తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడులు..! | Callaway Golf to set up DigiTech center in Hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడులు..!

Published Tue, Mar 22 2022 9:37 PM | Last Updated on Tue, Mar 22 2022 9:41 PM

Callaway Golf to set up DigiTech center in Hyderabad - Sakshi

హైదరాబాద్​లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన కాల్ అవే గోల్ఫ్ కంపెనీ ముందుకొచ్చింది. ఈమేరకు అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కాల్ అవే గోల్ఫ్​ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. టాప్ గోల్ఫ్ బ్రాండ్​గా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న కాల్ అవే.. హైదరాబాద్​లో నెలకొల్పనున్న నూతన డిజిటెక్ సెంటర్ ద్వారా కొత్తగా 300 మంది ఐటీ ప్రొఫెషనల్స్​కు ఉపాధి కల్పించనుంది. ప్రముఖ గోల్ఫ్‌ బ్రాండ్‌గా కాల్‌ అవే కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 

డిజిటెక్‌ సెంటర్‌తో పాటు గోల్ఫ్ ఉత్పత్తుల తయారీ కొరకు రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను కేటీఆర్‌ కోరారు. తెలంగాణలో స్పోర్ట్స్ టూరిజంలో భాగం కావాలని కంపెనీ ప్రతినిధులను కేటీఆర్‌ ఆహ్వానించారు. అలాగే, తన పర్యటనలో భాగంగా ఫిస్కర్‌ సంస్థ ఛైర్మన్, సీఈఓతో కేటీఆర్‌ బృందం సమావేశం అయింది. భేటీలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) విషయంలో రాష్ట్రం అవలంబిస్తోన్న విధానాలను ఫిస్కర్‌ సంస్థ ప్రతినిధులకు కేటీఆర్‌ వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా కోరారు. కేటీఆర్‌ ఆహ్వానం మేరకు ఫిస్కర్‌ సంస్థకు చెందిన బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి పెట్టుబడుల పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పరిశీలించనుంది.

(చదవండి: సెన్సోడైన్ టూత్‌పేస్ట్‌కు భారీ జరిమానా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement