Nov 10th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases Petitions Nov 10 Updates | Sakshi
Sakshi News home page

Nov 10th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Fri, Nov 10 2023 6:53 AM | Last Updated on Fri, Nov 10 2023 9:09 PM

TDP Chandrababu Cases Petitions Nov 10 Updates - Sakshi

TDP Chandrababu Cases Petitions..

09:09 PM, Nov 10, 2023
కుంభకోణాల్లో పీహెచ్‌డీ.. లూటీ రత్న
►అవినీతి పుట్టకతో అబ్బిన విద్య
►ఓనమాల దశలోనే కుట్రలు, కుతంత్రాలు నేర్చారు
►ఎమ్మెల్యే కాకముందే ఎన్నో వేషాలు
►కుంభకోణాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన కుట్రదారు
►టూటీ రత్న.. నారా చంద్రబాబు నాయుడు

08:50 PM, Nov 10, 2023
తెలంగాణలో ముసుగు తొలగించిన టీడీపీ
►కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారంలోకి దిగిన టీడీపీ 
►చంద్రబాబు ప్రియ శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం రంగంలోకి టీడీపీ నేతలు
►నామినేషన్ల పర్వం ముగియగానే.. కాంగ్రెస్‌ ప్రచారానికి బహిరంగ మద్దతు ఇచ్చిన టీడీపీ
► కోదాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు
►కాంగ్రెస్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ జెండాలతో కలగలిసిన టీడీపీ జెండాలు

4:51 PM, Nov 10, 2023
ఫైబర్‌నెట్‌ కేసులో ఏసీబీ కోర్టు విచారణ వాయిదా
►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్
►సీఐడీ పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ
►ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే చెప్పిన సుప్రీం కోర్టు
►ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ తరపు లాయర్లు
►విచారణ వచ్చే నెల 1 కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

4:22 PM, Nov 10, 2023
2019 ఎన్నికల్లో కుప్పకూలిన టిడిపి కంచుకోటలు
► అనేక దశాబ్దాలుగా గెలుస్తూ కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిన తెలుగు దేశం
► కేవలం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా పరాజయం
► పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు గెలుపు
► ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 చోట్ల ఓటమి
►  శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం, 2019లో గౌతు శిరీష ఓటమి
►  2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు ఓటమి
►  పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నెగ్గింది.  
►  ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత ఓటమి
►  ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలో సైకిల్‌ గల్లంతు
►  1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... 2019లో ఓటమి
►  అనంతపురం జిల్లా పెనుగొండ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కర్నూలు జిల్లా పత్తికొండలో ఇలాంటి దీన పరిస్థితి సైకిల్‌కు

4:05 PM, Nov 10, 2023
మేం కలిసి పోటీ చేసి ఉంటే.. 2019లో మరోలా ఉండేది : టిడిపి, జనసేన సమన్వయం
► 2019లో పవన్‌కళ్యాణ్‌ ఎందుకు ఒంటరిగా పోటీ చేశాడో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు
► చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది పవన్‌ ఎజెండా
► అయినా పారని ఎత్తుగడ, ఛీ కొట్టి ఇంటికి పరిమితం చేసిన ఓటర్లు
► ఒకసారి కింద ఇచ్చిన ఎన్నికల సంఘం నివేదికను జాగ్రత్తగా పరిశీలించండి

పార్టీ పోటీ చేసిన సీట్లు గెలిచిన సీట్లు వచ్చిన ఓట్లు ఓట్ల శాతం పోటీచేసిన చోట ఓట్ల శాతం
YSRCP 175 151 1,56,88,569 49.95% 49.95%
TDP 175 23 1,23,04,668 39.17% 39.17%
జనసేన 137 1 17,36,811 5.53% 7.04%
BJP 173 0 2,64,437 0.84% 0.85%

► అసలు జనసేన కేవలం 137 సీట్లకే ఎందుకు పరిమితమయింది?
► తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మిగతా చోట్ల పోటీ చేయలేదు
► ఎక్కడెక్కడ YSRCP అభ్యర్థి బలంగా ఉన్నాడో.. అక్కడ మాత్రమే జనసేన బరిలోకి దిగింది
► జనసేన ఉద్దేశ్యం ఒకటే.. YSRCP ఓట్లను పరిమితం చేయడం


3:55 PM, Nov 10, 2023
మా కమ్మలు తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేస్తారు: TDP నేతల ప్రకటనలు
అసలు తెలంగాణలో కమ్మల బలమెంత?

► ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం 1985లో అత్యధికంగా ఎనిమిది మంది గెలుపు
► మిగిలిన ఎన్నికలలో రెండు  నుంచి ఏడుగురు వరకు మాత్రమే పరిమితం
► ఉమ్మడి రాష్ట్రంలో 1994లో అత్యధికంగా గెలిచిన కమ్మనాయకులు
► 1994లో ఏకంగా 53 మంది కమ్మ నాయకులు ఎమ్మెల్యేలుగా విజయం
► అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు కమ్మలు
► 2018లో సిర్పూరులో కోనేరు కోనప్ప, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్‌, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, మిర్యాలగూడలో భాస్కరరావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్‌ గెలుపు
► 2019లో ఏపీలో 17 మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి 22మంది గెలుపు
► 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది కమ్మల విజయం
► ఉమ్మడి ఏపీలో 2009లో 27 మంది కమ్మలు ఎమ్మెల్యేలుగా గెలుపు
► 2004లో 35 మంది, 1999లో 43, 1994లో 53, 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలుపు

3:50 PM, Nov 10, 2023
కిలారు పిటిషన్‌పై విచారణ
►కిలారు రాజేష్ లంచ్‌మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
►సీఆర్పీసీ 160,91 నోటీసులు, ఇల్లీగల్ అంటూ రిట్ పిటిషన్
►సిఐడీ అధికారులు తనను విచారణలో బెదిరించారని పిటిషన్ లో పేర్కొన్న కిలారు రాజేష్
►స్కిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కిలారు రాజేష్

3:35 PM, Nov 10, 2023
గుంటూరులో సైకిల్‌ తొక్కేదెవరు?
►గుంటూరు లోక్‌సభ స్థానంలో పోటీకి టిడిపి ఎంపీ గల్లా జయదేవ్‌ విముఖత.?
►రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపించని గల్లా
►ఇటీవలి కాలంలో గుంటూరు వైపు తిరిగి చూడని గల్లా
►ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్న గల్లా

3:22 PM, Nov 10, 2023
ఫైబర్‌ గ్రిడ్‌ కేసు 30వ తేదీకి వాయిదా
►విజయవాడ : ఏపీ ఫైబర్ గ్రిడ్ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ
►ఈనెల 30వ తారీకు వరకు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేస్ పిటి వారెంట్  పై ఎలాంటి అరెస్టులు చేయవద్దన్న సుప్రీంకోర్టు
►ACB కోర్టు లో మెమో దాఖలు చేసిన సిఐడి తరుపున న్యాయవాదులు
►వచ్చే నెల ఒకటవ తేదీకి విచారణ వాయిదా వేసిన ఏసిబి కోర్టు
►ఏపి ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డిన కేసులో అస్తులు అటాచ్‌మెంట్ చేయాలని ఏసిబి కోర్టులో పిటిషన్ పై విచారించిన ఏసిబి కోర్టు
►విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసిన ఏసిబి కోర్టు

3:03 PM, Nov 10, 2023
తమ్ముడి సీన్‌ అంతేనా?
►తెలంగాణలో 8 సీట్లతో సరిపెట్టుకున్న పవన్‌కళ్యాణ్‌
►జనసేన స్థాయికి 8 సీట్లు సరిపోతాయని సూత్రీకరణ
►ఇచ్చిన 8 సీట్లలోనూ 2 సీట్లలో బీజేపీ లీడర్లే పోటీ
►బీజేపీలో ఉంటే టికెట్‌ సమస్య కాబట్టి.. పార్టీ మారి జనసేన నుంచి పోటీ చేస్తోన్న ఇద్దరు
►తెలంగాణ వ్యవహారాల పట్ల తెలుగుదేశం వెరీ హ్యాపీ
►తెలంగాణలో 8 ఇచ్చారు కాబట్టి.. ఏపీలో 16తో సరిపెట్టాలన్న యోచనలో తెలుగుదేశం నేతలు
►ఆ 16లోనూ ఆరు చోట్ల తమ వాళ్లనే జనసేనలోకి పంపాలన్న ప్లాన్‌
►మొత్తమ్మీద పవన్‌ కళ్యాణ్‌ పరిస్థితి ఆటలో అరటిపండు అయిందంటున్న రాజకీయ విశ్లేషకులు

2:43 PM, Nov 10, 2023
అబద్దాలతో మోసం చేయడమే తెలుగుదేశం వ్యూహం
►తాడేపల్లిలో మాట్లాడిన  మంత్రి సీదిరి అప్పలరాజు
►అబద్దాలను సృష్టించటం, ఎల్లోమీడియాలో ప్రచారం చేయటమే టీడీపీ, జనసేన పని
►రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భయం సృష్టించాలని వారి ప్లాన్
►నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
►చిత్తూరు డైరీని చంద్రబాబు సర్వనాశనం చేశారు
►మ్యాక్స్ చట్టం తెచ్చి తన మనుషులకు డెయిరీలను కట్టబెట్టారు
►సంగం డెయిరీ, విశాఖ డెయిరీ, కృష్ణా డెయిరీలను అలాగే తన వారి చేతిలో పెట్టారు
►ప్రభుత్వానికి చెందిన సంగం డెయిరీ ధూళిపాళ్ళ నరేంద్రకు ఎలా వెళ్లింది?
►73 ఎకరాల భూములు సంగం డెయిరీకి ఉండేవి
►ఆ భూములపై రూ.150 కోట్ల వరకు అప్పు తెచ్చుకున్నారు
►ధూళిపాళ్ళ నరేంద్ర కబ్జా చేసిన భూములు, డెయిరీలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి
►ప్రభుత్వ ఆస్థులను కొల్లగొట్టటంలో టీడీపీ వారికి ఉన్నంత స్కిల్ మరెవరికీ లేవు
►ప్రభుత్వ ఆస్తులను దోచుకునే టీడీపీ నేతలు మాపై ఆరోపణలు చేయటం ఏంటి?
►కోఆపరేటివ్ యాక్టులోకి‌ సంగండెయిరీ, హెరిటేజ్ డెయిరీలను మార్చి ప్రభుత్వ సాయం అడగండి
►అమూల్ పేరు వింటేనే టీడీపీ నేతలకు నిద్ర పట్టటం లేదు
►అమూల్ రాకముందు సంగం డెయిరీ వారు 58 రూపాయలు రైతులకు ఇచ్చేవారు
►అమూల్ వచ్చాక రూ.69.35 లు ఇస్తున్నారు
►అమూల్ రాకముందు సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో రైతులకు మద్ధతు ధర పెంచేవారు
►అమూల్ వచ్చాక బలవంతంగా రైతులకు పెంచి ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది
►ఇది తట్టుకోలేకనే అమూల్ పై ఎల్లోమీడియాలో విషం కక్కుతున్నారు
►3.73 లక్షల మంది రైతులు అమూల్ కి పాలు పోస్తున్నారు
►అమూల్ వలన 4,490 కోట్ల అదనపు లబ్ది రైతులకు చేకూరింది
►జనసేన పరిస్థితి విచిత్రంగా ఉంది
►తెలంగాణలోని ఒక పార్టీ నుండి, ఏపీలో మరొక పార్టీ నుండి స్క్రిప్టు వస్తుంది
►నాదెండ్ల మనోహర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది
►చంద్రబాబు పాలనలో ఆదరణ పథకం కింద ఏ ఒక్క కుటుంబమైనా బాగుపడిందా?
►టీడీపీ, జనసేన ఎప్పుడూ కలిసే ఉన్నాయి
►గత ఎన్నికలలో కూడా ఒప్పందం మేరకే వేర్వేరుగా పోటీలో ఉన్నారు
►అమరావతి ఎవరి రాజధాని? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే అమరావతి పై ఎందుకు ప్రేమ చూపుతున్నారు
►పార్టీని పవన్ అమ్మేశాడని జనసైనికులు గుర్తించాలి
►ఏపీలో మద్యం బ్రాండ్లను పురంధేశ్వరి టేస్టు చేస్తున్నారేమో తెలీదు
►ఇప్పుడు ఉన్నవన్నీ చంద్రబాబు పర్మిషన్ తో వచ్చినవే
►కాబట్టి పురంధేశ్వరి వెళ్లి చంద్రబాబునే ప్రశ్నించాలి
►ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాస్త గౌరవం ఉండేది
►బీజేపీలోకి వచ్చి, చంద్రబాబుకు వంత పాడటం మొదలెట్టాక తేడా వచ్చింది
►బీజేపీలో ఉన్న క్యాడరే పురంధేశ్వరితో విభేదిస్తున్నారు
►పురంధేశ్వరికి అంత ఇష్టం ఉంటే టీడీపీలో చేరితే మంచిది
 

2:35 PM, Nov 10, 2023
CBIకి స్కిల్‌ కేసు అప్పగించాల్సిందే.!
►స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై విచారణ వాయిదా
►ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ
►నోటీసులు ఇవ్వడంలో జాప్యంపై విచారణ జరపాలని రిజిస్ట్రీకి సూచించిన జడ్జి
►సీబీఐకి కేసు అప్పగింతలో మాకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపిన అడ్వొకేట్‌ జనరల్‌
►విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన హైకోర్టు

2:05 PM, Nov 10, 2023
స్కిల్‌ కేసులో కిలారు రాజేష్‌ పిటిషన్‌
►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టుకు టీడీపీ నేత కిలారు రాజేష్ కొత్త వాదన
►స్కిల్ కేసులో తనకు CRPC 100 కింద నోటీసులు ఇచ్చి విచారణలో బెదిరించారంటూ కిలారు రాజేష్ పిటిషన్
►క్వాష్ పిటిషన్ వేసిన రాజేష్ లాయర్ ఆదినారాయణరావు
►లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించిన ఏపీ హైకోర్టు
►కిలారు రాజేష్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ

12:30 PM, Nov 10, 2023
కమలం కోసం ఎదురుచూపులు
►పశ్చిమగోదావరి జిల్లాలో మాట్లాడిన మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య
► టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉంది: జోగయ్య
►ఈ కూటమికి జనరంజకమైన ఉమ్మడి మేనిఫెస్టో అవసరం
►వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రకటించాలి : జోగయ్య
జోగయ్య వ్యాఖ్యలపై వైఎస్సార్‌సిపి సీరియస్‌
►టిడిపి-జనసేన గెలవలేదని అర్థమయిందా?
►దేశంలో ఉన్న పార్టీలన్నింటిని కలుపుకుంటే తప్ప పరువు మిగలదని అవగతమయిందా?
►మీకు నిజంగా బలమే ఉంటే.. సింగిల్‌గా ఎందుకు పోటీ చేయడం లేదు?
►ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని కడుపు చించుకున్నారు కదా.!
►ఎన్నికలు రాగానే అమలు చేయలేని పథకాలు ప్రకటించి జనాల్ని మోసం చేయాలనుకుంటున్నారా?

11:50 AM, Nov 10, 2023
ఉండవల్లి పిటిషన్‌పై విచారణ వాయిదా
►స్కిల్‌ స్కాం కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో ఉండవల్లి పిటిషన్‌
►ఉండవల్లి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
►తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన కోర్టు

11:00 AM, Nov 10, 2023
అసైన్డ్‌ భూముల స్కాంలో క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
►అమరావతి అసైన్డ్‌ భూముల స్కాంలో బాబు, నారాయణ క్వాష్‌ పిటిషన్‌
►బాబు, నారాయణ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ రీ ఓపెన్‌ చేసి పూర్తి స్థాయిలో విచారించాలని హైకోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు
►సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా 
►ఈనెల 22వ తేదీకి విచారణ వాయిదా వేసిన హైకోర్టు

10:55 AM, Nov 10, 2023
స్కిల్‌ స్కాంలో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా 
►స్కిల్‌ స్కాంలో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
►చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 15కి వాయిదా 

8:45 AM, Nov 10, 2023
కంటి ఆపరేషన్‌ కోసం బాబుకు మధ్యంతర బెయిల్‌: సామాన్యుడు
►చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్
►టీడీపీ ఈ విషయాన్ని దాచిపెట్టి.. నిజం గెలిచిందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం
►ఎంతమంది కలిసి పొత్తులతో వచ్చినా 2024లో వచ్చేది జగనన్న ప్రభుత్వమే. 

8:02 AM, Nov 10, 2023
►విజయవాడ : నేడు ఫైబర్ నెట్ కేసులో సీఐడీ పిటిషన్ పై విచారణ
►ఏడుగురి ఆస్తుల అటాచ్‌మెంట్ కోసం సీఐడీ పిటిషన్


8:00 AM, Nov 10, 2023
నేడు పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ
►నేడు ఏపీ హైకోర్టులో స్కిల్ డెవలప్మెంట్‌ కేసుపై విచారణ
►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ 
►స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 
►ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై ఉన్న చంద్రబాబు
►నేడు ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ 
►స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐ విచారించాలని పిటిషన్ 
►నేడు సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
►మాజీ మంత్రి నారాయణపై పెట్టిన అమరావతి అసైన్డ​్‌ ల్యాండ్ కేసును రీ ఓపెన్ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ

6:40 AM, Nov 10, 2023
చంద్రబాబుకు కొత్త టెన్షన్స్‌
►స్కిల్‌ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌ మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
►52రోజులపాటు జైలు జీవితం.. బయటకు వచ్చాక ఆస్పత్రుల చుట్టూ బాబు 
► దిక్కుతోచని స్థితిలో టీడీపీ శ్రేణులు
►పరామర్శయాత్రని పక్కన పారేసిన సతీమణి నారా భువనేశ్వరి
►యువగళాన్ని అటకెక్కించి ఢిల్లీ పరారైన తనయుడు నారా లోకేష్‌ బాబు
►టెన్షన్‌లో నారావారు.. గందరగోళంలో పార్టీ క్యాడర్‌
►స్కిల్‌ కేసులో సుప్రీం తీర్పుపైనే ఆశలు పెట్టుకున్న బాబు అండ్‌ కో

6:30 AM, Nov 10, 2023
అయోమయంలో తెలుగుదేశం
►నవంబర్‌ 28న సాయంత్రం 5గంటలకు తిరిగి జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు
►ఈలోగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం కోటి ఆశలతో ఎదురుచూపులు
►ప్రస్తుతం అనారోగ్య కారణాలతో తాత్కాలిక బెయిల్‌ మీద ఉన్న చంద్రబాబు
►17ఏ సెక్షన్‌ను చూపించి కేసు కొట్టేయించుకోవాలన్న వ్యూహంలో బాబు లాయర్లు
►బాబు క్వాష్‌ పిటిషన్‌పై నవంబర్‌ 28 తర్వాత ఉత్తర్వులిస్తామన్న సుప్రీంకోర్టు
►అంటే చంద్రబాబు జైలుకు వెళ్లిన ఒకటి, రెండు రోజుల తర్వాత ఉత్తర్వులు వచ్చే అవకాశం
►ఒక వేళ తీర్పు అనుకూలంగా రాకపోతే చంద్రబాబు జైలుకే పరిమితం అయ్యే అవకాశం
►చంద్రబాబు బయట ఉంటేనే మ్యానిఫెస్టో విడుదల చేయాలన్న యోచనలో తెలుగుదేశం
►చంద్రబాబు చుట్టే ముడిపడి ఉన్న టిడిపి వ్యవహారాలు
►నవంబర్‌ 30 తర్వాతే పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటానంటోన్న లోకేష్‌
►అప్పటివరకు పాదయాత్ర జోలెత్తవద్దంటున్న చినబాబు
►సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నా.. టిడిపిలో కనిపించని జోష్‌

తెలుగుదేశం విష ప్రచారమేంటీ? అసలు నిజాలేంటీ?
►తెలుగుదేశం, ఎల్లోమీడియాలో జరుగుతున్న ప్రచారమేంటీ?
►చంద్రబాబు విజనరీ, ఆయనే హైటెక్‌ సిటీ కట్టాడు
►మళ్లీ చంద్రబాబు నెగ్గితే ఏపీ అభివృద్ధి చేస్తాడు
►ప్రస్తుతమున్న ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు
కింది ఫోటో చూడండి. హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేస్తోంది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ ఆలోచన చంద్రబాబుది కాదు, టిడిపిది కాదు

కిందివి చదివిన తర్వాత మరిన్ని విషయాలు నిర్దారించుకోండి
►విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ సీఎం  జగన్ వచ్చి పూర్తి  చేసాడు.

