
ఈ సంవత్సరంలో శుభాల కన్నా అన్నీ అశుభాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్నో విపత్తులకు కూడా ఈ కేంద్రంగా మారిన 2020 సంవత్సరం ఆగడాలకు మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే లాక్‌డౌనే ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో కన్నా షూటింగుల్లో ఎక్కువగా గడిపే సినీనటులకు వారి ఇంటినే కొత్తగా పరిచయం చేసింది. కుటుంబంతో సయం కేటాయించడంతో పాటు ఇంట్లోవాళ్లకు పనుల్లో కాస్త సాయం చేయమంటూ నాలుగు మంచి అలవాట్లు కూడా నేర్పించింది. కానీ అప్పుడే ఈ ఏడాది అయిపోయిందా అనిపిస్తోంది. (చదవండి: 25 ఏళ్ల దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే)
బాలీవుడ్ నటి కాజోల్‌కు కూడా అచ్చంగా ఇలాగే అనిపించింది. తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మార్చి నుంచి నవంబర్ వరకు అంటే తొమ్మిది నెలలు 15 నిమిషాల్లా అనిపిస్తోంది అని రాసుకొచ్చారు. దీన్ని నటి రేణుకా షెహానే సమర్థిస్తూ నిజమేనని కామెంట్ పెట్టారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 2 లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి. కాగా కాజోల్ సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా క్యాప్షన్ మాత్రం క్రేజీగా ఉండేలా చూసుకుంటారు. ఆమె చివరగా భర్త అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి తానాజీ సినిమాలో నటించారు. (చదవండి: ‘ఆ సంఘటన నా కెరీర్‌ను నాశనం చేసింది’)
Comments
Please login to add a commentAdd a comment