సాక్షి, హైదరాబాద్: కొండాపూర్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు గాయత్రి భర్త శ్రీకాంత్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై గాయత్రి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తన అత్త చేసే ఆరోపణలు అసత్యమని తెలిపారు. గాయత్రి తండ్రి మరణం అనంతరం వాళ్లు గాయత్రి మీద కక్ష కట్టారన్నారు.
చదవండి: ఎంత పనిచేశావ్ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి
ఆస్తి పంపకాల్లో గాయత్రిని ఆమె తల్లి, సోదరే వేధించారన్నారు. గాయత్రి స్థలంలో తన తమ్ముడు ప్రదీప్ ఇళ్లు కట్టాలని చూశాడని.. దాన్ని గాయత్రి అడ్డుకుందని తెలిపారు. గాయత్రి కుటుంబంలో పరస్పరం అందరూ కేసులు వేసుకున్నారన్నారు. గాయత్రికి తాను సపోర్ట్‌గా ఉన్నందుకు తనపై కక్ష కట్టారని శ్రీకాంత్ తెలిపారు. గాయత్రి అరాచకాలపై తనకేమి తెలియదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలపై తనకు సమాచారం లేదని శ్రీకాంత్ అన్నారు.
కాగా, సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment