ఎంగేజ్‌మెంట్‌ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్‌లో అనన్య పాండే : శభాష్‌ అంటున్న నెటిజన్లు | Ananya Panday Honours Rohit Bal By 21-Year-Old Suit For Cousins Engagement | Sakshi
Sakshi News home page

ఎంగేజ్‌మెంట్‌ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్‌లో అనన్య పాండే : ఆయన కోసమే!

Published Fri, Nov 8 2024 12:22 PM | Last Updated on Fri, Nov 8 2024 2:14 PM

Ananya Panday Honours Rohit Bal By 21-Year-Old Suit For Cousins Engagement

ఫ్యాషన్‌ ప్రపంచంలో  బాగా వినిపించే పేరు నటి  అనన్య పాండే  పేరు. ఇటీవల తన కజిన్‌ సోదరి నిశ్చితార్థ వేడుకలో మరింత ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే సాంప్రదాయ బద్ధంగా డిజైనర్‌  చీర లేదా గౌను ధరించడానికి బదులుగా, అనన్య 21  ఏళ్ల నాటి  పాత డ్రెస్‌ను ఎంచుకుంది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ఇలా ఎందుకు చేసిందంటే..

సన్నిహిత బంధువు దియా ష్రాఫ్ నిశ్చితార్థానికి ఆక్వా బ్లూ కలర్‌ డ్రెస్‌ అందంగా కనిపించింది. అయితే ఈ డ్రెస్‌  ఫ్యాషన్ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రఖ్యాత దివంగత డిజైనర్ రోహిత్ బాల్ తన తల్లి భావనా ​​పాండే కోసం తయారు చేసిన ఆక్వా-బ్లూ  గోల్డ్ ఎంబ్రాయిడరీ కుర్తా సూట్‌ను ధరించింది.దీనికి సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది అనన్య పాండే. దీంతో నెటిజన్లు ఘనమైన నివాళి. ఈ డ్రెస్‌ మీకూ చాలా బావుంది అంటూ ప్రశంసించారు.

నిజానికి అమ్మలు, అమ్మమ్మల చీరలు,  అందమైన లెహంగాలను కూతుళ్లు అపురూపంగా ధరించడం కొత్తేమీ కాదు. కానీ అనన్య పాండే ఒక డిజైనర్‌ పట్ల గౌరవ సూచకంగా  రెండు దశాబ్దాల క్రితం ఆయన డిజైన్‌ చేసిన  సూట్‌ను ధరించడం విశేషంగా నిలిచింది. 2024 అక్టోబరులో లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా, అనన్య రోహిత్ బాల్ కోసం ర్యాంపవాక్‌  చేసిన ఘనత అనన్య సొంతం చేసుకుంది. ఇక వర్క్‌ పరంగా చూస్తే   CTRL మూవీతో ఆకట్టుకుంది. అలాగే ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్‌లో అతిధి పాత్ర లో కనిపించింది అనన్యపాండే చిత్రనిర్మాత, కరణ్ జోహార్  సారద్యంలో అనన్య నటించిన రొమాంటిక్‌ మూవీ  ‘చాంద్ మేరా దిల్’ వచ్చే ఏడాది రిలీజ్‌ కానుందని  భావిస్తున్నారు.


కాగా 2023 నుండి గుండె జబ్బుతో బాధపడుతున్న రోహిత్ బాల్, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిని మాత్రం వదల్లేదు. చివరికి ఆరోగ్య విషమించడంతో ఈ నెల ఆరంభంలో (నవంబర్ 1న)  కన్నుమూశారు.  ఆయన మరణం ఫ్యాషన్ ప్రపంచానికి తీరటి లోటు అని అభిమానులు ,ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
 

<

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement