ఆ దేవదూతకు కృతజ్ఞతలు: నటి | TV Actress Renuka Shahane Thanks To Akshay Kumar For Helping Nupur Alankar | Sakshi
Sakshi News home page

నటికి ఆర్థిక సాయం అందించిన అక్షయ్‌

Published Wed, Jun 17 2020 11:57 AM | Last Updated on Wed, Jun 17 2020 12:21 PM

TV Actress Renuka Shahane Thanks To  Akshay Kumar For Helping Nupur Alankar - Sakshi

ముంబై: టీవీ నటి నుపూర్‌ అలంకర్‌కు ఆర్థిక సాయం అందించిన బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌కు నటి  రేణుకా షాహనే సోషల్‌ మీడియా వేదికగా బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్‌, మహరాష్ట్ర బ్యాంక్‌ సంక్షోభం వల్ల తన పోదుపు డబ్బు రాకపోవడం, కరోనా వైరస్‌ నేపథ్యంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడటంతో అలంకర్‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని షాహానే వరుసు పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పోస్టులో ‘షాహానే తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తనకి చికిత్స అందించాలని వైద్యులు సూచించారు. తన తల్లికి వైద్యం చేయించేందుకు అలంకర్‌ వద్ద డబ్బులు లేవు తనకు సాయం చేయాలి’ అంటూ షాహానే జూన్‌ 9ర ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. అలాంకర్ ‘రీత్’, ‘ఘర్ కి లక్ష్మి బేటియాన్’, ‘అగ్లే జనమ్ మోహే బిటియా హాయ్ కిజో’, ‘స్వరాగిని’ వంటి టీవీ సిరీయల్స్‌లో నటించారు. (‘ఒకే ఒక్కడు అక్షయ్‌’)

షాహానే పోస్టు చూసిన అక్షయ్‌ వెంటనే స్పందించి అలంకర్‌కు ఆర్థిక సాయం అందించారు. దీంతో షాహానే ‘‘మా ఇండ్రస్టికి చెందిన ఓ ఎంజెల్‌(దేవదూత) నా స్నేహితురాలిని ఆదుకుంది. తన తల్లికి మెరుగైన వైద్యం అందించింది అంతేకాదు పరిశ్రమలో చాల మంది నటులకు కూడా ఆ ఎంజెల్(అక్షయ్‌ కుమార్‌)‌ ఆర్థిక సాయం అందించింది. ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే’’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అదే విధంగా ‘‘అక్షయ్‌ కుమార్‌ నా పోస్టు చూసిన తర్వాత నా భర్త, నటుడు ఆశుతోష్‌ రానాను సంప్రదించారు. ఆయనను పిలిచి నా పోస్టు గురించి సమాచారం  కనుక్కుని అలంకర్‌కు ఎంత డబ్బు కావాలని అడిగి అంత మొత్తం సాయం చేసి అలంకర్‌ను ఆర్థికంగా ఆదుకున్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు. (సోదరి కోసం విమానం.. ఖండించిన అక్షయ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement