Goldie Behl
-
బతికే అవకాశం తక్కువన్నారు
క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు నటి సోనాలీ బింద్రే. తన పోరాట ప్రయాణం గురించి ఆమె పలు సందర్భాల్లో పలు విషయాలను వెల్లడించారు. తాజాగా ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సోనాలి. వాటిలోని సారాంశం ఈ విధంగా... ‘‘మన అనుభవాలు మనల్ని ఎలా మార్చాయని వివరించడానికి ప్రత్యేకమైన విధానం ఏదీ లేదు. మనలో వచ్చిన ప్రతి పరివర్తనకు దృశ్యరూపం ఉండకపోవచ్చు. క్యాన్సర్ చికిత్స కోసం గోల్డీ బెహల్ (సోనాలీ భర్త) నన్ను న్యూయార్క్ తీసుకుని వెళ్లారు. అక్కిడికి వెళ్లిన తర్వాతి రోజే డాక్టర్లను సంప్రదించాం. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ చేయించుకున్నాక తెలిసింది.. నాకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్‌లో ఉందని. పైగా నా పొత్తి కడుపు అంతా క్యాన్సర్ వ్యాప్తి చెందిందని, నేను బతికే అవకాశం ముప్పైశాతమే ఉందని డాక్టర్లు చెప్పారు. ఒక్కసారిగా మనసు బద్ధలైంది. కలత చెందాం. కానీ అధైర్య పడలేదు. చికిత్సలో భాగంగా చాలా కాలం కష్టపడాల్సి వస్తుందనుకున్నాను. అయితే నేను చనిపోబోతున్నాననే ఆలోచన నాకు రాలేదు’’ అంటూ తాను కోలుకోవడానికి కారణం భర్త, స్నేహితులు, సన్నిహితులు అని పేర్కొన్నారు సోనాలీ బింద్రే. -
ఈ ఏడాది నీకంతా సంతోషమే
క్యాన్సర్ వ్యాధి చికిత్సలో భాగంగా కీమోథెరపీ కోసం న్యూ యార్క్ వెళ్లిన సోనాలి బింద్రే ఇటీవల ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం న్యూ ఇయర్ మాత్రమే కాదు సోనాలి పుట్టినరోజు కూడా. ఆమె బర్త్‌డే వేడుకలు బంధుమిత్రుల మధ్య జరిగాయి. సునైనా ఖాన్, మలైకా అరోరాఖాన్, అర్జున్ కపూర్, సంజయ్ కపూర్, కునాల్ కపూర్, గాయత్రి ఒబెరాయ్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాలి భర్త గోల్డీ బెహల్ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘జీవితంలో మీ జీవిత భాగస్వామి మీకు మంచి ఫ్రెండ్‌గా, ప్రతిబింబంగా, సపోర్ట్‌గా, స్ఫూర్తిగా ఉండాలంటారు. వాటన్నింటికంటే ఎక్కువే నువ్వు నాకు ఇచ్చావ్. 2018కి నీకు చాలా కష్టంగా గడిచిన ఏడాది. కానీ కష్టాన్ని నువ్వు ఎదుర్కొన్న తీరు నన్ను గర్వపడేలా చేస్తోంది. నన్ను నాకు మరింత పరిచయం చేశావ్. నీ సానుకూల దృక్పథమైన ఆలోచన ధోరణి ఇంకా పెరగాలి. నువ్వు నీలా ఉన్నందుకు థ్యాంక్స్. ఈ ఏడాది నీ జీవితంలో అద్భుతమైన సంతోషాలను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే సోనాలి’’ అని పేర్కొన్నారు గోల్డీ. -
ముంబైకి తిరిగొచ్చిన సోనాలీ బింద్రే
ముంబై: క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న హీరోయిన్ సోనాలీ బింద్రే ముంబైకు తిరిగొచ్చారు. సోమవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు స్నేహితులు, బంధువులు స్వాగతం పలికారు. సోనాలీతో పాటు ఆమె భర్త గోల్డీ బెహల్ కూడా ఉన్నారు. ఈ సమయంలో సోనాలీ తనను చూడటానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినవారికి అభివాదం తెలుపుతూ.. నవ్వుతూ కనిపించారు. గత కొంత కాలంగా హై గ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలీ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతకుముందు తను భారత్‌కు వస్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సోనాలీ.. తనకు క్యాన్సర్ ఇంకా నయం కాలేదని పేర్కొన్నారు. భారత్‌లో సాధారణ జీవితం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ‘నా హృదయం ఎక్కడైతే ఉందో(భారత్) అక్కడికి బయలుదేరుతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కానీ నేను ప్రయత్నిస్తాను.. చాలా రోజుల తరువాత నా కుటుంబాన్ని, మిత్రులను కలుసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం. కాన్సర్‌తో నా పోరాటం ఇంకా ముగియలేదు. కానీ ఈ సమయాన్ని నేను ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాన’ని సోనాలీ ఆ సందేశంలో పేర్కొన్నారు. సోనాలీ ఆరోగ్య పరిస్థితిపై గోల్డీ మాట్లాడుతూ.. సోనాలీ ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. తను వేగంగా కోలుకుంటుందని.. ప్రస్తుతానికి చికిత్స ముగిసిందని పేర్కొన్నారు. కానీ ఈ వ్యాధి మళ్లీ తిరిగి రావచ్చు.. అందుకే రెగ్యూలర్‌గా చెకప్‌లు చెయించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. -
గోల్డీ... నువ్వు నా ధైర్యానివి
సోనాలీ బింద్రే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం న్యూయార్క్‌లో ఉంటున్నారామె. నవంబర్ 12న సోనాలీ బింద్రే, గోల్డీ బెహల్ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా భర్తతో ఉన్న అనుబంధం గురించి సోనాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో నిండిన లేఖను రాశారు. అందులోని సారాంశం ఏంటంటే... ‘‘ఈ లేఖ రాయడం మొదలు పెట్టగానే నా ఆలోచనలు, అనుభవాలకు అక్షర రూపం ఇవ్వలేనని నాకు అర్థం అయిపోయింది. కానీ ప్రయత్నిస్తాను. గోల్డీ.. నువ్వు నాకు భర్త మాత్రమే కాదు. నా ఆప్తమిత్రుడివి. నా సహచరుడివి. నా ధైర్యానివి. కష్టసుఖాల్లో, గెలుపోటముల్లో, ఆరోగ్య, అనారోగ్యాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడటమే కదా పెళ్లి అంటే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే క్యాన్సర్ ఒక్కళ్లు మాత్రమే చేసే యుద్ధం కాదు. ఒక కుటుంబం మొత్తం పడే బాధ. వేదన. నువ్వు అన్ని బాధ్యతలు తీసుకోగలవని, ఇంకొన్ని కూడా తీసుకొని ఇంట్లో ఉండగలవని నాకు తెలుసు. అందుకే ఈ జర్నీని కొనసాగిస్తున్నాను. ఇన్ని రోజులుగా రెండు ఖండాల చుట్టూ తిరుగుతూ ఉన్నావు. థ్యాంక్స్ గోల్డీ... నాకు ధైర్యంగా నిలబడినందుకు. నాకు ప్రేమను పంచుతున్నందుకు. ప్రతి అడుగులో తోడుగా ఉన్నందుకు. థ్యాంక్యూ.. అనేది చాలా చిన్న పదం అవుతుందని నాకు తెలుసు. ఎప్పటికీ నీలో ఒక భాగాన్ని, నీదాన్ని. హ్యాపీ యానివర్శరీ గోల్డీ’’ అంటూ తమ పెళ్లి నాటి ఫొటోను కూడా షేర్ చేశారు సోనాలి. -
‘సెలబ్రేషన్స్ మిస్సవుతున్నా...అయినా పర్లేదు’
‘నా హృదయానికి ఎంతో దగ్గరైన పండుగ గణేశ్ చతుర్థి. ప్రతీ ఏడాదిలానే ఈరోజు కూడా మా ఇంట్లో గణనాథుని వేడుకలు జరిగాయి. అయితే ప్రస్తుతం నేను అక్కడ లేనుగా. అందుకే సెలబ్రేషన్స్ మిస్సవుతున్నా. అయినా ఫర్వాలేదు.. ఆ దేవుడి ఆశీస్సులు నాకు తోడుగా ఉంటాయి. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషాలతో మీ జీవితాలు నిండుగా ఉండాలంటూ’ సొనాలీ బింద్రే తన అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేశ్ చతుర్థి వేడుకులు జరుపుకొంటున్న తన కుటుంబ సభ్యుల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా హైగ్రేడ్ క్యాన్సర్ బారిన పడిన సొనాలీ ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. చికిత్సలో భాగంగా జుట్టు కత్తిరించుకున్న సమయంలో భావోద్వేగానికి గురైన సొనాలి.. తన కొడుకు రణ్వీర్, ఇతర కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నానని పేర్కొన్నారు. అయితే ఇటీవల సొనాలీ మరణించిందంటూ నకిలీ వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో ఆవేదన చెందిన ఆమె భర్త గోల్డీ బెల్.. ‘సొనాలీ ఎంతో ధైర్యంగా పోరాడుతున్నారని, ఆమె ఆరోగ్యం గురించి వదంతులు ప్రచారం చేయడం మానుకోవాలని’ విఙ్ఞప్తి చేశారు. View this post on Instagram #GaneshChaturthi has always been very very close to my heart. Missing the celebrations back home, but still feeling blessed. Have a happy one, filled with blessings, love and joy! A post shared by Sonali Bendre (@iamsonalibendre) on Sep 13, 2018 at 6:52am PDT -
