
క్యాన్సర్ వ్యాధికి భయపడకుండా, బాధపడకుండా.. ధైర్యంగా చికిత్స చేయించుకుంటూ, ప్రతి క్షణాన్నీ మిస్ కాకుండా ఆనందంగా గడుపుతున్నారు సోనాలి బింద్రే. గురువారం కుటుంబంతో కలసి న్యూయార్క్‌లో దీపావళి పండగను జరుపుకున్నారు. క్యాన్సర్ వ్యాధి చికిత్స నిమిత్తం సోనాలి న్యూయార్క్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ సెలబ్రేషన్స్ ఫొటోలను ట్వీటర్‌లో షేర్ చేశారు. ‘‘ముంబైలో సంబరాల కంటే కొంచెం లేట్‌గా న్యూయార్క్‌లో మొదలుపెట్టాం. మనలాగా సంప్రదాయ బట్టలు వేసుకుందాం అంటే ఇక్కడ లేవు. పూజ కూడా సింపు ల్‌గా చేశాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు సోనాలి.