
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అనారోగ్యంతో అస్పత్రిలో చేరారు. ఆదివారం ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ముంబైలో హిరానందాని హాస్పిటల్‌లో చేరారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా, వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు తాజాగా అక్షయ్ తన ట్వీటర్‌లో ప్రకటించారు. కాగా ఆయన మరోసారి కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లు నిన్న(ఆదివారం) ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆయన నటించిన లక్ష్మీ మూవీ షూటింగ్ సమయంలో అక్షయ్‌కి మొదటిసారి కరోనా సోకింది. హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పిన అక్షయ్ ఇవాల ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిపానులు, సన్నిహితులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిగిరి రావాలని పలువు బాలీవుడ్ ప్రముఖులు ఆకాంక్షిస్తు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్‌సేతు మూవీ షూటింగ్‌లో పాల్గొన్న అక్షయ్ ఈ క్రమంలో కోవిడ్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో రామ్‌సేతు టీం కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోగా 45 మంది సిబ్బందికి నిర్ధారణ ఆయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు.
చదవండి:
మరో బాలీవుడ్ హీరోకి కరోనా పాజిటివ్
‘ప్రేమ నటిస్తూనే అక్షయ్ ఇంకో అమ్మాయితో’
Comments
Please login to add a commentAdd a comment