Sonali Bendre Re-Entry In Tollywood After 18 Years With Jr NTR And Koratala Movie - Sakshi
Sakshi News home page

Sonali Bendre: టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న సోనాలీ బింద్రె!

Published Sun, Mar 13 2022 9:06 PM | Last Updated on Mon, Mar 14 2022 9:14 AM

Sonali Bendre Re Entry In Tollywood After 18 Years - Sakshi

మురారి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ సోనాలీ బింద్రే. తొలి సినిమానే సూపర్‌ హిట్‌ కావడంతో ఆ తర్వాత‘ఖడ్గం, మన్మధుడు, ఇంద్ర వంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది. తొంభైలలో వెండితెరపై అగ్రనటిగా రాణిస్తూ.. తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న ఆమె వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత టీవీ రంగంలోకి వెళ్లింది. కొన్నాళ్ల క్రితం ఆమె క్యాన్సర్‌ బారిన పడింది. అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స తీసుకొని కోలుకుంది.

దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌-కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో సోనాలీ బింద్రె కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. పాన్‌ ఇండియా సినిమా కావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్టుకు వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement