హెరిటేజ్ కేంద్రం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాల సేకరణలో ఎస్‌ఎన్‌ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్) పేరిట హెరిటేజ్ డెయిరీ పాడి రైతులకు కుచ్చుటోపీ పెడుతోంది. చిత్తూరు జిల్లాలోని 9 హెరిటేజ్ డెయిరీల నుంచి రోజూ 1.41 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. పాల సేకరణ సమయంలో ల్యాక్టోమీటరుతో వెన్న, కొవ్వు శాతాలను గుర్తించి ధర నిర్ణయిస్తారు. ఎస్‌ఎన్‌ఎఫ్ 7.69 శాతం, ఫ్యాట్ 0.75 శాతం ఉన్న పాలకు లీటరు రూ.17.97 మాత్రమే చెల్లిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని చాలా హెరిటేజ్ కేంద్రాల్లో ఇదే ధర చెల్లిస్తూ రైతులను నిలువు దగా చేస్తున్నారు. కానీ ఇదే ఎస్‌ఎన్‌ఎఫ్, ఫ్యాట్ శాతం ఉన్న లీటరు పాలకు పక్కనే గొల్లపల్లిలో శివశక్తి డెయిరీలో, రొంపిచర్ల క్రాస్ శ్రీజ డెయిరీలో, మదనపల్లి అమూల్ డెయిరీ పాల కేంద్రంలో రూ.25 నుంచి రూ.27 వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన హెరిటేజ్‌కు మిగిలిన డెయిరీలకు రైతులు చెల్లించే సేకరణ ధరల్లో ఎంత తేడా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
(చదవండి: రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం జోలికెళ్లం: హైకోర్టు )
వెన్నశాతం పెరిగినా రైతుకిచ్చే ధర తక్కువే
హెరిటేజ్ పాల సేకరణలో ఎస్‌ఎన్‌ఎఫ్ 7.79 శాతం, ఫ్యాట్ 4.19 శాతం ఉన్న పాలకు లీటరుకు రూ.18.09 ఇస్తున్నారు. ఫ్యాట్ 3.10 శాతం ఉండి ఎస్‌ఎన్‌ఎఫ్ 8.06 శాతం ఉన్న పాలకు లీటరుకు రూ.23.52 చెల్లిస్తున్నారు. ఫ్యాట్ 3.10 శాతం ఉండి ఎస్‌ఎన్‌ఎఫ్ 8.08 శాతం ఉంటే రూ.27.97 చెల్లిస్తున్నారు. కానీ ఇవే శాతం ప్రకారం ఉంటే అమూల్ కంపెనీతో పాటు ఇతర కంపెనీలు లీటరు రూ.33.24 నుంచి రూ.40 వరకు కొనుగోలు చేస్తుండటం గమనార్హం.
రైతులకు దగా.. వినియోగదారులకు వంచన
వాస్తవానికి పాలల్లో నిర్దేశించిన మేరకు ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్ లేకపోతే వాటిని కొనుగోలు చేయకూడదు. కానీ హెరిటేజ్ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ పాలు తగిన నాణ్యతతో లేకున్నా కొనుగోలు చేసి వాటితో పాల ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది.
బాలకృష్ణను పిండేసింది...!
చిత్తూరు జిల్లాలో పాడి రైతు బాలకృష్ణకు హెరిటేజ్ చెల్లించిన ధర లీటర్‌కు రూ.17.97. పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం బెల్లంవారి పల్లెలోని హెరిటేజ్ పాల సేకరణ కేంద్రంలో ఆయనకు 20 రోజుల పాటు దాదాపు ఇలాగే చెల్లించారు. ఓసారి అయితే రూ.16.65 మాత్రమే ఇచ్చారు. ఆయనొక్కరే కాదు.. భాస్కర్, వి.గంగిరెడ్డి, పసుపులేటి రాణి, హరినాథ్, నాగమ్మ, కిరణ్ తదితర పాడి రైతులందరికీ జనవరిలో ఇదే మాదిరిగా బిల్లులు చెల్లించారు. అక్కడే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోని హెరిటేజ్ పాల సేకరణ కేంద్రాల్లో దారుణాలు ఇవీ..
(చదవండి: సానుకూలంగా చర్చలు)
Comments
Please login to add a commentAdd a comment