తండ్రులు ‘బాధ్యత’ తీసుకుంటున్నారు | Now dads are also involved in kids’ upbringing, says Sonali Bendre | Sakshi
Sakshi News home page

తండ్రులు ‘బాధ్యత’ తీసుకుంటున్నారు

Published Sun, Oct 5 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

తండ్రులు ‘బాధ్యత’ తీసుకుంటున్నారు

తండ్రులు ‘బాధ్యత’ తీసుకుంటున్నారు

న్యూఢిల్లీ: ఇప్పుడు పిల్లల పెంపకంలో తండ్రులూ బాధ్యత తీసుకుంటున్నారని..ఇది శుభ పరిణామమని బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే వ్యాఖ్యానించింది. ఇటీవల ఆమె తన కుమారుడి బాధ్యతల వల్ల ఫిక్షన్ టీవీ షోను చేయడానికి మొదట వెనుకడుగు వేసింది. అయితే తన భర్త సహకారంతో షోను పూర్తిచేయగలిగానని చెప్పింది.

ఈమె భర్త అయిన గోల్డీ బెల్ నిర్మాత కూడా. అలాగే కొడుకు రణవీర్‌కు తొమ్మిదేళ్లు. పిల్లల పెంపకంలో తల్లితో సమానంగా తండ్రి బాధ్యత తీసుకుంటే వారికి మంచి భవిష్యత్తు నిచ్చినట్లవుతుందని ఆమె అభిప్రాయపడింది. ‘ఇంతకుముందు పిల్లలు పుట్టినప్పటినుంచి వారి పెంపకం, ఇతర బాధ్యతలు ప్రధానంగా తల్లిపైనే పడే వి. తండ్రి ఎక్కువ బాధ్యత తీసుకునేవాడు కాదు. కాని నేడు పరిస్థితుల కనుగుణంగా తండ్రులు కూడా పిల్లల బాధ్యతలను తీసుకుంటున్నారు.

ఇది ఆహ్వానించదగ్గ విషయం..’అని అంది. త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’కోసం కనీసం ఆరు నెలల పాటు ఆమె సమ యం కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఈ సమయంలో కుమారుడి ఆలనా పాలనా చూసుకోవడం కష్టమవుతుందని భావించిన ఆమె మొదట ఈ షోను చేయడానికి వెనుకడుగు వేసింది. అయితే ఆమె భర్త ఇచ్చిన ప్రోత్సాహం, భరోసాతో తను ఈ ప్రాజెక్టుకు అంగీకరించానని ఆమె తెలిపింది. ‘నువ్వు వెళ్లు.. నేనున్నాగా.. రణవీర్ గురించి నా మీటింగ్‌లు, ఇతర పనులు సర్దుబాటు చేసుకుంటా..అని నా భర్త హామీ ఇచ్చాడు. అతడు చెప్పినట్లుగానే రణవీర్ స్కూల్ కు వెళ్లి తీసుకు వస్తున్నాడు.. అలాగే టెన్నిస్ క్లాస్‌లకు వెళ్లి పికప్ చేసుకుంటున్నాడు..’ అని ఆమె వివరించింది.

 ‘చిన్నప్పటినుంచి నాకు జంక్‌ఫుడ్‌లు, బయట చేసే తినుబండారాలు తినడం అలవాటు లేదు. వారానికి మూడు రోజులు జిమ్‌కువెళుతుంటా. ప్రతి రెండు గంటలకొకసారి ఆకలయ్యేది. ఏమైనా ఉంటే పెట్టమని మా అమ్మని సతాయించేదాన్ని. దాంతో ఆమె నాపై అప్పుడప్పుడూ కోప్పడేది కూడా.. అయితే ఇప్పుడు ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చుపెట్టుకుని మరీ ఏ డైటీషియన్ దగ్గరికెళ్లినా రెండు గంటలకొకసారి తిండి తినమని చెబుతున్నారు..’అని ఆమె నవ్వుతూ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement