Gijigadu : టాలెంట్‌ ఉంటేనే ఆడ పక్షుల ప్రేమ.. | Talent Of Sparrow In Building Nest In Mahabubnagar | Sakshi
Sakshi News home page

ప్రతిభ ఉంటేనే ప్రేమ.. 

Published Mon, Jun 28 2021 10:10 AM | Last Updated on Mon, Jun 28 2021 12:03 PM

Talent Of Sparrow In Building Nest In Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సృష్టిలో పశుపక్ష్యాదులు తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుతాయి. పక్షిజాతుల్లో విభిన్నమైన, వైవిధ్యతను చాటే పక్షి గిజిగాడు. ఈ పక్షులు పాలమూరు యూనివర్సిటీలోని అడ్మిన్‌ భవనం వద్ద ఉన్న ఓ బావిలో ఇటీవల గూడు కట్టుకుంటున్నాయి. మగ, ఆడ పక్షుల మధ్య ఉండే సంబంధాల్లో కొన్ని ఆసక్తికర విషయాలను యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ‘సాక్షి’తో పంచుకున్నారు.

లేత పసుపు రంగులో ఉండే మగపక్షి నాణ్యతగా గూడు కట్టి ఆడపక్షిని మెప్పించగలిగితే.. ఆ ఆడ పక్షి గూడు కట్టిన మగపక్షితో జత కడుతుంది. గాలి, వాన, చలి, వేడికి కూడా చెక్కు చెదరకుండా పక్షి పిల్లలకు ఆ గూడు రక్షణ ఇవ్వాలి. అలా మెప్పించలేని మగ పక్షులు ఏడాది పాటు ఒంటరిగా ఉండాల్సిందేనట. ప్రతిభ ఉన్న మగ పక్షులే ఆడ పక్షుల ప్రేమను పొందుతాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది.  

చదవండి: పాముకే విషమిచ్చి చంపేస్తే!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement