Rohit Bal
-
ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్‌లో అనన్య పాండే : శభాష్ అంటున్న నెటిజన్లు
ఫ్యాషన్ ప్రపంచంలో బాగా వినిపించే పేరు నటి అనన్య పాండే పేరు. ఇటీవల తన కజిన్ సోదరి నిశ్చితార్థ వేడుకలో మరింత ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే సాంప్రదాయ బద్ధంగా డిజైనర్ చీర లేదా గౌను ధరించడానికి బదులుగా, అనన్య 21 ఏళ్ల నాటి పాత డ్రెస్‌ను ఎంచుకుంది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ఇలా ఎందుకు చేసిందంటే..సన్నిహిత బంధువు దియా ష్రాఫ్ నిశ్చితార్థానికి ఆక్వా బ్లూ కలర్ డ్రెస్ అందంగా కనిపించింది. అయితే ఈ డ్రెస్ ఫ్యాషన్ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రఖ్యాత దివంగత డిజైనర్ రోహిత్ బాల్ తన తల్లి భావనా పాండే కోసం తయారు చేసిన ఆక్వా-బ్లూ గోల్డ్ ఎంబ్రాయిడరీ కుర్తా సూట్‌ను ధరించింది.దీనికి సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది అనన్య పాండే. దీంతో నెటిజన్లు ఘనమైన నివాళి. ఈ డ్రెస్ మీకూ చాలా బావుంది అంటూ ప్రశంసించారు.నిజానికి అమ్మలు, అమ్మమ్మల చీరలు, అందమైన లెహంగాలను కూతుళ్లు అపురూపంగా ధరించడం కొత్తేమీ కాదు. కానీ అనన్య పాండే ఒక డిజైనర్ పట్ల గౌరవ సూచకంగా రెండు దశాబ్దాల క్రితం ఆయన డిజైన్ చేసిన సూట్‌ను ధరించడం విశేషంగా నిలిచింది. 2024 అక్టోబరులో లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా, అనన్య రోహిత్ బాల్ కోసం ర్యాంపవాక్ చేసిన ఘనత అనన్య సొంతం చేసుకుంది. ఇక వర్క్ పరంగా చూస్తే CTRL మూవీతో ఆకట్టుకుంది. అలాగే ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్‌లో అతిధి పాత్ర లో కనిపించింది అనన్యపాండే చిత్రనిర్మాత, కరణ్ జోహార్ సారద్యంలో అనన్య నటించిన రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని భావిస్తున్నారు.కాగా 2023 నుండి గుండె జబ్బుతో బాధపడుతున్న రోహిత్ బాల్, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిని మాత్రం వదల్లేదు. చివరికి ఆరోగ్య విషమించడంతో ఈ నెల ఆరంభంలో (నవంబర్ 1న) కన్నుమూశారు. ఆయన మరణం ఫ్యాషన్ ప్రపంచానికి తీరటి లోటు అని అభిమానులు ,ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. < View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
ప్రముఖ డిజైనర్ మృతి.. ఇంద్ర హీరోయిన్ ఎమోషనల్!
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ మృతిపట్ల సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే సంతాపం తెలిపారు. అతనితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు. మీరు అద్భుతమైన డిజైనర్ అని అందరికీ తెలుసని అన్నారు. అంతే కాకుండా మీతో ల యూ హమేషా అనే చిత్రంలో నటించిన రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. అతన్ని సోనాలి కేవలం డిజైనర్‌గానే కాకుండా సహ నటుడిగా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన లవ్ యు హుమేషా మూవీ థియేటర్లలో విడుదల కాలేదు.కాగా.. రోహిత్ బాల్‌ను నవంబర్ 1న కన్నుమూశారు. ఆయన 63 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. దీంతో హీరోయిన్ సోనాలి బింద్రే.. రోహిత్ బాల్‌కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు. ఆమెతో పాటు నటుడు అర్జున్ రాంపాల్ కూడా దివంగత ఫ్యాషన్ డిజైనర్‌కు నివాళులర్పించారు. రోహిత్ బాల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. కాగా.. ఆయన జ్ఞాపకార్థం సోమవారం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రార్థనా సమావేశం నిర్వహించారు.కశ్మీర్‌కు చెందిన రోహిత్ బాల్ తన గొప్ప డిజైన్లతో బాలీవుడ్లో ప్రసిద్ధి చెందాడు. చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు ఆయన పనిచేశారు. అతని డిజైన్లను పమేలా ఆండర్సన్, ఉమా థుర్మాన్, సిండి క్రాఫోర్డ్, నవోమి కాంప్‌బెల్ లాంటి అంతర్జాతీయ స్టార్స్ సైతం ధరించారు. కాగా.. సోనాలి బింద్రే తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్లో ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించింది. -
ఇండియన్ బ్రైడల్ ఐడల్ ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫైనల్
ముంబైలో జరిగిన ఇండియన్ బ్రైడల్ ఐడల్ ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫైనల్లో మోడల్స్ వెరైటీ డ్రస్సులతో కనువిందు చేశారు. ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, రోహిత్ బాల్ రూపొందించిన ఫ్యాషన్స్‌లో మోడల్స్ మెరిశారు. బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా, ప్రాచీ దేశాయ్, గీతా బస్రా, ఇషా గుప్తా, అతిథిరావు హైద్రి, సోఫీ చౌదరి క్యాట్ వ్యాక్లతో అదరగొట్టారు. Courtesy: HOTURE IMAGES