![Interesting Facts About Actress Shruti Haasan: Photos1](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2828%29.jpg)
'హే రామ్'లో బాల నటిగా యాక్ట్ చేసింది. హిందీ సినిమా 'లక్'తో హీరోయిన్‌గా మారింది. ఆవిడే లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos2](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%281%29.jpg)
తను కెరీర్ స్టార్ట్ చేసి పదిహేనేళ్ళు పూర్తి అయ్యింది. కమల్ కుమార్తెగా గుర్తింపు ఉన్నా ఆమెకు మొదట్లో విజయాలు రాలేదు.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos3](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%282%29.jpg)
ఆ తర్వాత వరుస అవకాశాలు, సక్సెస్‌లు కరువయ్యాయి. కొందరు ఆమెను ఐరన్ లెగ్ అన్నారు. కానీ, ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయ్యింది.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos4](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%283%29.jpg)
'లక్' తర్వాత 'అనగనగా ఓ ధీరుడు', ధనుష్ '3', సూర్య '7 ఏఎం అరివు', 'దిల్ తో బచ్చా హై', ఓ మై ఫ్రెండ్' సినిమాలు శృతి హాసన్‌కు పేరు తెచ్చాయి.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos5](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%284%29.jpg)
కానీ, భారీ విజయాలు ఇవ్వలేదు. ఆ సమయంలో ఆమె మీద ఐరన్ లెగ్ ముద్ర పడింది. నటిగా పేరు వచ్చినా... కలెక్షన్స్ రాకపోవడం ఆమెకు మైనస్ అయింది.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos6](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%285%29.jpg)
ఆ సమయంలో 'గబ్బర్ సింగ్' సినిమాతో గోల్డెన్ లెగ్ అయ్యారు. నటిగా, కథానాయికగా శృతి హాసన్ ప్రయాణంలో ఫస్ట్ భారీ బ్లాక్ బస్టర్ అంటే 'గబ్బర్ సింగ్' అని చెప్పాలి.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos7](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%286%29.jpg)
ఇండస్ట్రీలో వారసులకు సులభంగా అవకాశాలు వస్తాయనేది అపోహ అని బలంగా చెప్పడానికి శృతి హాసన్ ఓ ఉదాహరణ.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos8](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%287%29.jpg)
కమల్ హాసన్ కుమార్తెగా ఆమెకు భారీ, క్రేజీ సినిమాల్లో అవకాశాలు అంత ఈజీగా ఏమీ రాలేదు.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos9](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%288%29.jpg)
'లక్' ఫ్లాప్ తర్వాత ఆమెకు హిందీ అవకాశాలు ముఖం చాటేశాయి.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos10](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%289%29.jpg)
తెలుగులోనూ స్టార్ హీరోలతో ప్రతిష్టాత్మక సినిమాలు ఏమీ రాలేదు. 'గబ్బర్ సింగ్' విజయం తర్వాతే ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos11](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2810%29.jpg)
రవితేజ 'బలుపు', ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', అల్లు అర్జున్ 'రేసు గుర్రం', రామ్ చరణ్ 'ఎవడు', మహేష్ బాబు 'శ్రీమంతుడు', నాగ చైతన్య 'ప్రేమమ్'... వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటించింది.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos12](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2811%29.jpg)
అప్పటి నుంచి వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2022లో ఆవిడ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అంతకు ముందు (2021)లో తెలుగు సినిమాలు 'క్రాక్', 'వకీల్ సాబ్' విజయాలు సాధించినా సరే...
![Interesting Facts About Actress Shruti Haasan: Photos13](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2812%29.jpg)
తమిళ సినిమా 'లాభం' ఫ్లాప్ కాగా, హిందీలో 'ది పవర్' సైతం సేమ్ రిజల్ట్ అందుకుంది.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos14](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2813%29.jpg)
ఆ సమయంలో సంక్రాంతికి విడుదలైన 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' విజయాలు సాధించాయి.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos15](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2814%29.jpg)
ఆ తర్వాత 'హాయ్ నాన్న'లో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ హిట్ అయ్యింది. 'సలార్' పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఏడాది నాలుగు విజయాలు అందుకున్నది ఒక్క శృతి హాసనే.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos16](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2815%29.jpg)
కెరీర్ స్టార్టింగ్‌లో ఐరన్ లెగ్ అని విమర్శలు పలువురి నుంచి ఎదుర్కొన శృతి హాసన్... ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు గోల్డెన్ లెగ్ అయ్యింది.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos17](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2816%29.jpg)
ఇప్పుడు ఆమె చేతిలో 'సలార్ 2' ఉంది. అది కాకుండా అడివి శేష్ సరసన పాన్ ఇండియా సినిమా 'డెకాయిట్'లో హీరోతో పాటు సమానమైన రోల్ చేస్తోంది.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos18](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2817%29.jpg)
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కూలీ'లో కీలకమైన క్యారెక్టర్ చేస్తోంది.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos19](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2818%29.jpg)
'కేజీఎఫ్' తర్వాత రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్'లో సైతం శృతి హాసన్ హీరోయిన్. ప్రజెంట్ శృతి హాసన్ జోరు చూస్తుంటే... ఇండస్ట్రీలో మరో పదిహేనేళ్ళు విజయాలతో కంటిన్యూ అయ్యేలా ఉంది.
![Interesting Facts About Actress Shruti Haasan: Photos20](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2819%29.jpg)
ప్రతిభ ఉంటే విజయాలు వస్తాయని, ఓపికతో వెయిట్ చేయాలని చెప్పడానికి ఆవిడే ఒక ఉదాహరణ. ఇతర కథానాయికలకు ఆ విషయంలో స్ఫూర్తి కూడా!
![Interesting Facts About Actress Shruti Haasan: Photos21](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2820%29.jpg)
![Interesting Facts About Actress Shruti Haasan: Photos22](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2821%29.jpg)
![Interesting Facts About Actress Shruti Haasan: Photos23](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2822%29.jpg)
![Interesting Facts About Actress Shruti Haasan: Photos24](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2823%29.jpg)
![Interesting Facts About Actress Shruti Haasan: Photos25](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2824%29.jpg)
![Interesting Facts About Actress Shruti Haasan: Photos26](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2825%29.jpg)
![Interesting Facts About Actress Shruti Haasan: Photos27](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2826%29.jpg)
![Interesting Facts About Actress Shruti Haasan: Photos28](https://www.sakshi.com/gallery_images/2024/07/25/Interesting%20facts%20about%20Actress%20Shruti%20Hassan%20Photos%20%2827%29.jpg)