స్టార్‌ క్రికెటర్‌ ప్రపోజ్‌.. హీరోయిన్ ఏమన్నారంటే! | Sonali Bendre on former Pakistani cricketer Shoaib Akhtar Marriage Proposal | Sakshi
Sakshi News home page

Sonali Bendre: ఆ స్టార్‌ క్రికెటర్‌ ప్రపోజ్‌.. ఆశ్చర్యమేసిందన్న హీరోయిన్‌!

Published Wed, May 15 2024 5:09 PM | Last Updated on Wed, May 15 2024 7:13 PM

Sonali Bendre on former Pakistani cricketer Shoaib Akhtar Marriage Proposal

టాలీవుడ్‌లో మురారి, ఇంద్ర లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలతో మెప్పించిన భామ సోనాలి బింద్రే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసింది. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్‌-2 తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన వెబ్ సిరీస్‌ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా సోనాలికి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్ అక్తర్‌ మీపై విపరీతంగా ప్రేమించాడని వార్తలొచ్చాయి.. అంతేకాదు పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్‌ చేస్తానని అన్నట్లు తెగ వైరలయ్యాయి.

అయితే తాజా ఇంటర్వ్యూలో వీటిపై సోనాలి బింద్రే స్పందించింది. ఆ ప్రశ్న వినగానే సోనాలి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీని గురించి మాట్లాడుతూ.. 'అతను నిజంగా చెప్పాడో లేదో నాకు తెలియదు.. అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు.. ఇప్పటికీ ఆ ఫేక్ న్యూస్‌ ఉందని ఆమె కొట్టిపారేశారు. అయితే అతను తన అభిమాని కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

అయితే 2019లో సోనాలికి సంబంధించి తాను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదని షోయబ్ స్పష్టం చేశాడు. షోయబ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో దీనిపై వీడియో పోస్ట్ చేశారు. ఇంతటితో ఈ రూమర్స్‌కు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. నేను ఆమెను సినిమాల్లో చూశాను.. తన అందమైన నటి కూడా అని అన్నారు. అయితే ఆమె క్యాన్సర్‌తో పోరాడిన తీరు చూసి అభిమానించడం మొదలుపెట్టానని షోయబ్ వెల్లడించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement