హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు
న్యూఢిల్లీ: భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ధల్లీ ప్రాంతంలో 8 వాహనాలు శిథిలాల్లో కూరుకుపోయినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్ రోహన్ చంద్ ఠాకూర్ తెలిపారు. ధల్లీ– షోగీ రహదారిపై కొండ చరియలు కుప్పకూలడంతో భారీ సంఖ్యలో ట్రక్కులు నిలిచిపోయాయన్నారు. ప్రమాదం లో మూడు ఇళ్లు, ఓ గుడి దెబ్బతిన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నహన్, పొంటా సాహెబ్ పట్టణాల్లో సరా సరి 137 మి.మీ, నైనాదేవీలో 118 మి.మీ. వర్షపాతం నమోదైందన్నారు.
మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరులోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. గడచిన 12 గంటల్లో బెంగళూరులో 35 మి.మీ. వర్షం కురియడంతో బెగుర్ సరస్సు గట్టు తెగి పోయిందని అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవ కాశముందని అధికారులు హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్, అస్సాం, బిహార్‌లో వరద ప్రభావంతో కొత్తగా ప్రజ లెవరూ మరణించలేదని తెలిపారు.