నదిలో చిక్కుకున్న బస్సు.. 40 మంది అందులోనే.. వీడియో వైరల్.. | Haridwar UP Roadways Bus Gets Stuck Flooded Causeway | Sakshi
Sakshi News home page

నదిలో చిక్కుకున్న బస్సు.. 40 మంది అందులోనే.. వీడియో వైరల్..

Published Sat, Jul 22 2023 8:46 PM | Last Updated on Sat, Jul 22 2023 9:00 PM

Haridwar UP Roadways Bus Gets Stuck Flooded Causeway - Sakshi

లక్నో: కొద‍్ది రోజులుగా వర్షాలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. వరదలతో నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కోత్వాలీ నది ఉద్దృతంగా ప్రవహిస్తోంది. దీంతో యూపీ-ఉత్తరఖండ్ సరిహద్దుల్లో రోడ్డుపై వరద నీరు ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో హరిద్వార్ వెళ్తున్న ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది. 

ఈ ఘటనలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం.. జేసీపీ మిషన్లతో సహాయక చర్యలు చెపట్టింది. 

జేసీబీ మిషన్‌లతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. ఆ తర్వాత బస్సును కూడా బయటకు లాగారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇదీ చదవండి: తప్పతాగి.. రైల్వే ట్రాక్‌పై కారు నడిపి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement