స్పెయిన్‌ యంత్రాంగం ఉరుకులు పరుగులు | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌ యంత్రాంగం ఉరుకులు పరుగులు

Published Fri, Aug 4 2017 3:50 PM

స్పెయిన్‌ యంత్రాంగం ఉరుకులు పరుగులు

మాడ్రిడ్‌(స్పెయిన్‌): అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు స్పెయిన్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. వెర్డాంట్‌ గలీసియా ప్రాంతంలోని వెరిన్‌ పట్టణ సమీపంలో గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన మంటలు ఇప్పటి వరకు మూడువేల ఎకరాల్లో అడవిని బూడిదగా మార్చేశాయి. ఎండలు, వేడి గాలులు దీనికి తోడుకావటంతో మంటలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు 400మంది ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

వీరితోపాటు 12 హెలికాప్టర్లు, ఏడు ప్రత్యేక విమానాలతో నీళ్లు చల్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంటలు అదుపులోకి రానప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకున్నామని ఫైర్‌ అధికారులు తెలిపారు. పొరుగునే ఉన్న పోర్చుగల్‌ అడవుల్లో గత జూన్‌లో చెలరేగిన మంటలు 64మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. వీరంతా మంటల బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నవారే కావటం గమనార్హం.

Advertisement
Advertisement