Bollywood Star Sonali Bendre Opened Up on Mediocre Films in the Past - Sakshi
Sakshi News home page

Sonali Bendre: డబ్బు చాలా అవసరమైంది, అందుకే వాటికి ఒప్పుకున్నాను

Published Fri, Jun 3 2022 4:58 PM | Last Updated on Fri, Jun 3 2022 6:01 PM

Bollywood Star Sonali Bendre Opened Up on Mediocre Films in the Past - Sakshi

‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్‌’ వంటి పలు తెలుగు హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది సోనాలి బింద్రె. 2013లో హిందీలో వచ్చిన వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై దొబార చిత్రంలో అతిథిగా కనిపించిన ఆమె ఆ తర్వాత క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. ఇటీవలే ది బ్రోకెన్‌ న్యూస్‌ అనే వెబ్‌సిరీస్‌లో నటించగా ఇది జూన్‌ 10 నుంచి జీ5లో ప్రసారం కానుంది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ఒకానొక సమయంలో నాకు చాలా డబ్బులు అవసరమయ్యాయి. ఇంటి అద్దె కట్టాలి, బిల్లులు చెల్లించాలి. అప్పుడు నా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకే నాకు ఎలాంటి పాత్రలు వచ్చినా చేసుకుంటూ పోయాను. అలా ఓ సినిమా చేసి ఇంకో సినిమాకు రెడీ అయ్యే సమయానికి అసలు ఎందుకా ప్రాజెక్ట్‌ ఒప్పుకున్నాను? అని ఆలోచించేదాన్ని. కానీ ఆ వెంటనే నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ డబ్బులు ఎప్పుడిస్తారో అని ఎదురుచూసేదాన్ని. అందుకే అతిగా ఆలోచించకుండా కొన్ని పాత్రలు చేసుకుంటూ పోయాను. ఆ సినిమాలు మీరే కాదు నేను కూడా చూడలేదు' అని చెప్పుకొచ్చింది సోనాలి బింద్రె.

చదవండి: డాక్టర్‌ స్ట్రేంజ్‌ మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
జవాన్‌ మూవీ.. మాస్‌ లుక్‌లో షారుక్‌ ఖాన్‌, టీజర్‌ చూశారా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement