గుత్తి (గుంతకల్లు) : జిల్లాలో వడదెబ్బ సోకి శనివారం ఇద్దరు మృతి చెందారు. గుత్తిలోని బెస్తగేరికి చెందిన చెరుకు రాజు(52) వడదెబ్బ సోకి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. లారీ డ్రైవర్‌గా పని చేసే రాజు రెండ్రోజులుగా కర్నూలు-అనంతపురం మధ్య తిరిగినట్లు వివరించారు. శుక్రవారం సాయంత్రం ఇంటికొచ్చిన కాసేపటికే ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడన్నారు. ఆ వెంటనే వాంతులు, వీరేచనాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు సెలైన్ ఎక్కించి ఇంటికి పంపారు. అయితే శనివారం తెల్లవారుజామున నిద్రలోనే మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఉరవకొండ రూరల్ మండలంలో...
ఉరవకొండ రూరల్ : మండలంలోని ఆమిద్యాలలో నాగరాజు(39) అనే కూలీ వడదెబ్బ సోకి మరణించాడని గ్రామస్తులు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరుకు కూలీ పనులకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో తనకు నీరసంగా ఉందంటూ ఒక్కసారి సొమ్మసిల్లిపడిపోవడంతో తోటి కూలీలు హుటాహుటిన ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య తిప్పమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వడదెబ్బతో ఇద్దరి మృతి
Published Sun, May 7 2017 12:26 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
Advertisement
Advertisement