ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చాయి. దీంతో దినసరి కూలీల, వలస జీవుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో కరోనా పోరుకు సెలబ్రిటీలంతా బడుగులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు సంబంధించిన స్టార్స్‌తో పాటు క్రీడాకారులు సైతం ప్రధాని సహాయ నిధికి విరాళాలు సంగతి తెలిసిందే. ఇక గ్లోబల్ జంట ప్రియాంక చోప్రా, నిక్‌జోనస్‌లు కూడా పలు స్వచ్చంద సంస్థలకు విరాళాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడమే కాకుండా తన అభిమానులను, అనుచరులను కూడా తగినంత విరాళం ఇవ్వాల్సిందిగా ఆమె కోరారు. (జనతా కర్ఫ్యూ: ఆత‍్మతో అక్కడ ఉన్నాను)
(కరోనాపై పోరు: అక్షయ్ రూ.25 కోట్ల విరాళం)
‘ప్రస్తుతం ప్రపంచానికి మన సాయం చాలా అవసరం. ప్రపంచంలోని స్వంచ్చంద సంస్థలన్ని కోవిడ్-19పై పోరాడేందుకు జీతం లేని వారిని, తక్కువ జీతం ఉన్నవాళ్లకు, ఇళ్లు లేని వారికి, అదే విధంగా ఈ గడ్డు కాలంలో ప్రథమ పౌరులుగా సేవలందిస్తున్న డాక్టర్లకు, దినసరి కూలీలకు, సినీ పరిశ్రమకు సంబంధించిన చిన్న చిన్న ఆర్టిస్టులను, మన తోటి ఉద్యోగులను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. అందుకే నేను, నా భర్త(నిక్‌జోనస్) ఇప్పటికే @nokidhungry, @give_india, and @sagaftra, #IAHV, @friends_of_aseema, and #PMCares వంటి సంస్థలకు విరాళాలు ఇచ్చాం. ఈ సంస్థలు చేస్తున్న సాయానికి ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాలో రాసుకోచ్చారు. అదే విధంగా ‘‘వాళ్లకు మీ మద్దతు చాలా ముఖ్యం. అలాగే మేము కూడా విరాళం ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ పోస్టులో ఆ సంస్థలకు సంబంధించిన ప్రతి లింక్‌ను షేర్ చేశాను. విరాళం ఇవ్వడమంటే చిన్న విషయం కాదు. ప్రపంచాన్ని ఓడించడానికి మనం కలిసి సహాయపడదాం రండి’’ @nickjonas అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు ప్రియాంక. (కరోనా ఎఫెక్ట్: సీఎం వేతనం కట్!)
కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసందే. మహమ్మారిపై పోరాడేందుకు హీరో అక్షయ్ కుమార్ రూ. 25 కోట్లు ఇవ్వగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్‌లు రూ. 50 లక్షలు చొప్పున విరాళం ఇచ్చారు. ఇటివల సెలబ్రిటీ జంట విరూష్కలు కూడా ప్రధాని సహాయ నిధికి విరాళం ఇచ్చినట్లు ప్రకటించినప్పటీకి ఎంతన్నది స్పష్టం చేయలేదు. కాగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 37, 000 కరోనా మరణాలు నమోదు కాగా.. 7.8 లక్షల మందికి కరోనా సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
చదవండి: కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి
Comments
Please login to add a commentAdd a comment