Sonali Bindre
-
'అదే వారి బలం.. అందుకే ప్రాణాంతకమైనా జయించారు'
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సినీరంగంలో రాణించడమంటే మాటలు కాదు. పైగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అంతా ఈజీ కాదు. ఎంత టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాకపోతే ఈ రంగంలో గుర్తింపు దక్కడం కష్టమే. అంతే కాకుండా కెరీర్ సాఫీగా సాగుతుందనుకునేలోపే ఊహించని సంఘటనలు మరింత వెనక్కి లాక్కెళ్తాయి. అవకాశాలు అందే సమయంలో అనుకోని పరిణామాలతో దాదాపు కెరీర్ ముగిసేంతా పరిస్థితి ఎదురవుతుంది. కానీ అలాంటి సమయంలోనే మనం పట్టుదలగా ఉండాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకూడదు. అలా ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్న హీరోయిన్ల పేర్లు ఇట్టే వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. జీవితంలో అత్యంత గడ్డుకాలాన్ని అధిగమించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్లు కొందరే ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా విజయం సాధించిన ఆ తారలపై ప్రత్యేక కథనం. మయోసైటిస్‌ను జయించిన సమంత సమంత సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ఆ తర్వాత కోలుకుని కెరీర్లో మళ్లీ బిజీ అయిపోయింది. మయోసైటిస్ బారిన పడిన సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను అనుభవించింది. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకినా.. ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్ నటించనుంది. గతంలో మయోసైటిస్ గురించి సామ్ మాట్లాడుతూ.. 'ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త దయతో మెలగండి’అని సామ్ చెప్పుకొచ్చింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోందంటూ ఎమోషనలైంది సామ్. అందువల్లే బయటపడ్డా: సుస్మితాసేన్ ఇటీవల మాజీ మిస్‌వరల్డ్, నటి సుస్మితాసేన్ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. ఇటీవలే ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు సుస్మితాసేన్. ఆమె మాట్లాడూతూ.. 'ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యా. ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి. నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది. మా నాన్న సుబీర్సేన్ నాకు చెప్పిన ఈ మాటలే నాకు స్ఫూర్తి' అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా సేన్. ఆత్మవిశ్వాసంతో గెలిచా: హంసా నందిని అత్తారింటికి దారేది, ఈగ, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి హంసానందిని. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. గతంలో హంసా మాట్లాడుతూ..' వైద్య పరీక్షల్లో నాకు వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్ ఉందని తేలింది. జన్యు పరివర్తన కారణంగా భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెప్పారు. అయినా కూడా నేను అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతోనే ఆ మహమ్మారిని గెలిచా.' అంటూ చెప్పుకొచ్చింది. క్యాన్సర్‌తో పోరాడిన సోనాలిబింద్రే ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన భామ సోనాలి బింద్రే. సోనాలిబింద్రే క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ కష్టం సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది. మనిషి తన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని.. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది. రెండుసార్లు జయించిన మమతా మోహన్‌దాస్ రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన పడి నటి మమత మోహన్ దాస్. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకుంది. ఇటీవలే మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది. ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి సోకిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. క్యాన్సర్ సమయంలో తాను పడిన కష్టాలను గతంలో ఆమె వివరించింది. క్యాన్సర్‌కు గురికావడంతో నా కలలన్నీ చెదిరిపోయాయని వెల్లడించింది. ఏడేళ్లు పోరాడి ఆ మహమ్మారిని జయించానని తెలిపింది. అమ్మానాన్నలు,స్నేహితుల ధైర్యంతోనే క్యాన్సర్‌పై గెలిచానని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో సీనియర్ హీరోయిన్లు మనీషా కొయిరాల, గౌతమి కూడా క్యాన్సర్‌ను జయించిన వారిలో ఉన్నారు. -
ఆ వార్తలను ఖండించిన సోనాలి బింద్రె, నాకావసరం లేదు..
‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది సోనాలి బింద్రె. 2013లో హిందీలో వచ్చిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబార చిత్రంలో అతిథిగా కనిపించిన ఆమె క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని ఆరోగ్యంతో తిరిగొచ్చిన సోనాలి బింద్రె ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: హైదరాబాద్ మెట్రో స్టేషన్లో బిగ్‌బి సందడి, ఫొటో వైరల్ ఇటీవల జూన్ 10న ఈ వెబ్ సిరీస్ జీ5లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సోనాలి బింద్రె ఇటీవల తనపై వస్తున్న పుకార్లను ఖండించింది. సోనాలి బింద్రె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అందుకే ఆమె మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆఫర్స్ కావాలంటూ దర్శక-నిర్మాతలకు ఆమె విజ్ఞప్తి చేసుకుంటుందంటూ బి-టౌన్లో గుసగుసలు వినిపంచాయి. చదవండి: మైక్ టైసన్ బర్త్‌డే, స్పెషల్ వీడియోతో విషెస్ తెలిపిన ‘లైగర్’ టీం తాజాగా సోనాలి బింద్రె ఈ వార్తలను కొట్టి పారెసింది. తను ఆర్థికంగానూ, అన్ని విధాలుగా బాగున్నానని, ఆఫర్స్ కావాలనొ అడుక్కోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. ‘నాకు డబ్బు సమస్య ఉందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అలాగే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే ఎన్టీఆర్ 30 సినిమాల్లో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో సైతం నిజం కాదని వెల్లడించింది. ప్రస్తుతం నేను ఎలాంటి సినిమాలకు సంతకం చేయలేదు. మంచి కథ, పాత్ర నచ్చితే తప్పకుండ చేస్తాను’ అని తెలిపింది. -
డబ్బు కోసం అలాంటివి చేయక తప్పలేదు: సోనాలి బింద్రె
‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది సోనాలి బింద్రె. 2013లో హిందీలో వచ్చిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబార చిత్రంలో అతిథిగా కనిపించిన ఆమె ఆ తర్వాత క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. ఇటీవలే ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్‌సిరీస్‌లో నటించగా ఇది జూన్ 10 నుంచి జీ5లో ప్రసారం కానుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ఒకానొక సమయంలో నాకు చాలా డబ్బులు అవసరమయ్యాయి. ఇంటి అద్దె కట్టాలి, బిల్లులు చెల్లించాలి. అప్పుడు నా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకే నాకు ఎలాంటి పాత్రలు వచ్చినా చేసుకుంటూ పోయాను. అలా ఓ సినిమా చేసి ఇంకో సినిమాకు రెడీ అయ్యే సమయానికి అసలు ఎందుకా ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను? అని ఆలోచించేదాన్ని. కానీ ఆ వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ డబ్బులు ఎప్పుడిస్తారో అని ఎదురుచూసేదాన్ని. అందుకే అతిగా ఆలోచించకుండా కొన్ని పాత్రలు చేసుకుంటూ పోయాను. ఆ సినిమాలు మీరే కాదు నేను కూడా చూడలేదు' అని చెప్పుకొచ్చింది సోనాలి బింద్రె. చదవండి: డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? జవాన్ మూవీ.. మాస్ లుక్‌లో షారుక్ ఖాన్, టీజర్ చూశారా -
ఆఫ్టర్ ఎ గ్యాప్.. రీఎంట్రీకి రెడీ అయిన హీరోయిన్స్
‘మేరా నామ్ చిన్ చిన్ చు..’ పాట సౌండ్ బాగుంది. మరి ఆట.. అదుర్స్. చేసిందెవరు? పంథొమ్మిదేళ్ల హెలెన్. ఆ పాట సోలో డాన్సర్‌గా ఆమెకు పెద్ద బ్రేక్. ఆ తర్వాత చేసిన పాటల్లో ‘పియా తూ అబ్ తో ఆజా’ (ప్రియుడా ఇప్పటికైనా రా అని అర్థం) ఒకటి. అలాంటి పాటలెన్నింటికో కాలు కదిపారు. ఎన్నో పాత్రలు చేశారు హెలెన్. పదేళ్ల క్రితం నటనకు బ్రేక్ ఇచ్చిన హెలెన్‌ని అప్పటి తరం అభిమానులు తలుచుకుంటూనే ఉన్నారు. వెండితెరకు ‘అబ్ తో ఆజా’ (‘ఇప్పటికైనా రా’) అంటున్నారు. హెలెన్ వచ్చేస్తున్నారు. ఇక హెలెన్ తర్వాతి తరాలకు చెందిన సోనాలీ బెంద్రే రాక కోసం కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ‘అబ్ తో ఆజా’ అంటున్నారు. ఆమె కూడా వచ్చేస్తున్నారు. వీరితో పాటు హిందీలో రీ ఎంట్రీకి రెడీ అయిన తారలు కూడా ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం. ‘మేరానామ్ చిన్ చిన్ చు’ సాంగ్‌లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన హెలెన్‌కి నాటి తరంలో ఎందరో అభిమానులు ఉన్నారు. 1958లో వచ్చిన ‘హౌరా బ్రిడ్జ్’ చిత్రంలో ‘మేరా నామ్ చిన్ చిన్ చు..’ అంటూ ఎంత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేశారో అంతే ఎనర్జీని 1971లో వచ్చిన ‘కారవాన్’లోని ‘పియా తు అబ్ తో ఆజా’, 1975లో వచ్చిన ‘షోలే’లోని ‘మెహబూబా మెహబూబా..’ పాటల్లోనూ చూపించారు హెలెన్. 70ఏళ్ల కెరీర్లో దాదాపు 700 చిత్రాల్లో నటించిన హెలెన్ దశాబ్దకాలంగా వెండితెరకు దూరమయ్యారు. ఇప్పడు ఆమె కెమెరా ముందుకు రానున్నారు. మధూర్ భండార్కర్ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘హీరోయిన్’ చిత్రం తర్వాత మరోమారు వెండితెరపై హెలెన్ కనిపించలేదు. తాజాగా ‘బ్రౌన్: ది ఫస్ట్ కేస్’లో హెలెన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. అభినవ్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ ఫిల్మ్‌లో కరిష్మా కపూర్, సూర్య శర్మ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. అభీక్ బారువా రాసిన ‘సిటీ ఆఫ్ డెత్’ బుక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘‘నేను యాక్ట్ చేసినప్పటి సమయంతో పోలిస్తే ఇప్పుడు చాలా విషయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కాస్త భయంగా, ఆందోళనగా అనిపిస్తున్నా ఓ చాలెంజ్‌గా తీసుకుని నటిస్తున్నాను’’ అని హెలెన్ పేర్కొనడం విశేషం.. మరోవైపు ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సోనాలీ బెంద్రేను అంత ఈజీగా మర్చిపోలేం. 2013లో హిందీలో వచ్చిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబార’ చిత్రంలో గెస్ట్‌గా కనిపించిన తర్వాత సోనాలీ నటిగా మేకప్ వేసుకోలేదు. ఆ మధ్య క్యాన్సర్ మహమ్మారితో పోరాడారామె. క్యాన్సర్‌పై గెలిచి మళ్లీ యాక్టర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్ సిరీస్‌లో ఓ యాంకర్‌గా నటించారామె. ఇందులో జైదీప్ అహ్లావత్, శ్రియా పిల్గొన్కర్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. సోనాలీకి ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్. జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ‘‘తిరిగి సెట్స్‌లోకి వచ్చి కో స్టార్స్, దర్శకులు, స్టోరీ డిస్కషన్స్‌తో బిజీ అవుతున్నందుకు హ్యాపీ’’ అని పేర్కొన్నారు సోనాలీ బెంద్రే. మరోవైపు 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇటీవలే నటిగా మేకప్ వేసుకున్నారు అనుష్కా శర్మ. మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామి బయోపిక్‌లో నటిస్తున్నారామె. ఈ చిత్రానికి ప్రోజిత్ రాయ్ దర్శకుడు. ఇలా బ్రేక్‌లో ఉన్న తారలు మళ్లీ నటించడం అభిమానులు ఆనందపడే విషయం. ఇంకా గ్యాప్ తీసుకున్న మరికొంతమంది తారలు మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. -
18ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న 'మురారి' హీరోయిన్
మురారి సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బింద్రే. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత‘ఖడ్గం, మన్మధుడు, ఇంద్ర వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తొంభైలలో వెండితెరపై అగ్రనటిగా రాణిస్తూ.. తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న ఆమె వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత టీవీ రంగంలోకి వెళ్లింది. కొన్నాళ్ల క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది. అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స తీసుకొని కోలుకుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో సోనాలీ బింద్రె కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్టుకు వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. -
అలా ప్రేమలో పడమంటున్న జాన్వి, అదే నా సంతోషమంటున్న మోనల్
మీ సంతోషాన్ని నాతో పంచుకోండి అంటున్నా బిగ్‌బాస్ బ్యూటీ మెనల్ గజ్జర్ ఆమెతో షూటింగ్ అంటే ఎప్పుడూ సరదానే: లావణ్య త్రిపాఠి కళ్లు మూసి ప్రేమలో పడమంటున్నా జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) -
నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న హీరోయిన్!
సోనాలి బింద్రే.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తొంభైలలో వెండితెరపై అగ్రనటిగా రాణిస్తూ.. తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న ఆమె వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యారు. అలా తెరపై కనుమరుగైన సోనాలి బింద్రే ఎక్కడ ఉంది, ఏం చేస్తునేది కొంతకాలం వరకు స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారని, అమెరికాలో చికిత్స పొందుతున్నట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అది విన్న అభిమానులు, సోనాలి బింద్రే త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇక చికిత్స అనంతరం ఆమె కొలుకుని పూర్తి ఆరోగ్యంతో భారత్‌కు తిరిగి వచ్చారు. సినిమాల్లో తన అందం, అభినయంతో అందరిని కట్టేపడేసిన ఆమెను గుండుతో చూసి అంతా షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా సోనాలి బింద్రే అమెరికా హాస్పిటల్లో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న నాటి ఫొటోను షేర్ చేస్తూ గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గుండుతో బెడ్‌పై పేషేంట్‌గా ఉన్నా ఫొటోను ఆమె పంచుకున్నారు. ‘కాలం ఎంత తొందరగా పరుగులు తీస్తోంది. గత రోజులను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సమయంలో నేను ఎంత వీక్‌గా ఉన్నానో తలచుకుంటూనే ఆశ్చర్యంగా ఉంది. సి పదం(క్యాన్సర్) తర్వాత నా జీవితం ఎలా ఉందనే విషయాన్ని నిర్వచించలేనిది. అది నిజంగా నా జీవితంలో భయానక చేదు జ్ఞాపకం. అందుకే ఎవరి జీవితాన్ని వారే ఎంపిక చేసుకోవాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీ లైఫ్ జర్నీ అలా కొనసాగుతుంది’ అంటు ఆమె రాసుకొచ్చారు. కాగా సోనాలి బింద్రే తెలుగులో మహేశ్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో కలిసి ఆమె పని చేశారు. View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) చదవండి: సినీ కార్మికులందరికి ఉచితంగా వ్యాక్సిన్ : చిరంజీవి కరోనాతో నెల రోజులు ఆస్పత్రిలోనే, హోప్స్ మొత్తం పోయాయి: నటి -
సోషల్ హల్చల్: ఫ్రీ అంటున్న మౌనీ, పంచండంటోన్న కృతీ
♦ కారు ముందు ఫొటోకు పోజిచ్చిన హిందీ నటి మధుమిత సర్కార్ ♦ నా టీ షర్ట్ మీకో మాట చెప్తోందంటున్న శ్రద్ధా దాస్ ♦ ఏంటి? అలా చూస్తున్నారంటూ ఓ లుక్కిస్తోన్న షాలిని పాండే ♦ నన్నస్సలు డామినేట్ చేయలేరంటున్న మంచు లక్ష్మీ ప్రసన్న ♦ కరోనాను కాదు, సంతోషాన్ని పంచండంటోన్న కృతీ శెట్టి ♦ బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతి పోగొడుతున్న కృతి కర్బందా ♦ పొట్టి గౌనులో మరిన్ని ఫొటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్ ♦ మాస్కుకు ముందు, తర్వాత అంటూ ఫొటోలు పంచుకున్న సొనాలీ బింద్రె ♦ బీ ఫ్రీ అంటూ వీడియో షేర్ చేసిన మౌనీ రాయ్ View this post on Instagram A post shared by Madhumita Sarcar (@madhumita_sarcar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shalini (@shalzp) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) -
మహేష్ కెరియర్లోనే తొలి సిల్వర్ జూబ్లీ సినిమా
హీరో మహేష్‌బాబు కెరియర్లోనే తొలి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం 'మురారి'. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది. దీంతో సోషల్ మీడియాలో #20YearsForMurari హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాతోనే నటి సోనాలి బింద్రే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథాంశం, కుటుంబ భావోద్వేగాలు, మణిశర్మ సంగీతం..ఇలా ఈ చిత్రంలోని ప్రతీ అంశం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దాని ఫలితమే బాక్స్‌ఫీస్ వద్ద వసూళ్ల సునామీ కురిపించింది. మురారి విడుదలై 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రస్టింగ్ విశేషాలు.. కృస్ణవంశీ ఈ సినిమాను ఎంతో వైవిధ్యంగా తెరకెక్కించాడు. నిజానికి మురారి కథ నిజజీవిత సంఘనల ఆధారంగా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ పేరున్న జమీందార్ బ్రిటిష్ వారి కోసం తమ ఇలవేల్పు అయిన అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దొంగిలిస్తాడు. దీంతో అమ్మవారి ఆగ్రహానికి గురై అతడు చనిపోతాడు. అంతేగాక తన వంశానికి ఒక శాపాన్ని పొందుతాడు. అప్పటి నుంచి ప్రతీ 48 ఏళ్ళకొకసారి వచ్చే ఆశ్వయిజ బహుళ అమావాస్య నాడు ఆ జమీందార్ ఇంటిలోని వారసుల్లో ఒకరు మరణిస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో కూడా మరణిస్తారని భావించిన నేపథ్యంలో ఆయన చనిపోతాడా లేదా? ఆ శాపం నుంచి ఎలాంటి విముక్తి పొందుతారు అన్న అంశాలకు ఆధ్యాత్మికత జోడించి ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను రక్తికట్టించడంలో కృష్ణవంశీ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ముందే మహేష్ 3 సినిమాల్లో నటించినా మురారీ మాత్రం ఆయన కెరియర్లోనే తొలి సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది. కేవలం 5కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు 23 కేంద్రాల్లో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. మహేశ్ బాబు కెరీర్ లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచిన మురారి సినిమా తన ఆల్ టైం ఫెవరెట్ సినిమా అని మహేష్ భార్య నమ్రత అన్నారు. మురారి ఎప్పటికీ మర్చిపోలేని చిత్రమన్నారు. ఇక మురారి సినిమా పరంగానే కాకుండా, మ్యూజికల్‌గానూ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు ఎవర్గ్రీన్. ముఖ్యంగా 'అలనాటి రాముచంద్రుడి' ....అనే పాట ఇప్పటికీ ప్రతి తెలుగింటి పెళ్లి వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
క్షేమం కోరి...
బాలీవుడ్లో అంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ సందడంతా ‘కర్వా చౌత్’ కోసమే. భర్త శ్రేయస్సు కోసం రోజంతా ఉపవాసం ఉండి, భర్తతో కలిసి చంద్రుణ్ణి చూశాక భార్య ఉపవాసాన్ని విరమించే పండగ ఇది. ప్రతి ఏడాదీ ఈ పండగను ఘనంగా జరుపుకునేవారిలో శిల్పా శెట్టి ముందుంటారు. ఈసారి కూడా మిస్ కాలేదు. కష్టకాలంలో (కేన్సర్ బారిన పడటం, చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతురాలవడం) తోడున్న భర్త కోసం సోనాలీ బింద్రే ఉపవాసం ఆచరించారు. విదేశీ గాయకుడు నిక్ జోనస్‌ని పెళ్లాడిన ప్రియాంకా చోప్రా ‘లవ్ యు నిక్’ అంటూ లాస్ ఏంజిల్స్‌లో పండగ చేసుకున్నారు. కాజోల్, రవీనా టాండన్, బిపాసా బసు తదితరులు కూడా శ్రద్ధగా పూజలు చేశారు. కొత్త దంపతులు కాజల్ అగర్వాల్–గౌతమ్, వీరికన్నా ముందు ఆగస్ట్ 8న పెళ్లి చేసుకున్న రానా–మిహికా కూడా సంప్రదాయాన్ని పాటించారు. డిజైనర్ శారీ, చక్కని నగలతో తమ భర్తతో కలిసి దిగిన ఫొటోలను అందాల భామలు షేర్ చేశారు. రానా, మిహీకా; ∙నక్తో ప్రియాంకా చోప్రా; రవీనా టాండన్; భర్తతో సోనాలీ బింద్రే; భర్తతో బిపాసా -
లాక్డౌన్ నాకు కొత్త కాదు!
‘‘లాక్డౌన్ తరహా పరిస్థితులు నాకు కొత్తవేం కాదు’’ అంటున్నారు సోనాలీ బింద్రే. క్యాన్సర్‌తో పోరాడి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నారామె. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల గురించి సోనాలీ మాట్లాడుతూ – ‘‘క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నాలో రోగ నిరోధక శక్తి కూడా పెరిగింది. ఇందుకోసం నేను ఆరోగ్యకరమైన ఫలాలు, కూరగాయలను తింటున్నాను. క్యాన్సర్‌కు చికిత్స తీసుకునే ప్రక్రియలో భాగంగా రెండేళ్ల క్రితం నేను క్వారంటైన్ తరహా పరిస్థితులనే ఎదుర్కొన్నాను. ఇప్పుడు కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా క్వారంటైన్లో ఉంటున్నాం. అందుకే ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితులకు, అప్పటి నా క్వారంటైన్‌కి నాకు పెద్ద తేడా కనిపించడం లేదు. కానీ ఆ సమయంలో నా యోగ క్షేమాల గురించి తెలుసుకోవడానికి నా స్నేహితులు, బంధువులు మా ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ‘మీరు బాగున్నారా’ అని ఫోన్ పలకరింపులే తప్ప వ్యక్తిగతంగా కలుసుకుని మంచీ చెడులు మాట్లాడుకునే పరిస్థితి ఎవరికీ లేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’
క్రికెట్-సినిమా ఈ రెండు రంగాల మధ్య రిలేషన్షిప్, మంచి బాండింగ్ ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక మంది టీమిండియా క్రికెటర్లు సినిమా హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించారు. కొన్ని ప్రేమ జంటలు పెళ్లి పీటలు ఎక్కగా మరికొన్ని జంటలు ప్రేమికులుగానే విడిపోయారు. పటౌడీ, అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ వంటి క్రికెటర్లు కూడా హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించినట్టు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇక విరాట్ కోహ్లి, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లు బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా బాలీవుడ్ నటి నటాశాతో నిఖా ఫిక్స్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ ఓ హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తనకు కూడా సెలబ్రెటీ క్రష్ ఉందని టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా తాజాగా తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైనా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రేపై తనకున్న ప్రేమని వివరించాడు రైనా. కాలేజీ రోజుల నుంచి సోనాలితో డేటింగ్‌కు వెళ్లాలనే ఆశ ఉండేదని తెలిపాడు. అయితే తన కోరిక నెరవేరలేదన్నాడు. కానీ.. ఓ రోజు సోనాలి నుంచి స్పెషల్ మెసేజ్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. అమె ఎప్పటికీ తనతో పాటు ఎంతో మందికి కలల రాకుమారేనని అన్నాడు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచిన సమయంలో ఆమె యువ తరానికి ఓ రోల్ మాడల్‌గా నిలిచారని రైనా పేర్కొన్నాడు. ఇక గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న రైనా రానున్న ఐపీఎల్లో రాణించి టీమిండియాలో చోటు దక్కించుకోవాలిన ఉవ్విళ్లూరుతున్నాడు. చదవండి: పాక్ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు! మాకు కోహ్లి కావాలి: బంగ్లాదేశ్ ‘జడేజానే నా ఫేవరెట్ ప్లేయర్’ -
కునుకు లేదు.. కన్నీళ్లే
సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలిసి ఆమె అభిమానులంతా షాక్ అయ్యారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సోనాలీ న్యూయార్క్‌లో ట్రీట్మెంట్ తీసుకుని క్షేమంగా ఇండియా తిరిగొచ్చారు. అభిమానులే అల్లల్లాడిపోతే క్యాన్సర్ ఉందన్న వార్తను విన్నప్పుడు సోనాలి బింద్రే ఎలా తీసుకున్నారు? ఎలా తట్టుకున్నారు? ఈ ప్రశ్నకు ఓ షోలో సోనాలీ సమాధానమిస్తూ – ‘‘ముందుకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఓ మైగాడ్ అనుకున్నాను. వేగంగా వెళ్లే ట్రైన్ వచ్చి బలంగా తాకినట్టు ఆ వార్త నన్ను కుదిపేసింది. ఆ రాత్రంతా నిద్రపోలేదు, ఏడుస్తూనే ఉన్నాను. బాగా ఏడ్చాను. ఎందుకంటే.. నాకే ఎందుకిలా జరుగుతుంది? అంటూ బాధపడే ఆఖరి రోజు ఇదే కావాలని బలంగా కోరుకుంటూ ఏడ్చాను. ఇకమీదట అంతా సంతోషమే, నవ్వులే ఉండాలని అనుకున్నాను. మనకు నచ్చనివి జరిగినప్పుడు నమ్మడానికి ఇష్టపడం. ఆ రాత్రి నాకు క్యాన్సర్ అనే విషయాన్ని అంగీకరించగలిగాను. క్యాన్సర్‌ను యాక్సెప్ట్ చేశాను. ఆ సమయంలో నా భర్త గోల్డీ బెహల్, సుస్సానే ఖాన్, గాయత్రీ నాతోనే నిలబడ్డారు. గోల్డీ, నేను 16 ఏళ్లుగా కలసి ఉంటున్నాం. క్యాన్సర్ గురించి తెలిశాక గోల్డీ నా జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను అలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటిరోజు ఉదయాన్నే సూర్యుడు రావడాన్ని ఫోటో తీశాను. ‘స్విచ్చాన్ ది సన్‌షైన్’ అంటూ నా ఫ్రెండ్స్‌కు ఆ ఫోటోలు పంపించాను’’ అని పేర్కొన్నారు సోనాలి. -
బతికే అవకాశం తక్కువన్నారు
క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు నటి సోనాలీ బింద్రే. తన పోరాట ప్రయాణం గురించి ఆమె పలు సందర్భాల్లో పలు విషయాలను వెల్లడించారు. తాజాగా ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సోనాలి. వాటిలోని సారాంశం ఈ విధంగా... ‘‘మన అనుభవాలు మనల్ని ఎలా మార్చాయని వివరించడానికి ప్రత్యేకమైన విధానం ఏదీ లేదు. మనలో వచ్చిన ప్రతి పరివర్తనకు దృశ్యరూపం ఉండకపోవచ్చు. క్యాన్సర్ చికిత్స కోసం గోల్డీ బెహల్ (సోనాలీ భర్త) నన్ను న్యూయార్క్ తీసుకుని వెళ్లారు. అక్కిడికి వెళ్లిన తర్వాతి రోజే డాక్టర్లను సంప్రదించాం. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ చేయించుకున్నాక తెలిసింది.. నాకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్‌లో ఉందని. పైగా నా పొత్తి కడుపు అంతా క్యాన్సర్ వ్యాప్తి చెందిందని, నేను బతికే అవకాశం ముప్పైశాతమే ఉందని డాక్టర్లు చెప్పారు. ఒక్కసారిగా మనసు బద్ధలైంది. కలత చెందాం. కానీ అధైర్య పడలేదు. చికిత్సలో భాగంగా చాలా కాలం కష్టపడాల్సి వస్తుందనుకున్నాను. అయితే నేను చనిపోబోతున్నాననే ఆలోచన నాకు రాలేదు’’ అంటూ తాను కోలుకోవడానికి కారణం భర్త, స్నేహితులు, సన్నిహితులు అని పేర్కొన్నారు సోనాలీ బింద్రే. -
