Sonali Bendre Reaction Over Rumours On Her Financial Status, Tollywood Re Entry - Sakshi
Sakshi News home page

Sonali Bindre: ఆ వార్తలను ఖండించిన సోనాలి బింద్రె, నాకావసరం లేదు..

Published Thu, Jun 30 2022 4:29 PM | Last Updated on Thu, Jun 30 2022 5:43 PM

Sonali Bendre Denies Rumours On Her Financial Status And Tollywood Re Entry - Sakshi

‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్‌’ వంటి పలు తెలుగు హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది సోనాలి బింద్రె. 2013లో హిందీలో వచ్చిన వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై దొబార చిత్రంలో అతిథిగా కనిపించిన ఆమె క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని ఆరోగ్యంతో తిరిగొచ్చిన సోనాలి బింద్రె ది బ్రోకెన్‌ న్యూస్‌ అనే వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది.

 చదవండి: హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో బిగ్‌బి సందడి, ఫొటో వైరల్‌

ఇటీవల జూన్‌ 10న ఈ వెబ్‌ సిరీస్‌ జీ5లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సోనాలి బింద్రె ఇటీవల తనపై వస్తున్న పుకార్లను ఖండించింది. సోనాలి బింద్రె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అందుకే ఆమె మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్‌ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆఫర్స్‌ కావాలంటూ దర్శక-నిర్మాతలకు ఆమె విజ్ఞప్తి చేసుకుంటుందంటూ బి-టౌన్‌లో గుసగుసలు వినిపంచాయి.

చదవండి: మైక్‌ టైసన్‌ బర్త్‌డే, స్పెషల్‌ వీడియోతో విషెస్‌ తెలిపిన ‘లైగర్‌’ టీం

తాజాగా సోనాలి బింద్రె ఈ వార్తలను కొట్టి పారెసింది. తను ఆర్థికంగానూ, అన్ని విధాలుగా బాగున్నానని, ఆఫర్స్‌ కావాలనొ అడుక్కోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. ‘నాకు డబ్బు సమస్య ఉందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అలాగే తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే ఎన్టీఆర్‌ 30 సినిమాల్లో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో సైతం నిజం కాదని వెల్లడించింది. ప్రస్తుతం నేను ఎలాంటి సినిమాలకు సంతకం చేయలేదు. మంచి కథ, పాత్ర నచ్చితే తప్పకుండ చేస్తాను’ అని తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement