Arms Act Case
-
యూపీ మంత్రికి షాక్.. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చిన కోర్టు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి రాకేశ్ సచాన్కు కాన్పూర్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 1991 అక్రమ ఆయుధాల కేసులో శనివారం ఆయనను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ నిర్ణయంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి, ఆయన మద్దతుదారులు, న్యాయవాదులు వెంటనే కోర్టు గది నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుత పరిణామాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు శనివారం రాత్రి రాకేశ్ సచాన్‌పై కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కాన్పుర్ జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ తివారీ ఫిర్యాదు అందినట్లు చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాకేశ్ సచాన్ 1993 నుంచి 2002వరకు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఫతేపూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ములాయం సింగ్, శివ్‌పాల్ సింగ్‌కు సన్నిహితుడని గుర్తింపు ఉంది. అయితే ఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లారు. భోగ్నిపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. చదవండి: ప్రభుత్వం ఏర్పడి 36 రోజులు.. ఇప్పటివరకు నోచుకోని మంత్రివర్గ విస్తరణ -
వ్యక్తిగత భద్రతకు ఇక రెండు ఆయుధాలే
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం అమలులో ఉన్న ఆయుధ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణ చేసింది. వ్యక్తిగత భద్రత కేటగిరీలో గరిష్టంగా రెండు తుపాకులు మాత్రమే కలిగి ఉండేలా మార్పు తీసుకువచ్చింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం మూడో ఆయుధం కలిగిన వారు తక్షణం దానిని డిపాజిట్ చేయాలని స్పష్టం చేశారు. సాధారణంగా తుపాకీ లైసెన్సును మూడు కేటగిరీల్లో జారీ చేస్తారు. వ్యక్తిగత భద్రత, సెక్యూరిటీ గార్డులు, ఫైరింగ్, క్రీడల సంబంధికులకు వీటిని ఇస్తుంటారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఒక లైసెన్సుపై గరిష్టంగా మూడు తుపాకులు కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కేవలం 4,700 లైసెన్సులు ఉండగా.. ఆయుధాల సంఖ్య మాత్రం 10 వేల వరకు ఉంది. అయితే సదరు లైసెన్సుపై ఎన్ని ఆయుధాలు కలిగి ఉండవచ్చనే అంశాన్ని జారీ సమయంలోనే స్పష్టం చేస్తారు. అంతకుమించి తుపాకులు కలిగి ఉండటానికి ఆస్కారం ఉండదు. వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఆయుధ లైసెన్సు తీసుకుని దాని ఆధారంగా దానిని ఖరీదు చేసిన వారు మరో కేటగిరీలో వినియోగించడం చట్ట విరుద్ధం. గతంలో అమలులో ఉన్న ఆయుధ చట్టం నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఒక్కో వ్యక్తి గరిష్టంగా మూడు ఆయుధాలు కలిగి ఉండటానికి ఆస్కారం ఉండేది. అయితే దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు గుర్తించిన కేంద్రం గత ఏడాది కీలక సవరణలు చేసింది. దాని ప్రకారం ఈ కేటగిరీలో గరిష్టంగా రెండు ఆయుధాలు మాత్రమే కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని అధికారికంగా అందుకున్న నగర పోలీసు విభాగం అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం సీపీ వ్యక్తిగత కేటగిరీలో రెండు ఆయుధాలు మాత్రమే కలిగి ఉండాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడో ఆయుధాన్ని తక్షణం స్థానిక పోలీస్ స్టేషన్ లేదా అధీకృత ఆయుధ విక్రేతల వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న లైసెన్సు రెన్యువల్ సమయంలో ఆయుధాల సంఖ్యను రెండుకు తగ్గించనున్నారు. లైసెన్సుదారుడు డిపాజిట్ చేసిన ఆయుధాన్ని మరో లైసెన్సుదారుడికి లేదా లైసెన్డ్సు ఆయుధ విక్రేతకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీనికి ఏడాది గడువు ఇస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. లైసెన్సు ఆయుధాలు కలిగి ఉన్న వారి జాబితా, వివరాలు పోలీసుస్టేషన్ల వారీగా అందుబాటులో ఉంటాయి. లాక్డౌన్ హడావుడి ముగిసిన తర్వాత ఆడిటింగ్ చేపట్టాలని పోలీసు విభాగం నిర్ణయించింది. అందులో ఎవరైనా తమ మూడో ఆయుధం డిపాజిట్ చేయనట్లు తేలితే వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు చట్ట పరంగా చర్యలు తీసుకోనున్నారు. నగర పోలీసు విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘తొలుత కేంద్రం వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఒకరికి ఒక ఆయుధం మాత్రమే ఉండేలా మార్పులు చేయాలని భావించింది. అయితే అనేక వర్గాల నుంచి వచ్చిన ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రెండు ఆయుధాలకు పరిమితం చేసింది. మూడో ఆయుధం కలిగిన వారు వెంటనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు. ఇకపై ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పోలీసులు, సాయుధ బలగాల నుంచి ఆయుధం లాక్కుంటే వారికి గరిష్టంగా జీవితఖైదు పడేలా మరో సవరణను కేంద్రం తీసుకువచ్చింది. -
లొంగిపోయిన ఆశిష్ పాండే
సాక్షి, న్యూఢిల్లీ: తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన బీఎస్పీ మాజీ ఎంపీ కుమారుడు రాకేశ్ పాండే కుమారుడు అశిష్ పాండే గురువారం పాటియాలా హౌస్ కోర్టులో లొంగిపోయారు. ఆయనను న్యాయస్థానం ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగించింది. నాలుగు రోజులు కస్టోడియల్ రిమాండ్‌కు ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. అశిష్ పాండేను లక్నో తీసుకెళ్లాల్సిన అవసరముందని, తుపాకీ స్వాధీనం చేసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. పాండేను రిమాండ్‌కు ఇవ్వాలన్న వాదనను ఆయన తరపు న్యాయవాది వ్యతిరేకించారు. విచారణకు పాండే సహకరిస్తున్నారని, తుపాకీని కూడా పోలీసులకు అప్పగించామని తెలిపారు. తన క్లైయింట్ తండ్రి రాజకీయ నాయకుడు కావడం వల్లే ఈ ఘటనపై మీడియా అత్యుత్సాహం చూపించిందన్నారు. (ప్రాథమిక వార్త: తుపాకీతో మాజీ ఎంపీ కొడుకు హల్చల్!) మీడియా బాధితుడిని: పాండే తాను బాధ్యత గల పౌరుడినని, నేరస్తుడిని కాదని అశిష్ పాండే అన్నారు. ప్రసార సాధనాలు ఏకపక్షంగా వ్యవహరించాయని, తాను మీడియా విచారణనకు బాధితుడిని అయ్యాయని వాపోయారు. సీసీ టీవీ ఫుటేజీని లోతుగా పరిశీలించాలని, హోటల్ సెక్యురిటీ సిబ్బంది నుంచి వివరాలు సేకరించాలని పోలీసులను కోరారు. కాగా, తనకు దారివ్వలేదన్న కోపంతో ఓ జంటను తుపాకీతో బెదిరించినట్టు పాండే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
తుపాకీతో మాజీ ఎంపీ కొడుకు హల్చల్!
-
‘అడ్డు తప్పుకోకుంటే కాల్చి పడేస్తా’
సాక్షి, న్యూఢిల్లీ : తనకు దారి ఇవ్వలేదనే కోపంతో తుపాకీ చూపిస్తూ దంపతులపై బెదిరింపులకు దిగాడు మాజీ ఎంపీ కొడుకు. తుపాకీతో వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ మాజీ ఎంపీ రాకేశ్ పాండే కుమారుడు అశిష్ పాండే ఆదివారం దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కి వెళ్లాడు. కారు పార్కింగ్ చేసే సమయంలో తనకు అడ్డుగా ఉన్నారనే కోపంతో ఓ జంటతో వాగ్వాదానికి దిగాడు. అయితే వారు కూడా ప్రతిఘటించడంతో కోపోద్రిక్తుడైన ఆశిష్ తన దగ్గర ఉన్న తుపాకీతో బెదిరించాడు. అడ్డు తప్పుకోకుంటే కాల్చి పారేస్తానంటూ గొడవకు దిగాడు. ఈ సమయంలో ఆశిష్ పక్కనే ఉన్న యువతి, సెక్యూరిటీ గార్డు ఆపేందుకు ప్రయత్నించినా అతడిని అదుపు చేయలేకపోయారు. హోటల్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించినప్పటికీ అతడు దురుసుగా ప్రవర్తించాడు. అయితే.. ఆశిష్ మహిళల వాష్‌రూంలోకి వస్తూంటే తాను అడ్డుకున్నందు వల్లే ఇలా ప్రవర్తించాడని బాధిత మహిళ ఆరోపించింది. కాగా ఈ తతంగాన్నంతా గుర్తు తెలియని వ్యక్తులెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో తమ దృష్టికి రావడంతో ఆశిష్‌పై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. -
మమ్మల్ని కొట్టి మాపైనే కేసులా?: గండ్ర
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి మద్యం సేవించి తన సోదరుడికి చెందిన క్రషర్ వద్దకెళ్లి అక్కడున్న వాళ్లను కొట్టి తుపాకీతో బెదిరించిన వ్యక్తిని వదిలి తమపై ఆయుధ చట్టం కింద కేసులు పెట్టడమేంటని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులపై ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఈ ఆపద్ధర్మ ప్రభుత్వంలో కనిపిస్తోం దన్నారు. తన సోదరుడిని బెదిరించినట్టు తెలిసి దీనిపై తాను ఏసీపీతో మాట్లాడానని, అయితే వారు తన సోదరుడి ఫిర్యాదుపై కేసు పెట్టకుం డా జాప్యం చేశారన్నారు. అనంతరం రవీందర్రావు అనే వ్యక్తి దగ్గర ఫిర్యాదు తీసుకుని తమపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. తుపాకులు పెట్టి బెదిరించడానికి తమ వద్ద తుపాకులే లేవ ని, తాను, తన సోదరుడు లైసెన్స్డ్ ఆయుధాలను ఎప్పుడో పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశామన్నారు. ఈ విషయంలో డీజీపీ చొరవ తీసుకొని, నిష్పాక్షిక విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘గండ్ర’ సోదరులపై ఆయుధ చట్టం కేసు
శాయంపేట: కాంగ్రెస్ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డిలపై మంగళవారం రాత్రి ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. క్రషర్ల లావాదేవీల గొడవే కారణమని పోలీసులు తెలిపారు. ఎస్ఐ రాజబాబు కథనం ప్రకారం.. మండలంలోని గోవిందాపూర్ శివారులో గండ్ర వెంకటరమణారెడ్డి సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి, ఎర్రబెల్లి రవీందర్రావు కలసి శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్స్ ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల తర్వాత కంపెనీ నుంచి గండ్ర భూపాల్‌రెడ్డి వేరుపడి ఆ క్రషర్ పక్కనే మరో క్రషర్ బాలాజీ రోబో సాండ్ను ఏర్పాటు చేశారు. అయితే.. శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్కు సంబంధించిన లావాదేవీలు నేటికీ పూర్తి కాలేదు. ఈ క్రమంలో బాలాజీ రోబో సాండ్ కంపెనీకి చెందిన సూపర్ వైజర్ గోవర్దన్‌రెడ్డి సోమవారం రాత్రి క్రషర్ సమీపంలో పని చేసుకుంటుండగా అక్కడికి వచ్చిన ఎర్రబెల్లి రవీందర్రావు, అతడి అనుచరులు కంపెనీ లావాదేవీలు తేలకుండా ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నావంటూ దాడి చేసి తుపాకీతో బెదిరించారు. గోవర్దన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రవీందర్రావు, అతడి అనుచరులపై ఆయుధ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలాఉండగా..తమ క్రషర్స్‌లో పనిచేస్తుండగా గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు భూపాల్‌రెడ్డి అనుచరులతో కలసి వచ్చి తుపాకీతో బెదిరించారని రవీందర్రావు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గండ్ర సోదరులు, వారి అనుచరులపైనా ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజబాబు తెలిపారు. -
జోద్పూర్ కోర్టు తీర్పు : సల్మాన్ ఖాన్ నిర్దోషి
జోద్పూర్ : లైసెన్స్ గడువు ముగిసిన తరువాత ఆయుధాలు కలిగి ఉండటం, వినియోగించడంపై ఆరోపణలను ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. దాదాపు 18 సంవత్సరాలుగా సల్మాన్ వెంటాడుతున్న ఆయుధాల కేసు నుంచి విముక్తి లభించింది. 1998 అక్టోబర్‌లో జోద్‌పూర్‌లో అనుమతి లేకుండా ఆయుధాలను వినియోగించటంతో పాటు వన్యప్రాణులను వేటాడినందుకు సల్మాన్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటికే రెండు కేసుల్లో సల్మాన్ నిర్దోషిగా నిరూపణ కాగా తాజాగా ఆయుధాల కేసు నుంచి కూడా సల్మాన్‌కు విముక్తి లభించింది. బుధవారం ఈ కేసులో తుది తీర్పు వెల్లడించిన జోద్పూర్ జిల్లా కోర్టు సల్మాన్‌ను నిర్దోషి అంటూ తీర్పు వెల్లడించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సల్మాన్ పై నమోదైన అభియోగాలను తోసిపుచ్చిన కోర్టు. -
ఆ కేసులో నేరం రుజువైతే ఏడేళ్లు జైలు
-
సల్మాన్ కేసులో తీర్పు, నేరం రుజువైతే ఏడేళ్లు జైలు
జోద్పూర్ : అనుమతి లేకుండా మారణాయుధాలు కలిగి ఉండటం, వినియోగించటం లాంటి నేరాల కింద సల్మాన్ ఖాన్‌పై నమోదైన కేసులో ఈ రోజు(బుదవారం) జోద్పూర్ జిల్లా కోర్టు తీర్పు వెల్లడించనుంది. 1998 అక్టోబర్‌లో అనుమతి లేకుండా మారణాయుధాలు వినియోగించి వన్య ప్రాణులను వేటాడినందుకు గాను సల్మాన్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసుల్లో సల్మాన్ నిర్దోషిగా రుజువవ్వగా ఇప్పుడు మూడో కేసులో తీర్పు వెలవడనుంది. అనుమతి లేకుండా .22 రైఫిల్, .32 రివాల్వర్ కలిగి ఉన్న కేసులో సల్మాన్‌పై నమోదైన కేసులో నేడు తీర్పు వెలువడనుంది. తీర్పు సందర్భంగా కోర్టుకు హాజరయ్యేందుకు సల్మాన్ ప్రత్యేక విమానంలో జోద్పూర్ చేరుకున్నారు. సల్మాన్‌తో పాటు ఆయన సోదరి అల్వీరా, కొంత మంది లాయర్లు ఉన్నారు. ఈ కేసులో సల్మాన్ దోషిగా రుజువైతే ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే కేసుకు సంబందించి ఏప్రిల్ 2006లో ఒకసారి తరువాత ఆగస్టు 2007 కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించాడు సల్మాన్. తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
సల్మాన్‌కు కోర్టు సమన్లు
జోధ్‌పూర్: అక్రమాయుధాల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు సమన్లు జారీచేసింది. మార్చి పదో తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని గురువారం ఆదేశించింది. కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టులో విచారణ జరుగుతుండగా సాక్షులను మళ్లీ విచారించేందుకు అనుమతించాలంటూ గతంలో సల్మాన్ పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే. 1998లో జోథ్‌పూర్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అడవిలో మూడు చింకారాలు, ఒక కృష్ణజింకను సల్మాన్ ఖాన్ వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో లైసెన్స్ లేకుండా ఆయుధాలను కలిగి ఉన్నందున ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్మాన్ పై కేసు నమోదు చేసింది.