►వైజాగ్ NAD ఫ్లై ఓవర్  కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు.

►బెజవాడ బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసేసాడు.

►రెండో ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ మొదలుపెట్టి, ఏడాదిలో జగనే పూర్తి చేసాడు.

►కృష్ణా నది రిటైనింగ్ వాల్ సీఎం జగనే స్టార్ట్ చేసి పూర్తి చేసాడు. ఇంకొకటి స్టార్ట్ చేసాడు.

►తిరుపతిలోని సేతు ఫ్లైఓవర్ అందంగా సీఎం జగన్‌ ప్రభుత్వమే పూర్తి చేసింది

►అనంతపురం టవర్ క్లాక్ బ్రిడ్జి సీఎం జగనే మొదలుపెట్టి, పూర్తి చేసాడు.

ఇవే కాదు
►భోగాపురం ఎయిర్‌పోర్టుకి అన్ని అనుమతులు సాధించి, సీఎం జగనే మొదలు పెట్టి పనులు చేస్తున్నాడు.

►వెలిగొండ18 కి.మీ. మొదటి టన్నెల్ సీఎం జగనే పూర్తి చేసాడు. రెండో టన్నెల్ కూడా జగనే పూర్తి చేయబోతున్నాడు.

►ఒక రూపు లేని పోలవరాన్ని కూడా సీఎం జగనే ఒక రూపుకు తెచ్చాడు. స్పిల్ వే, అప్పర్, లోయర్ కాఫర్ డ్యాములు సీఎం జగనే పూర్తి చేసాడు.

►అప్రోచ్, స్పిల్ పైలట్ ఛానెళ్ళు కూడా సీఎం జగనే పూర్తి చేసాడు. నిర్వాసితులకు వేల ఇల్లు ఈ ప్రభుత్వమే కట్టించింది

►16 మెడికల్ కాలేజీలు సీఎం జగనే మొదలుపెట్టాడు, 5 పూర్తి చేసాడు.

►4 పోర్టులు,10 ఫిషింగ్ హార్బర్లు సీఎం జగనే మొదలుపెట్టాడు, పనులు పరుగులు పెట్టిస్తున్నాడు. సీఎం జగన్ కాబట్టే చేస్తున్నాడు.

►ఇవే కాక, వేల పాఠశాలలను, విద్యాసంస్థలను సీఎం జగనే మార్చాడు. నాడు నేడు కింద రూపురేఖలు మొత్తం మార్చేశాడు.

►లక్షల ఇళ్లు సీఎం జగనే కట్టిస్తున్నాడు.

►వేల సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు సీఎం జగనే మొదలు పెట్టి, పూర్తి చేస్తున్నాడు.

ఇలా చెప్పుకోవడానికి చంద్రబాబుకి తాత్కాలిక కట్టడాలు తప్ప, ఒక్కటి ఏదైనా ఉందా ? మరెలా విజనరీ అయ్యాడు?

రాజధాని ప్రాంతంలో మొదలు పెట్టిన ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోయాడు అసలు ఎలా  మోస్తున్నారు ?

హైదరాబాద్ రింగు రోడ్డు, ఎయిర్‌పోర్టు నుండి ఏదీ మొదలుపెట్టింది లేదు. పూర్తి చేసిందీ లేదు కానీ అన్నీ నేనే చేసానని చెప్పుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ సంపద సృష్టిస్తాడని ప్రచారం చేస్తున్నారు.

అందుకే .. జగనే చేసాడు...  జగనే చేస్తాడు... ఏదైనా జగనే చేయగలడు... అన్న నమ్మకం ప్రజల్లో ఉంది

►ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేడన్నారు, చేశాడు.

►CPS రద్దు చేయలేడన్నారు, చేశాడు. PRC ఇవ్వలేడన్నారు, ఇచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement