
హాలీవుడ్ నిర్మాత, అమెరికన్ వ్యాపారవేత్త స్టీవ్ బింగ్ (55) మృతి చెందారు. డిప్రెషన్ కారణంగా లాస్ ఏంజెల్స్‌లోని ఓ భవంతి పైనుంచి కిందకు దూకి స్టీవ్ ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. యానిమేటెడ్ ఫిల్మ్ ‘ది పోలార్ ఎక్స్‌ప్రెస్’ (2004)ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు స్టీవ్. ఈ చిత్రంలోని లీడ్ క్యారెక్టర్‌కు ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్‌హ్యాంక్స్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కొన్ని సినిమాలకు ఫైనాన్షియర్‌గా కూడా ఉన్న స్టీవ్ ‘కంగారూ జాక్’ (2003) అనే చిత్రానికి ఒక రచయితగా వ్యవహరించారు. రియల్ ఎస్టేట్, పొలిటికల్ రంగాల్లో కూడా స్టీవ్ తనదైన ముద్ర వేశారని హాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. స్టీవ్ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ, వ్యాపార రంగ ప్రముఖులు ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment