీ ప్రభుత్వం అంటే తమ ప్రభుత్వమేనని హెరిటేజ్ ఫుడ్స్ భావిస్తున్నట్టుగా ఉంది.
చిత్తూరు డెయిరీ విషయంలోనూ అంతే..
చిత్తూరు డెయిరీకి సంబంధించి గత నెల 30న సాక్షిలో ప్రచురించిన కథనాన్ని ఖండిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటన జారీ చేయడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు 1995–2004 మధ్య సీఎంగా ఉన్నకాలంలో రాష్ట్రంలో సహకార డెయిరీలను నిర్వీర్యం చేసి మూతపడేలా చేశారు. అందులో భాగంగానే చిత్తూరు డెయిరీని కూడా మూయించారని ఆ కథనంలో ప్రస్తావించారు. చంద్రబాబు మూత వేయించిన చిత్తూరు సహకార డెయిరీకి సహకార రంగానికి చెందిన అమూల్ సంస్థ ద్వారా పునరుజ్జీవం కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని కూడా చెప్పారు.
ఈ వార్త కథనాన్ని చంద్రబాబుగానీ టీడీపీ గానీ ఖండించలేదు. కానీ.. హెరిటేజ్ ఫుడ్స్ మాత్రం ఖండిస్తూ ప్రకటన జారీ చేసింది. 1991–93 మధ్య చిత్తూరు డెయిరీ తీవ్రమైన నష్టాలు ఎదుర్కొందని.. ఆ విషయాన్ని శాసనసభా ఉపసంఘం కూడా నిర్ధారించిందని ఆ ప్రకటనలో పేర్కొంది. అసలు టీడీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు, ఆరోపణలను హెరిటేజ్ ఫుడ్స్ ఖండించడమే విడ్డూరంగా ఉంది.
చదవండి: రైతుకుంది ధీమా.. రామోజీకే లేదు
ఇక శాసనసభా ఉపసంఘం విచారణ అంశాలను కూడా హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తావించాల్సిన అవసరం ఏముందన్నది అంతుబట్టడం లేదు. శాసనసభ ఉపసంఘం తన నివేదికను హెరిటేజ్ ఫుడ్స్‌కు సమర్పించలేదు కదా! మరి హెరిటేజ్ ఫుడ్స్ ఆ విషయాలను తన ప్రకటనలో ఎలా ప్రస్తావించిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంటే చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసినట్టుగా పరోక్షంగా అంగీకరించినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment