సల్మాన్‌ను వెంటాడుతున్న కృష్ణజింక కేసు | Poaching case: Salman Khan, 4 others asked to be present before jodhpur Court court | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ను వెంటాడుతున్న కృష్ణజింక కేసు

Published Fri, Jan 13 2017 4:55 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

సల్మాన్‌ను వెంటాడుతున్న కృష్ణజింక కేసు

సల్మాన్‌ను వెంటాడుతున్న కృష్ణజింక కేసు

జోథ్‌పూర్‌: కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ఖాన్‌, టబు, సైఫ్‌ అలీఖాన్‌, సోనాలి బింద్రే, నీలంలకు శుక్రవారం జోథ్‌పూర్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో అన్ని సాక్ష్యాలను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కృష్ణ జింకను వేటాడటంతో పాటు అక్రమంగా ఆయుధాలు కలిగిఉన్నారనే ఆరోపణలపై సల్మాన్‌ ఖాన్‌ విచారణ ఎదుర్కొంటున్నారు. 1998లో హమ్‌ సాథ్‌ సాథ్‌ హై చిత్ర షూటింగ్‌ రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో జరుగుతున్న సమయంలో సల్మాన్‌ ఖాన్‌ తన సహ నటీనటులు సైఫ్‌అలీఖాన్‌, సోనాలి బింద్రే, టబు, నిలంలతో కలిసి కృష్ణ జింకను వేటాడారు. దీంతో పాటు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసులో సల్మాన్‌ ఖాన్‌ను ఈ నెల 18న హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement