
సల్మాన్‌కు కోర్టు సమన్లు
జోధ్‌పూర్: అక్రమాయుధాల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు జోధ్‌పూర్ కోర్టు సమన్లు జారీచేసింది. మార్చి పదో తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని గురువారం ఆదేశించింది. కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టులో విచారణ జరుగుతుండగా సాక్షులను మళ్లీ విచారించేందుకు అనుమతించాలంటూ గతంలో సల్మాన్ పెట్టుకున్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే.
1998లో జోథ్‌పూర్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అడవిలో మూడు చింకారాలు, ఒక కృష్ణజింకను సల్మాన్ ఖాన్ వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో లైసెన్స్ లేకుండా ఆయుధాలను కలిగి ఉన్నందున ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్మాన్ పై కేసు నమోదు చేసింది.