Zen Technologies
-
జెన్ టెక్నాలజీస్ లాభం జూమ్
న్యూఢిల్లీ: రక్షణ రంగ శిక్షణా సంబంధ సొల్యూషన్స్ కంపెనీ జెన్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 6 రెట్లు దూసుకెళ్లి రూ. 47 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 7.5 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 3 రెట్లుపైగా ఎగసి రూ. 132 కోట్లను దాటింది. గత క్యూ1లో రూ. 37 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. సిమ్యులేషన్ ఎగుమతుల విజయవంత నిర్వహణ, దేశీయంగా యాంటీడ్రోన్ ఆర్డర్లు వంటి అంశాలు ప్రోత్సాహకర పనితీరుకు దోహదపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అశోక్ అట్లూరి పేర్కొన్నారు. కంపెనీ మొత్తం ఆర్డర్ల విలువ రూ. 1,000 కోట్లుకాగా.. వీటిలో రూ. 202 కోట్లు క్యూ1లో సాధించినట్లు వెల్లడించారు. ఈ బాటలో జులైలో మరో రూ. 500 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో జెన్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 675 వద్ద ముగిసింది. -
జెన్ టెక్ భళా- ఎక్సైడ్ బోర్లా
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డిఫెన్స్ శిక్షణా సొల్యూషన్స్ అందించే జెన్ టెక్నాలజీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో ఆటోమోటివ్ బ్యాటరీల దిగ్గజం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లో జెన్ టెక్నాలజీస్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. జెన్ టెక్నాలజీస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జెన్ టెక్నాలజీస్ నికర లాభం 46 శాతం ఎగసి రూ. 18.5 కోట్లకు చేరింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే ఇది 81 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం మాత్రం 56 శాతం క్షీణించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. కాగా.. సీఎఫ్‌వోగా అశోక్ అట్లూరి ఎంపికకు బోర్డ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో జెన్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 50.7 వద్ద ఫ్రీజయ్యింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆటో బ్యాటరీల దిగ్గజం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నికర లాభం 20 శాతం నీరసించి రూ. 168 కోట్లకు పరిమితమైంది. నికర టర్నోవర్ సైతం రూ. 2599 కోట్ల నుంచి రూ. 2055 కోట్లకు క్షీణించింది. పూర్తిఏడాదికి(2019-20) సైతం ఎక్సైడ్ నికర లాభం రూ. 844 కోట్ల నుంచి రూ. 826 కోట్లకు వెనకడుగు వేయగా.. మొత్తం ఆదాయం రూ. 10588 కోట్ల నుంచి రూ. 9857 కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమై రూ. 159కు చేరింది. -
జనవరి-మార్చి క్వార్టర్ ఫలితాలు...
హెరిటేజ్ లాభం జూమ్ హెరిటేజ్ ఫుడ్స్ మార్చి క్వార్టర్లో రూ. 544 కోట్ల ఆదాయంపై రూ.13 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముం దు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 438 కోట్ల ఆదాయంపై రూ.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2014-15 ఆర్థిక ఏడాది మొత్తానికి రూ. 2,072 కోట్ల ఆదాయంపై రూ. 28 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. షేరుకు రూ.3 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. జెన్ టెక్నాలజీస్ లాభం 16 కోట్లు జెన్ టెక్నాలజీస్ రూ. 78 కోట్ల ఆదాయంపై రూ. 16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 46 కోట్ల ఆదాయంపై రూ. 9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా కంపెనీ రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు 35 పైసల డివిడెండ్‌ను కంపెనీ ప్రతిపాదించింది. టాటా మోటార్స్‌కు ‘ఫారెక్స్’ బ్రేక్‌లు టాటా మోటార్స్ నికర లాభం 56 శాతం తగ్గింది. విదేశీ మారక ద్రవ్య నష్టాలు భారీగా ఉండడంసహా పలు అంశాలు దీనికి కారణం. 2013-14 మార్చి క్వార్టర్‌కు రూ.3,918 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,717 కోట్లకు తగ్గింది. నికర అమ్మకాలు 4 శాతం వృద్ధితో రూ.67,300 కోట్లకు పెరిగాయని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.13,991 కోట్ల నుంచి రూ.13,986 కోట్లకు తగ్గింది. ఈ ఏడాదికి సంస్థ డివిడెంట్ ప్రకటించలేదు. ఐఎఫ్సీఐ ఆదాయం అప్.. గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఐఎఫ్సీఐ 2014-15వార్షిక ఆదాయంలో 13.48 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఆదాయం రూ.2,953 కోట్ల నుంచి రూ.3,348 కోట్లకు చేరింది. ఇటీవల కంపెనీలో ప్రభుత్వ వాటా పెరగడంతో ఐఎఫ్సీఐ ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. వృద్ధి బాటలో లైకోస్... ఇంటర్నెట్ సేవలను అందించే లైకోస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో రూ. 342 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఇదే కాలానికి కంపెనీ రూ.351 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 1,673 కోట్ల నుంచి రూ. 1,957 కోట్లకు చేరింది. నాల్గవ త్రైమాసికంలో రూ. 444 కోట్ల ఆదాయంపై రూ. 98 కోట్ల లాభాన్ని ఆర్జించింది.