హిందూపురం అర్బన్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బకు గురై ఇద్దరు మరణించారు. హిందూపురం మున్సిపల్ పరిధి కొట్నూరులో నంజుండప్ప(45) వడదెబ్బతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గడచిన 30న పొలం పనులు చేస్తుండగా వడదెబ్బతో అస్వస్థతకు గురైన నంజుండప్పను కుటుంబ సభ్యులు హిందూపురం ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గుమ్మఘట్ట(రాయదుర్గం) : గుమ్మఘట్ట మండలం వై.గుండ్లపల్లిలో జూగన్నగారి భీమప్ప(65) వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పగలంతా పొలంలో పని చేసి, తిరిగి ఇంటికి బయలుదేరగా వడదెబ్బకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు వివరించారు. విషయం తెలియగానే తహసీల్దార్ అఫ్జల్‌ఖాన్, వైద్యాధికారి డాక్టర్ రమేశ్, వీఆర్‌ఓ చంద్రశేఖర్ గ్రామానికెళ్లి మృత దేహాన్ని పరిశీలించారు.
వడదెబ్బకు ఇద్దరి బలి
Published Wed, May 3 2017 12:05 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
Advertisement
Advertisement