బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ మరోసారి కోర్టులో హాజరయ్యారు.
జోధ్‌పూర్: బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ మరోసారి కోర్టులో హాజరయ్యారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్‌కి సమన్లు జారీ చేయడంతో ఈ రోజు మధ్యాహ్నం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో వాదనను న్యాయస్థానం అక్టోబర్ 5కు వాయిదా వేసింది.
1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో అక్రమ ఆయుధాలతో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో హిట్ అండ్ రన్ కేసులోనూ సల్మాన్ ఖాన్ పలుమార్లు కోర్టు మెట్లెక్కారు.