సల్మాన్ ఖాన్కు వ్యతిరేకం కాదు: రేణుక | I’m not anti-Salman Khan, neither was my post: Renuka Shahane | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్కు వ్యతిరేకం కాదు: రేణుక

Published Wed, Jul 27 2016 10:28 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

సల్మాన్ ఖాన్కు వ్యతిరేకం కాదు: రేణుక

సల్మాన్ ఖాన్కు వ్యతిరేకం కాదు: రేణుక

ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు తాను వ్యతిరేకం కాదని నటి రేణుకా సహాని స్పష్టం చేసింది. సల్మాన్ కు వ్యతిరేకంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, న్యాయవ్యవస్థలోని లొసుగులనే ఎత్తిచూపానని తెలిపారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత ఫేస్బుక్ లో రేణుక పోస్ట్ చేసిన కామెంట్స్ పై 'సుల్తాన్' అభిమానులు మండిపడ్డారు. దీంతో తన వ్యాఖ్యలపై ఆమె వివరణయిచ్చింది.

'సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశానని భావించి అతడి అభిమానులు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను పోస్టు చేసిన దాన్ని పూర్తిగా చదవలేదు. నేనేం చెప్పాలనుకున్నానో అర్థం చేసుకోలేదు. సల్మాన్ ఖాన్కు నేను వ్యతిరేకం కాదు. అతడికి వ్యతిరేకంగా ఈ పోస్టు చేయలేదు. సల్మాన్ తో నాకు సుహృద్భావ సంబంధాలున్నాయ'ని రేణుకా సహాని పేర్కొంది.

న్యాయం కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిన దుస్థితి ఎందుకు వస్తుందో అన్న ప్రశ్న తన మదిలో ఎప్పటినుంచో ఉందన్నారు. నిర్దేశిత సమయంలోగా కోర్టులు తీర్పులు వచ్చేలా చేయలేమా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ప్రచారం కోసం చేస్తున్నామని అనడడం భావ్యం కాదని అంది. 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో సల్మాన్ కు వదినగా రేణుకా సహాని నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement