
సాక్షి, జోధ్‌పూర్ : కృష్ణజింకను వేటాడిన కేసులో ఐదేళ్ల శిక్షకు గురైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం రాత్రి ఇక్కడి సెంట్రల్ జైలులో గడిపారు. బెయిల్‌పై ఆశలతో శుక్రవారం ఉదయం మేల్కొన్నారు. రాత్రికి ఆయన నిద్రించేందుకు జైలు అధికారులు నాలుగు దుప్పట్లు ఇచ్చారు. విలాసవంతమైన బెడ్‌పై నిద్రించే సల్మాన్ చెక్క పరుపుపై నిద్రించడం కష్టమైనా బెయిల్ లభిస్తే ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. కేసు నుంచి విముక్తి లభిస్తే ముంబయి తిరిగి వెళ్లేందుకు సల్మాన్ కోసం చార్టర్డ్ ఫ్లైట్ సిద్ధంగా ఉండగా, శిక్ష ఖరారు కావడంతో పోలీసు వాహనంలో ఆయనను జైలుకు తరలించారు. జైలుకు చేరుకున్న వెంటనే భావోద్వేగానికి గురైన సల్మాన్‌కు రక్తపోటు అధికమైంది. ఆ తర్వాత సాధారణ స్ధాయికి చేరుకుందని జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ చెప్పారు.సాధారణ ఖైదీలాగే సల్మాన్‌ను పరిగణిస్తున్నామని ఆయన వెల్లడించారు.
రోటీ..దాల్
జైలులో రాత్రి సల్మాన్‌కు పప్పు, రోటీ అందించగా వాటిని తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. సల్మాన్ పక్క సెల్‌లో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపూ ఉన్నారు. మరోవైపు సల్మాన్‌కు బెయిల్ దక్కేలా ఆయన న్యాయవాద బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. జోధ్‌పూర్ కోర్టు తీర్పును సల్మాన్ హైకోర్టులో సవాల్ చేయనున్నారు. తక్షణం బెయిల్ పొందేందుకే తొలుత సల్మాన్ లీగల్ టీం ప్రయత్నాలు సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment