తనకు దారి ఇవ్వలేదనే కోపంతో తుపాకీ చూపిస్తూ దంపతులపై బెదిరింపులకు దిగాడు మాజీ ఎమ్మెల్యే కొడుకు. తుపాకీ ఝుళిపిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాకేశ్ పాండే కుమారుడు అశిష్ పాండే ఆదివారం దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కి వెళ్లాడు. కారు పార్కింగ్ చేసే సమయంలో తనకు అడ్డుగా ఉన్నారనే కోపంతో ఓ జంటతో వాగ్వాదానికి దిగాడు. అయితే వారు కూడా ప్రతిఘటించడంతో కోపోద్రిక్తుడైన ఆశిష్ తన దగ్గర ఉన్న తుపాకీతో బెదిరించాడు. అడ్డు తప్పుకోకుంటే కాల్చి పారేస్తానంటూ గొడవకు దిగాడు.ఈ సమయంలో ఆశిష్ పక్కనే ఉన్న యువతి, సెక్యూరిటీ గార్డు ఆపేందుకు ప్రయత్నించినా అతడిని అదుపు చేయలేకపోయారు. హోటల్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించినప్పటికీ అతడు దురుసుగా ప్రవర్తించాడు. అయితే.. ఆశిష్ మహిళల వాష్‌రూంలోకి వస్తూంటే తాను అడ్డుకున్నందు వల్లే ఇలా ప్రవర్తించాడని బాధిత మహిళ ఆరోపించింది. కాగా ఈ తతంగాన్నంతా గుర్తు తెలియని వ్యక్తులెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో తమ దృష్టికి రావడంతో ఆశిష్‌పై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
తుపాకీతో మాజీ ఎంపీ కొడుకు హల్‌చల్!
Published Tue, Oct 16 2018 12:28 PM | Last Updated on Wed, Mar 20 2024 3:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement