
లాస్ ఏంజెలిస్‌లో ఓ చిన్నారిని ఎత్తుకున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో అమెరికా వెళ్లిన మంత్రి కె.తారకరామారావుకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఆదివారం ఉదయం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరానికి ఆయన చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్నారైలతో కొద్దిసేపు ముచ్చటించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేకంగా మాట్లాడిన కేటీఆర్ ‘మన ఊరు–మన బడి’కార్యక్రమానికి తోడ్పడాలని కోరారు. అమెరికాలోని తెలంగాణ బిడ్డలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాయబారులుగా వ్యవహరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment