అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు వ్యాప్తి స్తోంది. కార్చిచ్చు బారినపడి ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు అధికారులు ప్రకటిం చారు. శనివారం మరో 14 మృతదేహాలను గుర్తించారు. ఇందులో 10 మృతదేహాలు ఒక్క ప్యారడైజ్ నగరంలోనే స్వాధీనం చేసుకున్నారు. ప్యారడైజ్‌లో ఇప్పటివరకు 6,700కు పైగా ఇళ్లు అగ్ని అహుతి కాగా, మొత్తం 19 మంది మరణించారు. కార్చిచ్చు ధాటికి లక్ష ఎకరాలకు పైగా అడవి అగ్నికి ఆహుతి కాగా, ఒక్క వెంచురాకౌంటీ ప్రాంతంలోనే 15వేల ఎకరాలు బూడిదయింది. మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు మరో 3 వారాలు పడుతుందని అధికారులు అంటున్నారు.
కాలిఫోర్నియాను చుట్టేసిన కార్చిచ్చు
Published Mon, Nov 12 2018 5:55 PM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement