వయనాడ్‌ మృత్యు ఘోష.. 123కు చేరిన మృతుల సంఖ్య.. మరో 600 మంది గల్లంతు | Wayanad Landslides Live Updates | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ మృత్యు ఘోష.. 123కు చేరిన మృతుల సంఖ్య.. మరో 600 మంది గల్లంతు

Published Tue, Jul 30 2024 4:42 PM | Last Updated on Tue, Jul 30 2024 9:24 PM

Wayanad Landslides Live Updates

తిరువనంతపురం :  వయనాడ్‌ ఘటన.. 123కు పెరిగిన మృతుల సంఖ్య చేరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  ఈ వయనాడ్‌ విషాధంపై మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ ఎస్ శశిధరన్ మాట్లాడుతూ.. శిధిలాల కింద దాదాపు 50 మృతదేహాలు గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్‌ మార్టం జరుగుతున్నట్లు తెలిపారు. రేపుకూడా పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు శిధిలాల కింద సహాయక చర్యల్ని ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు.  

 భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌లు, డ్యాంలు నిండుకుండలా మారాయి. వరదల ధాటికి వయనాడ్‌ మృతుల సంఖ్య 94కి చేరింది. పదుల సంఖ్యలో డెడ్‌బాడీలను 30కిలోమీటర్ల దూరంలో ఉన్న చలయార్‌ నదిలో గుర్తించారు. ముండకై టీస్టేట్‌లో పనిచేస్తున్న 600 మంది కార్మికులు గల్లంతయ్యారు.దీంతో కార్మికుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి.
 

గాడ్స్‌ ఓన్‌‌ కంట్రీపై ప్రకృతి కన్నెర్ర చేసింది. రికార్డ్‌స్థాయిలో 24 గంటల్లో 37.7 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వయనాడ్‌ జిల్లాలో వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి విలయ తాండవం చేసింది. అర్ధరాత్రి గ్రామాలపై కొండచరియలు విరుచుకుపడి అనేక మంది సజీవ జలసమాధి అయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు శిధిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాధాలు చేస్తున్నారు. మట్టి, బురద కింద వందల మంది చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. గంటగంటకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

వయనాడ్‌ జిల్లా మెప్పాడీ సమీపంలోని వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపూ 400 ఇళ్లను మట్టిచరియలు కమ్మేశాయి. దీంతో ఇప్పటి వరకు 89మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ఆచూకీ లేకుండా పోయింది. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆటంకం కలుగుతోంది.

కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి ఆర్మీ బలగాలు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సహా 250 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు.ఆర్మీ,నేవీ,ఐఏఎఫ్‌ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో భాగస్వామ్యమయ్యాయి. శిధిలాలు,బురదలో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది వెలికి తీస్తున్నారు.

స్థానికంగా ఉన్న ఆలయాలు,మసీదులు,చర్చీల్లో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాడు చేసి బాధితులకు తక్షణ చికిత్సను అందిస్తున్నారు.

వయనాడ్‌ విలయం నేపథ్యంలో కేరళకు బాసటగా నిలిచారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌. కేరళ సీఎం సహాయ నిధికి రూ.5కోట్లు విడుదల చేశారు. 10మందితో కూడిన వైద్య బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు.

 

వయనాడ్‌ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేరళ సీఎం పినరయి విజయన్‌. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారాయన.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement