గాఢనిద్రలో ఉండగా దాడి
పలువురికి తీవ్ర గాయాలు
గండేపల్లి : గాఢ నిద్రలో ఉండగా వీధి కుక్కలు పలువురిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల బీభత్సం సృష్టించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. మండలంలోని రామయ్యపాలెం, ఎన్టీ రాజాపురం, సింగరమ్మపాలెం, ఉప్పలపా డు గ్రామాల్లో ఆదివారంరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జనంపై కుక్కలు విరుచుకుపడ్డాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. గాదరాడకు చెందిన అల్లంకి రమేష్ రామయ్యపాలెం బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లి, తిరిగొస్తుండగా వీధి కుక్క దాడి చేసింది. పిక్కను పట్టుకోవడంతో రమేష్ పెట్టిన కేకలకు స్థానికులు అక్కడకు చేరుకుని, కుక్కను తరిమారు. అర్థరాత్రి సమయంలో ఇదే గ్రామానికి చెందిన కర్రి శివరామకృష్ణ గాఢ నిద్రలో ఉండగా, అతడి కాలిని కుక్క పట్టుకుంది. విదిలించుకునేందుకు ప్రయత్నించగా.. కుడిచేతి మండపై తీవ్రంగా గాయపరిచింది. తెల్లవారుజామున ఇంటి వాకలి తుడుస్తున్న దాసరి నూకాలమ్మ కుడిచేతిపై కుక్క గట్టిగా కరిచింది.
చిన్నారులపైనా..
ఎనిమిదేళ్ల ముక్కా దేవిశ్రీప్రసాద్ ఎడమ కాలితొడ భాగంలోను కుక్క గాయపరిచింది. అయ్యప్ప మాల ధరించిన తొమ్మిదేళ్ల కాపుశెట్టి అశోక్‌కుమార్ సోమవారం తెల్లవారుజామున స్నానానికి వెళుతుండగా కుక్కలు దాడికి తెగబడ్డాయి. అతడిపై విరుచుకుపడిన కుక్కలను గ్రా మస్తులు తరిమివేయడంతో బాలుడి ప్రా ణాలు దక్కాయని తండ్రి శ్రీను తెలి పాడు. అలాగే ఎన్టీ రాజాపురం గ్రామం లో ఇంటిలోంచి బయటకు వస్తున్న బక్కా లక్ష్మిని గుమ్మం వద్దే కూర్చొని ఉన్న కుక్క గాయపరిచింది.
దుప్పటి లాగి మరీ దాడి
అదే గ్రామానికి చెందిన సప్పిడి వీరాస్వామిని నిద్రలో ఉండగా, కుక్క దుప్పటిలాగి మరీ దాడి చేసిందని బాధితుడు పేర్కొన్నా డు. తణుకు పెదవీర్రాజును జగ్గంపేటలో ప్రైవేటు ఆస్పత్రి వద్ద వీధి కుక్క దాడి చే సింది. సింరంపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో నాలుగేళ్ల శంకుమల్ల శ్యామ్‌కుమార్, నగిరిపాటి శివాజీని పెంపుడు కుక్కలు కరవడంతో గాయపడ్డారు. వీరు చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. వీరికి ప్రాథమికచికిత్స చేసి, రాజమండ్రి జీజీహెచ్‌కు పంపించారు.
కుక్కల బీభత్సం
Published Tue, Nov 24 2015 3:18 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
Advertisement