‘క్యాన్సర్ అని తెలియగానే సైకియాట్రిస్ట్‌ను కలిశాను’
బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రె క్యాన్సర్ బాధితురాలనే సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు సోనాలి. వైద్యంతో పాటు చికిత్స సమయంలో ఆమె చూపిన ధైర్యం కూడా వ్యాధి నుంచి త్వరగా కొలుకోవడానికి దోహదం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. తనకు క్యాన్సర్ సోకిందని తెలియగానే ముందుగా సైకియాట్రిస్ట్‌ను కలిశానన్నారు సోనాలీ. ఇండియా టుడే కాన్క్లేవ్ కార్యక్రమానికి హాజరయిన సోనాలీ ఈ విషయం గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు క్యాన్సర్ అని తెలిసినప్పుడు అందరూ నీ జీవిన విధానం చాలా బాగుంటుంది కదా ఇది ఎలా సాధ్యమయ్యిందంటూ ప్రశ్నించారు. కానీ నా మనసులో మాత్రం క్యాన్సర్ రావడానికి నేనే కారణం అనే ఫీలింగ్ ఉండేది. అందుకే చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లినప్పుడు ముందుగా ఓ సైకియాట్రిస్ట్‌ను కలిశాను. అతనితో ‘నాకు ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు. నేను చాలా సానుకూల దృక్పథంతో ఉంటాను. అలాంటిది నాకు క్యాన్సర్ రావడం ఏంటి. ఒక వేళ నా సబ్‌కాన్షియస్‌లో నేను నెగిటీవ్‌గా ఆలోచిస్తున్నానా.. లేక నేను భ్రాంతిలో ఉన్నానా. అసలు నాలో ఏం జరుగతుందో నాకు తెలియాలి’ అంటూ ఆ సైక్రియాట్రిస్ట్‌ను ప్రశ్నించాను’ అని తెలిపారు సోనాలీ. అప్పుడు ఆ సైకియాట్రిస్ట్ చెప్పిన సమాధానం తనకు జీవితం మీద కొత్త ఆశలు కల్పించిందన్నారు సోనాలీ. అతను ‘క్యాన్సర్ అనేది వైరస్ వల్ల, జెనటిక్ కారణాల వల్ల వస్తుంది. ఒక వేళ ఆలోచలే క్యాన్సర్ కల్గిస్తాయి, నయం చేయగల్గుతాయనుకుంటే.. ఈ ప్రపంచంలో నాకంటే ధనవంతుడు ఎవరూ ఉండరు. ఎందుకంటే ప్రతిరోజు నేను మనుషుల ఆలోచనలతో డీల్ చేస్తుంటాను అని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న తర్వాత నన్ను నేను నిందించుకోవడం మానేశాను. ధైర్యంగా క్యాన్సర్‌తో పొరాడాను’ అంటూ చెప్పుకొచ్చారు. క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్ వెళ్లిన సోనాలీ గత ఏడాది డిసెంబర్లో ఇండియాకు తిరిగి వచ్చారు. -
అవసవరమే!
‘నచ్చి చేసే తప్పుల్లో అందంగా కనిపించాలనే ఆలోచన’ నాకు నచ్చినది అని దర్శకుడు ఆల్ ప్యాచినో ఎప్పుడో అన్నాడు. ఆయన చెప్పిన ఈ మంత్రాన్ని పాటిస్తున్నారు సోనాలీ బింద్రే. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ వ్యాధికి లండన్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా జుత్తు కత్తిరించుకుని, గుండు చేయించుకున్నా ఇబ్బంది పడకుండా ఫొటోలకు ఫోజులిచ్చారామె. లేటెస్ట్గా అందంగా కనిపించడం కోసం విగ్ (సవరం) ధరిస్తున్నారట. ఆ విషయాన్ని సోనాలి తెలియజేస్తూ ఓ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఆల్ ప్యాచినో చెప్పినమంత్రంతో ఇప్పుడు ఏకీభవిస్తున్నాను. కానీ, అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు? మనం ఎలా కనిపిస్తున్నామో అన్న విషయం మనపై సైకలాజికల్ ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది. కొంచెం అందంగా కనిపించాలనుకోవడం ఎవరికీ పెద్ద హాని కాదు. మనకి ఆనందాన్ని ఇచ్చేదేంటో తెలుసుకోవాలి. విగ్ వాడదాం అనుకున్నప్పుడు నాకో చిరు సందేహం వచ్చింది. ఆకర్షణీయంగా కనిపించడానికి నేను ఎందుకింత ఆరాటపడుతున్నానని. బహుశా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండటం వల్లనేమో? ఒక్క క్షణం ఆలోచించి, నాకు బావుంటుంది అనుకొని విగ్ ధరించదలిచాను. మనకేది సూట్ అవుతుందో.. ఏది నచ్చుతుందో అన్నదే ముఖ్యం. ఈ కొత్త హెయిర్ డ్రెస్సర్‌ని పరిచయం చేసినందుకు థ్యాంక్యూ ప్రియాంకా చోప్రా’’ అని పేర్కొన్నారు. -
‘తనే నా హీరో’
సోనాలీ బింద్రే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఒక షో షూటంగ్ నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సోనాలీని కలిశారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘నేను సోనాలీతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించాను. బయట కూడా చాలాసార్లు తనని కలిశాను. తనేప్పుడు నవ్వుతూ.. ప్రశాంతంగా ఉండేది. కానీ నేను ఇన్ని రోజుల చూసిన సోనాలీకి.. ఓ 15 రోజులుగా చూస్తోన్న సోనాలీకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను ‘తనే నా హీరో’ అని’ అంటూ ట్వీట్ చేశారు. I have done few films with @iamsonalibendre. We’ve met socially many times in Mumbai. She always has been bright & a very warm person. But it is only in the last 15days that I got the opportunity to spend some quality time with her in NY. And I can easily say,”She is my HERO.”😍 pic.twitter.com/z6iBe2s7fy — Anupam Kher (@AnupamPKher) August 12, 2018 ట్వీట్‌తో పాటు చికిత్సకు ముందు సోనాలీ జుట్టు కత్తిరించుకుని ఉన్నప్పుడు తీసిన ఫోటోను కూడా అనుపమ్ ఖేర్ షేర్ చేశారు. గతంలో వీరిద్దరు కలిసి ‘హమరా దిల్ ఆప్నే పాస్ హై’, ‘దిల్ హై దిల్ మైనే’,‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కే’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ వైద్య నేపధ్యంలో సాగే డ్రామా ‘న్యూ ఆమస్టర్డ్యామ్’ చిత్రకరణ నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్నారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్, బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
స్క్రీన్ టెస్ట్
1. మహేశ్‌బాబు ఏ సంవత్సరంలో పుట్టారో కనుక్కోండి? ఎ) 1974 బి)1976 సి)1975 డి)1979 2. మహేశ్‌బాబును ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా పరిచయం చేసిన నిర్మాత ఎవరు? ఎ) యం.యస్. రాజు బి) సి. అశ్వనీదత్ సి) మంజుల డి) అల్లు అరవింద్ 3. ‘నానీ’ చిత్రంలో మహేశ్‌బాబు సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) అమీషా పటేల్ బి) సోనాలీ బింద్రే సి) బిపాసా బసు డి) ప్రీతీ జింటా 4. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..’ అని మహేశ్ చెప్పిన డైలాగ్ ఏ సినిమాలోనిది? ఎ) అతడు బి) ఖలేజా సి) పోకిరి డి) సైనికుడు 5. మహేశ్‌బాబు తనని తాను మొదటిసారి స్క్రీన్ మీద చూసుకున్న చిత్రం ‘నీడ’. ఏ దర్శకుడు మహేశ్‌ను అరంగేట్రం చేశారో తెలుసా? ఎ) దాసరి నారాయణరావు బి) కె. మురళీ మోహన్‌రావు సి) కోడి రామకృష్ణ డి) కృష్ణ 6. రాక్‌స్టార్ పాత్రలో మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఆ చిత్రానికి కెమెరామెన్ ఎవరో తెలుసా? ఎ) కేకే సెంథిల్ కుమార్ బి) మధి సి) ఛోటా.కె. నాయుడు డి) రత్నవేలు 7. మహేశ్‌బాబు నటి నమ్రతను ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పెళ్లి చేసుకున్నారో తెలుసా? ఎ) వంశీ బి) ఒక్కడు సి) మురారీ డి) అతడు 8. మహేశ్‌బాబు ‘పోరాటం’, ‘గూఢచారి 117’ సినిమాల్లో బాలనటుడిగా నటించారు. ఈ రెండు చిత్రాలకు దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) ఎ. కోదండ రామిరెడ్డి సి) కేయస్ఆర్ దాస్ డి) కె.బాపయ్య 9. ఈ దర్శకుడు మహేశ్‌బాబుకు క్లోజ్ ఫ్రెండ్. మహేశ్‌బాబు ఫ్యామిలీతో విదేశాలకు విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఈ దర్శకునికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎవరా దర్శకుడు తెలుసా? ఎ) పూరి జగన్నాథ్ బి) మెహర్ రమేశ్ సి) శివ కొరటాల డి) త్రివిక్రమ్ 10. ‘శ్రీమంతుడు’ సినిమాలో చేసిన పాత్ర ఇన్సిపిరేషన్‌తో మహేశ్‌బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం తెలంగాణా ప్రాతంలోని ఏ జిల్లాలో ఉందో తెలుసా? ఎ) మహబూబ్ నగర్ బి) అదిలాబాద్ సి) వరంగల్ డి) రంగారెడ్డి 11. మహేశ్‌బాబు ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ అందించారో కనుక్కోండి? ఎ) 2 బి) 1 సి) 6 డి) 4 12. మహేశ్‌బాబు తన కెరీర్లో ఒకే ఒక్క దర్శకునితో మూడు సినిమాల్లో నటించారు. ఆ దర్శకుడెవరు? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) పూరి జగన్నాథ్ సి) శ్రీను వైట్ల డి) గుణశేఖర్ 13. మహేశ్ నటించిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’.. ఈ రెండు సినిమాల్లోని పాటలన్నీ రాసిన రచయిత ఎవరో తెలుసా? ఎ) శ్రీమణి బి) రామజోగయ్య శాస్త్రి సి) సిరివెన్నెల డి) చంద్రబోస్ 14. ‘పోకిరి’ సినిమాలోని ‘గల గల పారుతున్న గోదారిలా...’ పాటను పాడిన సింగర్ పేరేంటి? ఎ) హేమచంద్ర బి) నిహాల్ సి) సింహా డి) కార్తీక్ 15. బెస్ట్ డెబ్యూ హీరో, బెస్ట్ హీరో, స్పెషల్ జ్యూరీ అన్ని కేటగిరీలకు కలిపి మహేశ్‌బాబు మొత్తం ఎన్ని నందులను అందుకున్నారో తెలుసా? ఎ) 4 బి) 8 సి) 6 డి) 9 16. మహేశ్‌బాబుని ట్వీటర్లో దాదాపు 68లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆయన ట్వీటర్ హ్యాండిల్ ఏంటో తెలుసా? ఎ) మీ మహేశ్ బి) యువర్స్ మహేశ్ సి) మహేశ్ డి) యువర్స్ ట్రూలీ మహేశ్ 17. మహేశ్ కెరీర్లో ఇద్దరు హీరోయిన్లతో మాత్రమే రెండుసార్లు నటించారు. ఆ ఇద్దరిలో ఓ హీరోయిన్ త్రిష. మరి రెండో హీరోయిన్ ఎవరు? ఎ) నమ్రతా శిరోద్కర్ బి) భూమిక సి) తమన్నా డి) సమంతా 18. మహేశ్‌బాబు స్కూలింగ్ చెన్నైలో జరిగింది. అదే స్కూల్లో చదువుకున్న తన జూనియర్ తమిళ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఆ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) సూర్య బి) విజయ్ సి) ధనుష్ డి) కార్తీ 19. ప్రస్తుతం మహేశ్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’లో కీలక పాత్ర చేస్తున్న కామెడీ హీరో ఎవరు? ఎ) ‘అల్లరి’ నరేశ్ బి) రాజేంద్రప్రసాద్ సి) సునీల్ డి) సప్తగిరి 20 మహేశ్‌బాబు బాలనటుడిగా నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) నీడ బి) కొడుకు దిద్దిన కాపురం సి) బాలచంద్రుడు డి) పోరాటం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) ఎ 4) సి 5) ఎ 6) డి 7) డి 8) ఎ 9) బి 10) ఎ 11) డి 12) డి 13) బి14) బి 15) బి 16) డి 17) డి 18) డి 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
నిలకడగా...
ఇటీవలే క్యాన్సర్‌కి గురై లండన్‌లో చికిత్స పొందుతున్నారు సోనాలీ బింద్రే. ఆమె క్షేమసమాచారాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఈ క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్నానని సోనాలీ పేర్కొ న్నారు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని సోనాలీ భర్త గోల్డీ బెహల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. భార్య హెల్త్ అప్డేట్ను బెహల్ షేర్ చేస్తూ – ‘‘సోనాలీ మీద అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. తన ఆరోగ్యం నిలకడగా ఉంది. ట్రీట్మెంట్కు బాగా రెస్పాండ్ అవుతోంది. క్యాన్సర్‌కి ఎదురుగా పోరాడటం పెద్ద జర్నీ. మేం పాజిటివ్‌గా స్టార్ట్ చేశాం’’ అన్నారు. -
సోనాలి బింద్రే ఆరోగ్యంపై ‘గోల్డీ’ ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : న్యూయార్క్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహల్ ట్వీట్ చేశారు. క్యాన్సర్‌పై పోరాటం దీర్ఘకాలమైనా తాము సానుకూల దృక్పథంతో ప్రయాణం ప్రారంభించామన్నారు. తాను మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, దీనిపై ధైర్యంగా పోరాడతానని జులైలో సోనాలి వెల్లడించిన విషయం తెలిసిందే. ‘సోనాలి పట్ల మీరు చూపుతున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స నేపథ్యంలో ఎలాంటి సమస్యలూ తలెత్తడం లేదు.. సానుకూల దృక్పథంతో తాము ఈ ప్రయాణాన్ని ప్రారంభించా’మని గోల్డీ బెహల్ ట్వీట్ చేశారు. క్యాన్సర్ రూపంలో తనకు ఎదురైన ప్రాణాంతక వ్యాధిని అత్యంత ధైర్యంగా ఎదుర్కొంటున్న సోనాలీని బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసించిన విషయం తెలిసిందే. Thank you all for the love and support for Sonali... she is stable and is following her treatment without any complications. This is a long journey but we have begun positively.🙏 — goldie behl (@GOLDIEBEHL) 2 August 2018 -
కేన్సర్..డోంట్ కేర్
-
క్యాన్సరే విలన్
విలన్ ఎంత పెద్దవాడైతే వాడి తాట తీసిన హీరోఅంత గొప్పవాడు అవుతాడు. సినిమా కథలు రాసుకునేవాళ్లుసినిమాలు తీసినవాళ్లు.. నమ్మిన విషయం ఇది.సినిమాలోనే కాదు, జీవితంలో కూడావిలన్ని తుదముట్టించినవాళ్లు..విలన్‌తో పోరాడినవాళ్లు. పోరాడుతూ ప్రాణ త్యాగం చేసినవారు.. అసలైన సినిమా హీరోలు! ‘‘కొన్నిసార్లు మనం ఊహించని పరిణామాలను జీవితం మనకు ప్రసాదిస్తుంది. బాగా నొప్పి కారణంగా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటే.. అది సర్వశక్తులతో పోరాడాల్సిన వ్యాధిని నాకు పరిచయం చేసింది.’’.. నిన్నటి తరం బాలీవుడ్ అందాల నటి సోనాలీ బింద్రె తనకు కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయిన తర్వాత చేసిన ట్వీట్ సారాంశం ఇది. తనకు హై గ్రేడ్ క్యాన్సర్ ఉన్నట్టు తేలిందని, దీనిని తాను కనీసం ఊహించను కూడా లేదని, అయినప్పటికీ నా కుటుంబం, స్నేహితులే దన్నుగా ఆశావాహ దృక్పథంతో తాను యుద్ధానికి సిద్ధమయ్యానని ఆమె ప్రశంసనీయమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సోనాలీ.. తనను మింగేయడానికి వచ్చిన రాకాసితో పోరాడి గెలిచేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. ఒకప్పుడు గొప్పగొప్పవాళ్లకే వస్తుందనుకుని క్యాన్సర్‌ను ‘రాచపుండు’ అనేవారు. ఇప్పుడు అందరికీ చుట్టమైపోయిన క్యాన్సర్.. తొలి నుంచీ తెరవేల్పులను గట్టిగానే పీడిస్తోంది. అందాల తారల్ని, గ్లామర్ రంగాన్ని చూసి తనకూ అసూయ పుట్టిందేమో అన్నట్టుగా శరీరంలోని కళాకాంతుల్ని పూర్తిగా నాశనం చేసేద్దామన్నంత కాంక్షగా వారిని ఆక్రమించుకుంటోంది. ఇటీవలి కాలంలో పలువురు సినీ తారలు ఈ వ్యాధి బారిన పడిన ఉదంతాలు, దానిని దీటుగా ఎదుర్కొని జయించిన విజయగా«థలు మనం వింటూ వచ్చాం. నర్గీస్‌దత్: క్యాన్సర్ కాటుకు గురైన అత్యంత ప్రముఖుల్లో చాలా మందికి తెలిసిన పేరు నర్గీస్. ఈ అందాల నటి, మాజీ ఎంపీ సునీల్‌దత్ భార్య. అప్పట్లో.. అంటే 1950ల కాలంలో స్టార్‌గా వెలిగిన నర్గీస్ దత్ పాంక్రియాట్రిక్ క్యాన్సర్ వ్యాధికి గురై న్యూయార్క్‌లో చికిత్స అనంతరం ఇండియాకి తిరిగివచ్చినా.. మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. కోమాలోకి వెళ్లి, ఒక్కరోజులోనే మృతి చెందారు. తెరమీద తన కొడుకు సంజయ్‌దత్‌ని హీరోగా చూడాలన్న కోరిక తీరకుండానే, సంజయ్ తొలి సినిమా విడుదలకు వారం రోజుల ముందే ఆమెను క్యాన్సర్ నిర్ధాక్షిణ్యంగా కబళించేసింది. రాజేశ్‌ఖన్నా: ఇదే వ్యాధికి గురై జీవితాన్ని కోల్పోయిన మరో అగ్రతార రాజేశ్‌ఖన్నా. ఒకనాటి ఈ అమ్మాయిల కలల రాకుమారుడు కూడా క్యాన్సర్ ఆకలికి ఆహారం కాక తప్పలేదు. సినీ, రాజకీయ రంగాల్లో రాణించిన రాజేశ్‌ఖన్నా 2011లో ఈ వ్యాధి బారిన పడి ఏడాది కూడా తిరగకుండానే, తనకు 60 ఏళ్ల వయసులోనే మరణించాడు. ఒకానొక టైమ్‌లో అమితాబ్ వంటి టాప్ స్టార్స్ సరసన చోటు సంపాదించుకున్న వినోద్‌ఖన్నా కూడా అడ్వాన్స్డ్ బ్లాడర్ క్యాన్సర్ బాధితుడిగా మారి.. 70 ఏళ్ల వయసులో దానితో పోరాడలేక మననుంచి దూరమైపోయాడు. ముంతాజ్ : అయితే అలనాటి తారల్లో కూడా క్యాన్సర్‌పై మొక్కవోని దీక్షతో పోరాడుతున్నవారు ఇంకా ఉన్నారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సింది అందాల నటి ముంతాజ్ పేరు. 54 ఏళ్ల వయసులో 2002లో బ్రెస్ట్ క్యాన్సర్‌కి గురైన ముంతాజ్... అరడజను కీమోథెరపీలు, 35 రేడియేషన్ల తర్వాత కూడా ఇంకా దానితో పోరాడుతూనే ఉన్నారు. ‘‘నేనంత తేలికగా దేనినీ వదలను. ఆఖరికి ప్రాణాన్ని కూడా. గుమ్మం దాకా వచ్చిన చావుతో కూడా యుద్ధం చేస్తా’’ అని ఎంతో పట్టుదలగా చెబుతారామె. మనీషా కొయిరాలా: నవతరం తారల్లో కూడా అనేకమంది ఈ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోవడంలో పై చేయి సాధిస్తుండటం కనిపిస్తోంది. అలాంటివారిలో మనీషా ఒకరు. 1942 ఎ లవ్‌స్టోరీ, బొంబాయి, భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి 90ల నాటి చిత్రాలతో ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకుల కలల రాణిలా మారి ఎందరికో నిదురను దూరం చేసిన మనీషా కొయిరాలా.. కొంత కాలం తర్వాత నున్నని గుండుతో, పీక్కుపోయిన చెంపలతో వాడిపోయిన వదనంతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయగా చూసిన ఆమె అభిమానుల గుండెలు బద్దలైపోయాయి. అవును మరి... మనీషా... ఓవెరీన్ క్యాన్సర్ బారినపడ్డారు. మృత్యుముఖం దాకా వెళ్లి , మూడేళ్ల పోరాటం తర్వాత కోలుకున్నారు. అమెరికాలో చికిత్స చేయించుకున్న ఈ 47 ఏళ్ల నటి ప్రస్తుతం క్యాన్సర్ రహిత జీవితం గడుపుతూ... క్యాన్సర్‌పై పోరాటానికి ప్రేరణగా వెలుగుతున్నారు. లీసా రే: శరీరంలో ఎక్కడైనా వ్యాప్తి చెందగలిగిన ఈ ప్రాణాంతక సర్వాంతర్యామి... అందమైన తారల్ని మరింత మోహిస్తుందేమో అనిపిస్తుంది. బోంబే డైయింగ్ మోడల్‌గా, మహేష్‌బాబు సరసన టక్కరిదొంగ హీరోయిన్గా ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వని గ్లామర్ పంచిన లీసా రేపై కూడా ఈ వ్యాధి దాడి చేసింది. టొరంటోలో జన్మించడం, బెంగాలీ తండ్రి, పోలిష్ తల్లికి పుట్టడం లాంటి విశేషవంతమైన జీవితం ఉన్న లిసారేకు సోకిన క్యాన్సర్ కూడా విశేషమైనదే. ఆమె ఎటోబైకోక్ అనే అత్యంత అరుదైన తరహా క్యాన్సర్‌కి గురయ్యారు. యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేసే ప్లాస్మా సెల్స్‌కు సోకే క్యాన్సర్‌కి ఆమె బాధితురాలయ్యారు. ఒక స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స తర్వాత 2010లో తాను క్యాన్సర్ నుంచి కోలుకున్నానని ఆమె ప్రకటించారు. అయితే ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి కానప్పటికీ.. దానికి తలవంచకుండా ఆత్మవిశ్వాసంతో లిసా రే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గౌతమి: దక్షిణాది కథానాయికగా మనకు చిరపరిచితమైన గౌతమి తాడిమల్ల కూడా ఇదే వ్యాధితో పోరాడి విజయం సాధించారు. తనను కబళించడానికి వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్‌ను తరిమి కొట్టిన ఆమె తనలా పోరాడే వారికి అవసరమైన మద్దతును అందిస్తున్నారు. దేశ విదేశాల్లో ఈ వ్యాధిపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘‘ఈ వ్యాధిపై పోరాడి జయించడంలో మనోబలం చాలా కీలకమైంది. దీనికి కావాల్సింది చుట్టుపక్కలవారి మద్దతు’’ అంటారామె. మమతా మోహన్‌దాస్: కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు.. మరిన్ని ఆశలతో ముందుకు దూసుకుపోతున్నప్పుడు, ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని తేలితే... ఇంకెవరైనా అయితే కుప్పకూలిపోయేవారేమో కాని మన నటి మమతా మోహన్‌దాస్ మాత్రం కాదు. ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ఫిల్మ్‌ఫేర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కూడా దక్కించుకున్న ఆనందంతో ఉన్న ఆమెను అదే సమయంలో కేన్సర్ పలకరించింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు హడ్గికిన్ లింఫోమా కేన్సర్ సోకింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చికిత్స కొనసాగిస్తున్న ఆమె చాలా త్వరగానే ఆ వ్యాధి తాలూకు తీవ్ర ప్రభావం నుంచి బయటపడ్డారు. తన కెరీర్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. ఇంతే కాదు... కైట్స్ సినిమాలో హృతిక్‌రోషన్ సరసన మెరిసిన బార్బరామోరి సైతం క్యాన్సర్ బాధితురాలే. అయితే సినిమాల్లోకి రావడానికి ముందే ఆమె ఈ వ్యాధి బారిన పడటం, దానిపై గెలవడం కూడా జరిగిపోయాయి. అదే సినిమాకు దర్శకత్వం వహించిన అనురాగ్ బసు, బార్బరాలు ఇద్దరూ క్యాన్సర్ సర్వైవర్లే. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిరువురూ తమ విజయగాథలను పంచుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్: ప్రస్తుతం బాలీవుడ్లో క్రేజీ యాక్టర్‌గా వెలుగుతున్న సమయంలోనే ఇర్ఫాన్ సైతం క్యాన్సర్‌కు గురయ్యాడు. కొన్ని వారాల పాటు తన ఆరోగ్యంపై వచ్చిన వదంతుల అనంతరం ఈ బాలీవుడ్ యాక్టర్... మార్చి 16న తనకు న్యూరాన్ డొక్రైమ్ ట్యూమార్ ఉన్నట్టు ట్వీట్ ద్వారా నిర్ధారించాడు. ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. అలసిపోవడం సహజం. ఆగిపోవడం మరణం. ఊపిరి ఉన్నంత వరకూ ఆశను ఉంచుకో... అంటూ పట్టుదలతో ప్రాణాల్ని పట్టి ఉంచుతున్న ఈ తెరవెలుగుల ప్రయాణం మరెందరికో స్ఫూర్తిని అందిస్తుంది. తారల్లో రేపటి విజేత గురించి రాసేందుకు మరో పేజీని నీ కోసం సిద్ధంగా ఉంచాం... గెట్ వెల్ సూన్ సోనాలి. ఇల్నెస్.. విల్‌పవర్ పాంక్రియాస్ క్యాన్సర్‌కు మూడు నెలల పాటు యు.ఎస్.లో చికిత్స తీసుకుని ఇటీవలే తిరిగి విధులకు హాజరైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గురువారం నాడు పత్రికా సంపాదకులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్నప్పుడు ప్రస్తావన మాత్రంగా క్యాన్సర్‌తో తనెలా పోరాడిందీ ఎంతో స్ఫూర్తివంతంగా చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత తిరిగి ఆరు రోజుల పాటు చికిత్స కోసం యు.ఎస్.లో ఉండవలసి వస్తుందని చెబుతూ, విల్‌పవర్ ఉంటే ఎవరైనా, ఎలాంటి ‘ఇల్నెస్’నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చునని ఆయన అన్నారు. – సత్యబాబు -
పెళ్లయితే... ప్రేమ మాయమవుతుందా?
బాగా ప్రేమించుకున్నవాళ్లు పెళ్లి చేసుకుంటే? ‘పెళ్లి దెబ్బకు ప్రేమ మాయమైపోతుంది’లాంటి సరదా కామెంట్లు నేను చాలా విని ఉన్నాను. గోల్డీ, నేనూ అయిదేళ్ళ పాటు స్నేహితులుగా, ప్రేమికులుగా తిరిగాం. పెళ్లికి ముందు నాకు చిన్న సందేహం వచ్చింది. ‘పెళ్లయిన తరువాత కూడా ఈ ప్రేమ ఇలాగే ఉంటుందా?’ అని. కచ్చితంగా ఉంటుందని మా వివాహబంధం నిరూపించింది. చిన్నవయసులోనే తండ్రీ, తాతలను పోగొట్టుకున్నాడు గోల్డీ. అమ్మ, అమ్మమ్మ, ముగ్గురు అక్కల మధ్య పెరిగాడు. అందుకే అతనికి స్త్రీ హృదయం ఏమిటో తెలుసు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటే ప్రేమకు ఓటమి లేదు. మా అబ్బాయి రణవీర్ ఇప్పుడిప్పుడే న్యూస్‌పేపర్లు చదవడం మొదలుపెట్టాడు. వాడికి రకరకాల సందేహాలు వస్తుంటాయి...నేను, గోల్డీ వాటికి విసుక్కోకుండా సమాధానాలు చెబుతుంటాం. పిల్లల జీవితంలో మొదటి ఏడు ఏళ్లు ముఖ్యమైనవని ఎక్కడో చదివాను. అందుకే మా అబ్బాయి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. పిల్లల పెంపకంలో మా అమ్మను మించిన ఆదర్శం నాకు ఎవరూ లేరు.‘‘అందుకే ఎప్పుడూ అంటుంటాను... మా అమ్మే నా హీరో’’ అని. - సోనాలీ బెంద్రే