Renuka shahane
-
ఆ ఒక్క సినిమా వల్ల నేను హీరోయిన్ కాలేకపోయా: నటి
సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ జంటగా నటించిన హిట్ చిత్రాల్లో హమ్ ఆప్కే హై కోన్ ఒకటి. 1994లో రిలీజైన ఈ సినిమాలో మాధురి చెల్లెలు పాత్ర బాగా క్లిక్ అయింది. ఈ పాత్రను రేణుక శహానే పోషించింది. అయితే ఆ క్యారెక్టర్లో నటించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్పాడట నిర్మాత. తాజాగా ఈ విషయాన్ని రేణుక ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. 'హమ్ ఆప్కే హై కోన్ నిర్మాత రాజ్‌కుమార్ ఈ మూవీ విజయవంతం అవుతుందని ముంచే అంచనా వేశాడు. కానీ హీరోయిన్ చెల్లెలుగా నటించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని హెచ్చరించాడు. ఒక్కసారి హీరోయిన్‌కు చెల్లెలుగా నటించావంటే ఎప్పటికీ కథానాయికను కాలేనని, కేవలం సెకండ్ లీడ్‌గా లేదంటే సైడ్ రోల్స్ ఇస్తారని నొక్కి చెప్పాడు. ఆయన మాటలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ముందైతే ఈ మూవీ పూర్తి చేద్దామనుకున్నాను. ఆ సినిమా హిట్టయ్యాక నాకు ఆఫర్లైతే వచ్చాయి కానీ హీరోయిన్గా మాత్రం కాదు. సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. దానివల్ల నాకు పెద్దగా పేరు ప్రఖ్యాతలేమీ రాలేదు' అని చెప్పుకొచ్చింది. రేణుక మాసూమ్, తుమ్ జియో హజారూన్ సాల్, ఏక్ అలగ్ మౌసమ్ వంటి చిత్రాల్లో నటించింది. తర్వాతి కాలంలో నటుడు అశుతోశ్ రానాను పెళ్లి చేసుకుంది. చదవండి: ఫిలిం చాంబర్లో మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు వేలు చూపిస్తూ -
9 నెలలు.. 15 నిమిషాల్లా గడిచాయి
ఈ సంవత్సరంలో శుభాల కన్నా అన్నీ అశుభాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్నో విపత్తులకు కూడా ఈ కేంద్రంగా మారిన 2020 సంవత్సరం ఆగడాలకు మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే లాక్‌డౌనే ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో కన్నా షూటింగుల్లో ఎక్కువగా గడిపే సినీనటులకు వారి ఇంటినే కొత్తగా పరిచయం చేసింది. కుటుంబంతో సయం కేటాయించడంతో పాటు ఇంట్లోవాళ్లకు పనుల్లో కాస్త సాయం చేయమంటూ నాలుగు మంచి అలవాట్లు కూడా నేర్పించింది. కానీ అప్పుడే ఈ ఏడాది అయిపోయిందా అనిపిస్తోంది. (చదవండి: 25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే) బాలీవుడ్ నటి కాజోల్కు కూడా అచ్చంగా ఇలాగే అనిపించింది. తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మార్చి నుంచి నవంబర్ వరకు అంటే తొమ్మిది నెలలు 15 నిమిషాల్లా అనిపిస్తోంది అని రాసుకొచ్చారు. దీన్ని నటి రేణుకా షెహానే సమర్థిస్తూ నిజమేనని కామెంట్ పెట్టారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 2 లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి. కాగా కాజోల్ సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా క్యాప్షన్ మాత్రం క్రేజీగా ఉండేలా చూసుకుంటారు. ఆమె చివరగా భర్త అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి తానాజీ సినిమాలో నటించారు. (చదవండి: ‘ఆ సంఘటన నా కెరీర్‌ను నాశనం చేసింది’) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
ఆ దేవదూతకు కృతజ్ఞతలు: నటి
