గోల్డీ... నువ్వు నా ధైర్యానివి | Sonali Bendre celebrates 16th wedding anniversary with Goldie Behl | Sakshi
Sakshi News home page

గోల్డీ... నువ్వు నా ధైర్యానివి

Nov 13 2018 2:58 AM | Updated on Nov 13 2018 2:58 AM

Sonali Bendre celebrates 16th wedding anniversary with Goldie Behl - Sakshi

సోనాలీ బింద్రే, గోల్డీ బెహల్‌

సోనాలీ బింద్రే క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం న్యూయార్క్‌లో ఉంటున్నారామె. నవంబర్‌ 12న సోనాలీ బింద్రే, గోల్డీ బెహల్‌ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా భర్తతో ఉన్న అనుబంధం గురించి సోనాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో నిండిన లేఖను రాశారు. అందులోని సారాంశం ఏంటంటే... ‘‘ఈ లేఖ రాయడం మొదలు పెట్టగానే నా ఆలోచనలు, అనుభవాలకు అక్షర రూపం ఇవ్వలేనని నాకు అర్థం అయిపోయింది. కానీ ప్రయత్నిస్తాను. గోల్డీ.. నువ్వు నాకు భర్త మాత్రమే కాదు. నా ఆప్తమిత్రుడివి. నా సహచరుడివి. నా ధైర్యానివి. కష్టసుఖాల్లో, గెలుపోటముల్లో, ఆరోగ్య, అనారోగ్యాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడటమే కదా పెళ్లి అంటే.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే క్యాన్సర్‌ ఒక్కళ్లు మాత్రమే చేసే యుద్ధం కాదు. ఒక కుటుంబం మొత్తం పడే బాధ. వేదన. నువ్వు అన్ని బాధ్యతలు తీసుకోగలవని, ఇంకొన్ని కూడా తీసుకొని ఇంట్లో ఉండగలవని నాకు తెలుసు. అందుకే ఈ జర్నీని కొనసాగిస్తున్నాను. ఇన్ని రోజులుగా రెండు ఖండాల చుట్టూ తిరుగుతూ ఉన్నావు. థ్యాంక్స్‌ గోల్డీ... నాకు ధైర్యంగా నిలబడినందుకు. నాకు ప్రేమను పంచుతున్నందుకు. ప్రతి అడుగులో తోడుగా ఉన్నందుకు. థ్యాంక్యూ.. అనేది చాలా చిన్న పదం అవుతుందని నాకు తెలుసు. ఎప్పటికీ నీలో ఒక భాగాన్ని, నీదాన్ని. హ్యాపీ యానివర్శరీ గోల్డీ’’ అంటూ తమ పెళ్లి నాటి ఫొటోను కూడా షేర్‌ చేశారు సోనాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement