ఆ సాంగ్‌ హిట్‌ కాకుంటే.. ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేద్దామనుకున్నా: టాప్‌ హీరోయిన్‌ | Sonali Bendre Comments Her Past Life | Sakshi
Sakshi News home page

ఆ సాంగ్‌ హిట్‌ కాకుంటే.. ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేద్దామనుకున్నా: టాప్‌ హీరోయిన్‌

Published Sat, Apr 27 2024 3:34 PM | Last Updated on Sun, Apr 28 2024 6:56 AM

Sonali Bendre Comments Her Past Life

మురారి సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సోనాలి బింద్రే. ఆ తర్వాత మన్మధుడు, ఇంద్ర, ఖడ్గం, శంకర్‌ దాదా వంటి సినిమాలతో దాదాపు తెలుగు స్టార్‌ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. సుమారు పదేళ్ల తర్వాత ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. చివరగా 2013లో ఒక బాలీవుడ్‌ సినిమాలో కనిపించి ఇండస్ట్రీకి దూరమయింది.

జీ5 వేదికగా మే3 నుంచి 'ది బ్రోకెన్‌ న్యూస్‌ 2' స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో తన పాత రోజులను మరొసారి గుర్తుచేసుకుంది. హీరోయిన్‌కు డ్యాన్స్‌ రాకపోతే ఇండస్ట్రీలో కొనసాగలేరనే అభిప్రాయం గతంలో చాలామందికి అభిప్రాయం ఉండేదని ఆమె పేర్కొంది. సినిమా రంగంలో అడుగుపెట్టే రోజుల్లో తనకు పెద్దగా డ్యాన్స్‌ రాదని తెలిపింది. దీంతో కొందరు కొరియోగ్రాఫర్స్‌ తిట్టేవారని ఆమె గుర్తుచేసుకుంది. వారి తిట్లు భరించలేక డ్యాన్స్‌లో ఎక్కువగా శిక్షణ తీసుకునేదానినని ఆమె తెలిపింది. 

మణిరత్నం గారి డైరెక్షన్‌లో వచ్చన 'బొంబాయి' సినిమాలో 'హమ్మా.. హమ్మా' సాంగ్‌లో అవకాశం వచ్చింది. కానీ, ఆ సమయంలో తనకు కేవలం ఐదు సినిమాల్లో మాత్రమే నటించిన అనుభవం ఉన్నట్లు పేర్కొంది. కొంతమేరకు శిక్షణలో ఉన్న సొనాలి.. ఆ పాటకు డ్యాన్స్‌ మాస్టర్‌ రాజు సుందరంతో కలిసి ఆ పాటకు అదరిపోయే స్టెప్పులు వేసి మెప్పించాలని కోరుకున్నట్లు సొనాలి చెప్పింది. ఒకవేళ ఈ పాటలో తన డ్యాన్స్‌ నచ్చలేదంటే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసి వెళ్లాలని కూడా ఫిక్స్‌ అయినట్లు తెలిపింది. ఫైనల్‌గా 'హమ్మా.. హమ్మా' సాంగ్‌ సూపర్‌ హిట్‌ కావడంతో ఆ పాటతో తన పేరు ట్రెండ్‌ అయినట్లు సోనాలి చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement