కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: వడదెబ్బ మృతులను కూడా విపత్తు మరణాల జాబితాలో చేర్చి జాతీయ/రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ. 1.5 లక్షల సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 5వ తేదీ మధ్య 1,377 మంది వడదెబ్బతో మృతిచెందారని, 2003 వేసవిలో మూడు వేల మంది వడదెబ్బతో చనిపోయారని, ఈ దృష్ట్యా వడదెబ్బ మరణాలను విపత్తుల కిందకు చేర్చాలని తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే చలిగాలి మరణాలు విపత్తుల జాబితాలో ఉన్నాయని, అలాగే వడదెబ్బను కూడా విపత్తుగానే పరిగణించాలని కోరారు.
విపత్తుల జాబితాలోకి వడదెబ్బ మరణాలు!
Published Fri, Aug 9 2013 6:46 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
Advertisement
Advertisement