
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Sonali Bendre Reacts On Acting In NTR 30 Movie With koratala Siva: ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇందులో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్నారని టాక్. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే నటిస్తోందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సోనాలిని ఈ విషయం గురించి అడగ్గా స్పందించారు.
ఏంటి ? నేనా ? అసలు దాని గురించే నాకు తెలియదు. దయ చేసి దాని గురించి మీరే చెప్పండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా తెలియదు. నిజంగా అది నేను కాదేమో. ఇవన్ని తప్పుడు వార్తలు. ఒకవేళ అది నిజమైతే నన్ను ఎవరు సంప్రదించలేదు. ఇదంతా ఏదో థ్రిల్లర్‌లా ఉంది. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు సోనాలి బింద్రే. ప్రస్తుతం సోనాలి బింద్రే ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్ అమీనా ఖురేషీ పాత్రలో నటిస్తోంది. వినయ్ వైకుల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జీ5లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది.
చదవండి:👇
నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి
ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి
అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