ముంబై: టీవీ నటి నుపూర్ అలంకర్‌కు ఆర్థిక సాయం అందించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కు నటి రేణుకా షాహనే సోషల్ మీడియా వేదికగా బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్, మహరాష్ట్ర బ్యాంక్ సంక్షోభం వల్ల తన పోదుపు డబ్బు రాకపోవడం, కరోనా వైరస్ నేపథ్యంలో అమలవుతున్న లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడటంతో అలంకర్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని షాహానే వరుసు పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పోస్టులో ‘షాహానే తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తనకి చికిత్స అందించాలని వైద్యులు సూచించారు. తన తల్లికి వైద్యం చేయించేందుకు అలంకర్ వద్ద డబ్బులు లేవు తనకు సాయం చేయాలి’ అంటూ షాహానే జూన్ 9ర ఫేస్బుక్లో షేర్ చేశారు. అలాంకర్ ‘రీత్’, ‘ఘర్ కి లక్ష్మి బేటియాన్’, ‘అగ్లే జనమ్ మోహే బిటియా హాయ్ కిజో’, ‘స్వరాగిని’ వంటి టీవీ సిరీయల్స్‌లో నటించారు. (‘ఒకే ఒక్కడు అక్షయ్’) షాహానే పోస్టు చూసిన అక్షయ్ వెంటనే స్పందించి అలంకర్‌కు ఆర్థిక సాయం అందించారు. దీంతో షాహానే ‘‘మా ఇండ్రస్టికి చెందిన ఓ ఎంజెల్(దేవదూత) నా స్నేహితురాలిని ఆదుకుంది. తన తల్లికి మెరుగైన వైద్యం అందించింది అంతేకాదు పరిశ్రమలో చాల మంది నటులకు కూడా ఆ ఎంజెల్(అక్షయ్ కుమార్) ఆర్థిక సాయం అందించింది. ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే’’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అదే విధంగా ‘‘అక్షయ్ కుమార్ నా పోస్టు చూసిన తర్వాత నా భర్త, నటుడు ఆశుతోష్ రానాను సంప్రదించారు. ఆయనను పిలిచి నా పోస్టు గురించి సమాచారం కనుక్కుని అలంకర్‌కు ఎంత డబ్బు కావాలని అడిగి అంత మొత్తం సాయం చేసి అలంకర్‌ను ఆర్థికంగా ఆదుకున్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు. (సోదరి కోసం విమానం.. ఖండించిన అక్షయ్) -
సల్మాన్ ఖాన్‌కు వ్యతిరేకం కాదు: రేణుక
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు తాను వ్యతిరేకం కాదని నటి రేణుకా సహాని స్పష్టం చేసింది. సల్మాన్ కు వ్యతిరేకంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, న్యాయవ్యవస్థలోని లొసుగులనే ఎత్తిచూపానని తెలిపారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత ఫేస్బుక్ లో రేణుక పోస్ట్ చేసిన కామెంట్స్ పై 'సుల్తాన్' అభిమానులు మండిపడ్డారు. దీంతో తన వ్యాఖ్యలపై ఆమె వివరణయిచ్చింది. 'సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశానని భావించి అతడి అభిమానులు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను పోస్టు చేసిన దాన్ని పూర్తిగా చదవలేదు. నేనేం చెప్పాలనుకున్నానో అర్థం చేసుకోలేదు. సల్మాన్ ఖాన్‌కు నేను వ్యతిరేకం కాదు. అతడికి వ్యతిరేకంగా ఈ పోస్టు చేయలేదు. సల్మాన్ తో నాకు సుహృద్భావ సంబంధాలున్నాయ'ని రేణుకా సహాని పేర్కొంది. న్యాయం కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిన దుస్థితి ఎందుకు వస్తుందో అన్న ప్రశ్న తన మదిలో ఎప్పటినుంచో ఉందన్నారు. నిర్దేశిత సమయంలోగా కోర్టులు తీర్పులు వచ్చేలా చేయలేమా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ప్రచారం కోసం చేస్తున్నామని అనడడం భావ్యం కాదని అంది. 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో సల్మాన్ కు వదినగా రేణుకా సహాని నటించిన సంగతి తెలిసిందే. -
నవ్వుల రేణు... నువ్వెలా ఉన్నావు?
అజ్ఞాతవాసం: అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే కలిగే ఫీలింగ్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందంగా నవ్వే అమ్మాయిని చూస్తే ఆ అనుభూతి కొన్నాళ్ల పాటు వెన్నాడుతుంది. చిన్నపిల్లల నవ్వులంటే ఇష్టపడని వారుండరు. కల్మషరహితంగా, స్వచ్ఛమైన నవ్వులు రువ్వే ఆ నటి అందుకే.. అందరికీ చాలా తొందరగా ఇష్టమైపోయింది. మరి ఇప్పుడు తెరనొదిలి ఎటు వెళ్లిపోయింది? చిన్నితెర నుంచి సినీతెరకు ఎదిగిన నటీనటుల్లో అదృష్టానికి కొదవుంటుందేమో కాని ప్రతిభకు కొదవుండదు. ఎందుకంటే స్మాల్‌స్క్రీన్ మీద తమని తాము ఎంతో నిరూపించుకుంటేనే సిల్వర్‌స్క్రీన్ పిలుస్తుంది మరి. అలాంటి నటీమణుల్లో రేణుకా సహాని ఒకరు. చిన్నితెరకు వన్నెలద్ది... పాటలు చూడాలంటే చిత్రలహరి, సీరియల్ చూడాలంటే రామాయణం... ఇలా దూరదర్శన్ తప్ప మరో చానెల్ తెలియని రోజుల్లో... సురభి అనే సూపర్‌హిట్ షో ఒకటి టాక్ ఆఫ్ ద కంట్రీ అయింది. దూరదర్శన్‌లో 1993లో ప్రారంభమైన ఈ షో 2001 దాకా కొనసాగిందంటేనే ఆ షో ఎంత విజయం సాధించిందో అర్థమవుతుంది. అంతటి పాప్యులర్ షోకి సమర్పకురాలుగా వ్యవహరించింది రేణుకా సహాని. ఇంపైన నవ్వులతో ఇంటింటి ఇంతి అయిపోయింది. వీక్షకులు సొంత మనిషిలా భావించేంత ఆప్తురాలైపోయింది. మహారాష్ట్రలో పుట్టిన రేణు... మితిబాయి కాలేజిలో ఆర్ట్స్ స్టూడెంట్. మరాఠీ సినిమాతో కెరీర్‌కు శ్రీకారం చుట్టిన సహాని... ఆ తర్వాతా ఎన్నో మరాఠీ సినిమాలు చేసింది. ఆమె తల్లి శాంతా గోఖలే రాసిన రిటా వెలింగ్కర్లోని రిటా అనే పాత్రతో తన తొలి మరాఠీ సినిమా చేసిందామె. సర్కస్ అనే తొలి దశపు భారతీయ సీరియల్లోనూ ఆమె మెరిసింది. ఆ తర్వాత సురభి టీవీ షో చేసింది. మరాఠీ సినిమాల ద్వారా రాని పేరు ప్రఖ్యాతులు సురభి ద్వారా వచ్చాయి. అవే ఆమెను హమ్ ఆప్ కే హై కౌన్ వంటి సూపర్‌హిట్ సినిమాలో ప్రాధాన్యమున్న క్యారెక్టర్ వరించేలా చేశాయి. హిందీలో జాకీష్రాఫ్, పల్లవి జోషి తదితరులతో నటించింది. ఇంతిహాన్ అనే టివీ సీరియల్లో పోషించిన బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన యువతి పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. రామూ స్కూల్ ద్వారా టాలీవుడ్లోకి... ప్రతిభను వెతికిపట్టుకోవడంలో మంచి పట్టున్న రామ్‌గోపాల్‌వర్మ నిర్మాణంలో తెలుగులో... మనీ సినిమాలో చిన్నాకు జోడీగా నటించింది. కొన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా తీసిన మనీమనీలోనూ నటించింది. అటు నటిగా జన్మనిచ్చిన చిన్నితెరని వదలకుండానే వెండితెర మీదా రాణించిన రేణూ... తెరమీద తళుక్కుమన్నది తక్కువే అయినా ఎక్కువగా గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. 1998 వరకూ వరుసగా నటిస్తూ వచ్చినా... ఆ తర్వాత అరకొరగా అదీ 2010 దాకా కనిపించి గత ఐదారేళ్ల నుంచి పూర్తిగా మాయమైంది. ఏమైపోయిందీ నవ్వుల జల్లు? విలన్‌తో జోడీకట్టి... అత్యంత క్రూరంగా నవ్వే అశుతోష్‌రాణా తెలుసా? బాలీవుడ్‌కు మాత్రమే కాదు బంగారం లాంటి సినిమాల ద్వారా టాలీవుడ్‌లోనూ పాప్యులర్ అయిన నటుడు. నవ్వితే మన చావుకొచ్చినట్టే అనిపించే అంతటి విలన్ రూపుడ్ని నవ్వితే మన ముందు మల్లెలు విరిసినట్టుండే రేణూ 2001లో ప్రేమించి పెళ్లాడింది. శౌర్యమన్, సత్యేంద్ర అనే ఇద్దరు కొడుకులకు తల్లయింది. ఫుడ్ ఫుడ్ ఛానెల్లో చివరిసారిగా కనిపించిన రేణూ... ‘‘మహిళా వీక్షకులతో కనెక్ట్ అయి ఉండడం చాలా ఆనందం ఇస్తుంది. సీరియల్స్‌నూ, సినిమాలనూ, షోలనూ ఒకేలా ఎంజాయ్ చేశాను. అయినప్పటికీ ఇందులో దేని ఇంపార్టెన్స్ దానిదే’’ అంటున్నారు. దాదాపు ఏభై ఏళ్ల వయసులో నటుడిగా ఇంకా బిజీగానే ఉన్న భర్త, ఇద్దరు కొడుకుల బాగోగులు చూసుకుంటూ ఆమె హాయిగా కాలం గడిపేస్తున్నారు. మంచి పాత్రలు వస్తే నటించడానికి అభ్యంతరం లేదంటూనే... దర్శకత్వం వహించాలనే కోరికను వ్యక్త పరుస్తున్నారు. రెండు స్క్రీన్‌ప్లేలు కూడా రాసిన రేణూ... త్వరలో హిందీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందంటున్నారు. హాయిగా నవ్వే వాళ్లని చూస్తే అంత హయిగా ఎలా నవ్వగలరా అనిపిస్తుంది. రేణుకా సహానీ జీవితాన్ని గమనిస్తే నవ్వుని తోడు చేసుకున్న వారి జీవనయానం కూడా అంతే హాయిగా కొనసాగుతుందని అనిపిస్తుంది. - ఎస్.సత్యబాబు