కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలు కకావికలమయ్యాయి. ఈ భారీ విపత్తుకు బలయినవారి సంఖ్య 413కి చేరింది. ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సివుంది. వారి కోసం 10వ రోజు(గురువారం)కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కేంద్ర అధికారుల బృందం నేతృత్వంలో రక్షణ ఏజెన్సీలకు చెందిన వెయ్యిమందికిపైగా సభ్యులు గురువారం తెల్లవారుజాము నుంచే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా వయనాడ్, మలప్పురం జిల్లాలోని చలియార్ నది గుండా వెళ్లే ప్రాంతాల్లో ఈ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నది నుండి మృతదేహాలను, శరీరభాగాలను వెలికితీసి తొలుత వాటిని డీఎన్‌ఏ పరీక్షకు పంపి, అనంతరం వాటిని గుర్తిస్తున్నారు.
ఆ తరువాత ఆ మృతదేహాలను ఖననం చేస్తున్నారు. ఆనంతరం ఆయా సమాధుల ముందు నంబర్ల రాసి, డీఎన్ ఏ రిపోర్టు ఆధారంగా బంధీకులకు అధికారులు తెలియజేస్తున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో వందకుపైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా, 10వేలమందికిపైగా బాధితులు వీటిలో ఆశ్రయం పొందుతున్నారు. బాధితులకు మూడు దశల్లో పునరావాసం కల్పిస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment