
పిల్లలకు సంబంధించిన ప్రతీ వేడుక తమ సమక్షంలోనే జరగాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. మిగతా రోజుల్లో బిజీగా ఉన్నా పుట్టిన రోజు వంటి ప్రత్యేకమైన రోజున పిల్లలతో గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తారు. సొనాలీ బింద్రే కూడా తన ఒక్కగానొక్క కొడుకు రణ్‌వీర్ విషయంలో ఇలాగే ఆలోచించారు. కానీ ప్రస్తుతం చికిత్స నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్న కారణంగా.. పుట్టిన రోజున అతడి దగ్గర ఉండలేకపోయినందుకు భావోద్వేగానికి గురయ్యారు. హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధ పడుతోన్న సొనాలి.. కొడుకు పట్ల తన మనసులో ఉన్న భావాలని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తోంది.
హ్యాపీ బర్త్‌డే రణ్‌వీర్...
‘రణ్‌వీర్ నువ్వే నా సూర్యుడు, చంద్రుడు... ఇంకా నీ నవ్వులే నక్షత్రాలు. సరే... నేను కాస్త మెలోడ్రామా చేస్తున్నట్లు అనిపిస్తోంది కదా. కానీ ఇది నీ 13వ పుట్టిన రోజు. ఈ మాత్రం ప్రేమకు నువ్వు అర్హుడివి. వావ్.. నువ్వు చాలా పెద్దవాడివయ్యావు. నిన్ను చూసి నేనెంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను. నీ హాస్య చతురత, దయాగుణం, అన్నింటినీ అర్థం చేసుకోగల పరిపక్వత ఒక్కటేమిటి అన్నింటిలో నువ్వు పర్ఫెక్ట్. హ్యాపీ బర్త్‌డే కన్నా.. నేను పక్కన లేకుండా నువ్వు చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇదే కదా. నిన్ను చాలా మిస్సవుతున్నా. కానీ ఏం చేయను. దూరంగా ఉంటూనే నీ మీద ప్రేమ కురిపించడం తప్ప’ అంటూ కొడుకు రణ్‌వీర్ పుట్టిన రోజు సందర్భంగా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment