
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అత్యాచార బాధితురాలి రెండోసారి స్టేట్‌మెంట్ రికార్డ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి వద్ద దింపుతామని ట్రాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు వెల్లడించింది. బాధితురాలిని వెంబడించి క్యాబ్ బుక్ చేస్తామంటూ నిందితులు ఫోన్ లాక్కున్నారు. ఫోన్ సిగ్నల్ సరిగా లేదని.. ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ బెంజ్ కారులో తీసుకెళ్లిన నిందితులు.. బాధితురాలి హ్యాండ్ బ్యాగ్, కళ్లజోడు లాక్కున్నారు. కాన్స్ బేకరీ వద్దకు రాగానే ఇన్నోవాలోకి షిఫ్ట్ చేశారు. ఇన్నోవాలో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది.
చదవండి: అశ్లీలం.. విశృంఖలం!.. ఇంటర్నెట్‌లో రాజ్యమేలుతున్న పోర్న్ వెబ్‌సైట్లు
Comments
Please login to add a commentAdd a comment