హెరిటేజ్ లాభం జూమ్
హెరిటేజ్ ఫుడ్స్ మార్చి క్వార్టర్‌లో రూ. 544 కోట్ల ఆదాయంపై రూ.13 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముం దు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 438 కోట్ల ఆదాయంపై రూ.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2014-15 ఆర్థిక ఏడాది మొత్తానికి రూ. 2,072 కోట్ల ఆదాయంపై రూ. 28 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. షేరుకు రూ.3 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది.
జెన్ టెక్నాలజీస్ లాభం 16 కోట్లు
జెన్ టెక్నాలజీస్ రూ. 78 కోట్ల ఆదాయంపై రూ. 16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 46 కోట్ల ఆదాయంపై రూ. 9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా కంపెనీ రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు 35 పైసల డివిడెండ్‌ను కంపెనీ ప్రతిపాదించింది.
టాటా మోటార్స్‌కు ‘ఫారెక్స్’ బ్రేక్‌లు
టాటా మోటార్స్ నికర లాభం 56 శాతం తగ్గింది. విదేశీ మారక ద్రవ్య నష్టాలు భారీగా ఉండడంసహా పలు అంశాలు దీనికి కారణం. 2013-14 మార్చి క్వార్టర్‌కు రూ.3,918 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,717 కోట్లకు తగ్గింది. నికర అమ్మకాలు 4 శాతం వృద్ధితో రూ.67,300 కోట్లకు పెరిగాయని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.13,991 కోట్ల నుంచి రూ.13,986 కోట్లకు తగ్గింది. ఈ ఏడాదికి సంస్థ డివిడెంట్ ప్రకటించలేదు.
ఐఎఫ్‌సీఐ ఆదాయం అప్..
గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఐఎఫ్‌సీఐ 2014-15వార్షిక ఆదాయంలో 13.48 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఆదాయం రూ.2,953 కోట్ల నుంచి రూ.3,348 కోట్లకు చేరింది. ఇటీవల కంపెనీలో ప్రభుత్వ వాటా పెరగడంతో ఐఎఫ్‌సీఐ ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది.
వృద్ధి బాటలో లైకోస్...
ఇంటర్నెట్ సేవలను అందించే లైకోస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో రూ. 342 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఇదే కాలానికి కంపెనీ రూ.351 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 1,673 కోట్ల నుంచి రూ. 1,957 కోట్లకు చేరింది. నాల్గవ త్రైమాసికంలో రూ. 444 కోట్ల ఆదాయంపై రూ. 98 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
జనవరి-మార్చి క్వార్టర్ ఫలితాలు...
Published Wed, May 27 2015 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM
Advertisement