వదంతులను నమ్మొద్దు
అభిమాన తార గురించి ఏ వార్త అయితే వినకూడదని అభిమానులు కోరుకుంటారే సోనాలి బింద్రే గురించి శనివారం అలాంటిదే విన్నారు. ‘సోనాలి ఇక లేరు’ అనే ఆ వార్త విని షాక్ అయ్యారు. ఈ ఏడాది జూలై 4న కేన్సర్ సోకిన విషయాన్ని ప్రకటించిన సోనాలి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆమె ఆరోగ్యం గురించి సోనాలి భర్త గోల్డీ బెహల్ ట్వీటర్ ద్వారా వెల్లడిస్తున్నారు. సోనాలి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, తన గురించి చెబుతున్నారు. ‘ఏం ఫర్వాలేదు. చికిత్స సజావుగా సాగుతోంది. సోనాలి సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వచ్చేస్తారు’ అని అందరూ నమ్మిన సమయంలో ఓ ఎమ్మెల్యే ‘ఆమె ఇక లేరు’ అని చేసిన ట్వీట్ కలవరపరచింది. అయితే గోల్డీ బెహల్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేయడంతో రిలీఫ్ అయ్యారు. ‘‘సోషల్ మీడియాని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని విన్నవించుకుంటున్నాను. వదంతులను నమ్మొద్దు. ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే సంబంధిత వ్యక్తులను బాధపెట్టినవారు అవుతారు’’ అని గోల్డీ బెహల్ ట్వీట్ చేశారు. కాగా, సోనాలి తాను చదువుతున్న పుస్తకాన్ని పట్టుకుని దిగిన ఫొటోను రీసెంట్గా ట్వీటర్లో షేర్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో అదే. సోనాలీకి బుక్స్ చదవడం అంటే ఆసక్తి. స్వయంగా ఆమె తన లైఫ్ జర్నీ గురించి ‘ది మోడ్రన్ గురుకుల్’ పేరుతో ఓ పుస్తకం రాశారు కూడా. ఇప్పుడు ఆమె రష్యన్ రచయిత అమోర్ తౌలీస్ రాసిన ‘ఎ జెంటిల్మెన్ ఇన్ మాస్కో’ బుక్ చదువుతున్నారు. ఈ నెల 6న ‘బుక్ రీడింగ్ డే’. స్వతహాగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న సోనాలి ఆ రోజున ఈ బుక్‌ని సెలెక్ట్ చేసుకుని, చదవడం మొదలుపెట్టారు. -
సోనాలి బింద్రే ఆరోగ్యంపై ‘గోల్డీ’ ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : న్యూయార్క్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహల్ ట్వీట్ చేశారు. క్యాన్సర్‌పై పోరాటం దీర్ఘకాలమైనా తాము సానుకూల దృక్పథంతో ప్రయాణం ప్రారంభించామన్నారు. తాను మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, దీనిపై ధైర్యంగా పోరాడతానని జులైలో సోనాలి వెల్లడించిన విషయం తెలిసిందే. ‘సోనాలి పట్ల మీరు చూపుతున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స నేపథ్యంలో ఎలాంటి సమస్యలూ తలెత్తడం లేదు.. సానుకూల దృక్పథంతో తాము ఈ ప్రయాణాన్ని ప్రారంభించా’మని గోల్డీ బెహల్ ట్వీట్ చేశారు. క్యాన్సర్ రూపంలో తనకు ఎదురైన ప్రాణాంతక వ్యాధిని అత్యంత ధైర్యంగా ఎదుర్కొంటున్న సోనాలీని బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసించిన విషయం తెలిసిందే. Thank you all for the love and support for Sonali... she is stable and is following her treatment without any complications. This is a long journey but we have begun positively.🙏 — goldie behl (@GOLDIEBEHL) 2 August 2018