ఆ యాడ్స్ ఇక చేయను : హీరోయిన్ | Won't do any fairness ad again: Sonali Bendre | Sakshi
Sakshi News home page

ఆ యాడ్స్ ఇక చేయను : హీరోయిన్

Published Fri, Sep 30 2016 3:44 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

ఆ యాడ్స్ ఇక చేయను : హీరోయిన్

ఆ యాడ్స్ ఇక చేయను : హీరోయిన్

టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా వెండితెర మీద వెలిగిపోతున్న తారలందరూ తమ స్టార్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అందుకే ఎడాపెడా బ్రాండ్ ఎండార్స్మెంట్లను ఒప్పేసుకొని వీలైనంత వెనకేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఒకప్పుడు అలాగే అన్ని రకాల బ్రాండ్లను ప్రమోట్ చేసిన సోనాలి బింద్రే, ఇక పై ఫెయిర్నెస్ క్రీం యాడ్లను ఎండార్స్ చేయనంటూ ప్రకటించింది.

ఓ టివి కామెడీ షోలో హీరోయిన్ తనీషా చటర్జీ స్కిన్ టోన్పై చేసిన కామెంట్స్, వివాదాస్పదమైన నేపథ్యంలో... ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సోనాలి తన నిర్ణయాన్ని ప్రకటించింది. చిన్నవయసులో తనకు డబ్బు అవసరమైనప్పుడు అలాంటి యాడ్స్ చేశాను, కానీ ఇక మీదట ఎవరైనా తనకు అలాంటి ఆఫర్ ఇచ్చినా అంగీకరించనని తెలిపింది. ఒక వ్యక్తి స్కిన్ టోన్ గురించి జోక్స్ వేయటం చాలా పెద్ద తప్పన్న సోనాలి, ప్రస్తుత సమాజంలో ఇలాంటి విషయాలపై స్పందన బాగుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement